AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. దేశవ్యాప్తంగా పెరిగిన ప్రీమియం డీజిల్ ధర..!

దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రీమియం డీజిల్ ధర కూడా పెరిగింది. చమురు కంపెనీలు ప్రీమియం డీజిల్ ధరను లీటరుకు సుమారు రూ. 1.50 మేర పెంచాయి. ఈ నిర్ణయం సామాన్య వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి మారకపు రేటులో హెచ్చుతగ్గుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి.

వాహనదారులకు షాకింగ్ న్యూస్.. దేశవ్యాప్తంగా పెరిగిన ప్రీమియం డీజిల్ ధర..!
Diesel Price
Balaraju Goud
|

Updated on: Apr 01, 2026 | 9:19 AM

Share

దేశవ్యాప్తంగా ప్రీమియం పెట్రోల్ ధరలు పెరిగిన నేపథ్యంలో, ప్రీమియం డీజిల్ ధర కూడా పెరిగింది. చమురు కంపెనీలు ప్రీమియం డీజిల్ ధరను లీటరుకు సుమారు రూ. 1.50 మేర పెంచాయి. ఈ నిర్ణయం సామాన్య వినియోగదారులపై నేరుగా ప్రభావం చూపుతుంది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు, రూపాయి మారకపు రేటులో హెచ్చుతగ్గుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చమురు కంపెనీలు తెలిపాయి. నిరంతరం మారుతున్న ప్రపంచ వాతావరణం కారణంగా ఇంధన ధరలు పెరిగాయి. డీజిల్ ధరల పెంపు సోమవారం రాత్రి నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి వచ్చాయి.

ఈ పెరుగుదల వినియోగదారులపై, ముఖ్యంగా రవాణా, లాజిస్టిక్స్, వ్యవసాయ రంగాలలో ఉన్నవారిపై అదనపు భారం పడనుంది. ఢిల్లీలో ప్రీమియం డీజిల్ ధర ఇప్పుడు లీటరుకు సుమారుగా రూ. 95 నుండి రూ. 96 వరకు ఉంది. సాధారణ డీజిల్‌తో పోలిస్తే ప్రీమియం డీజిల్ మెరుగైన మైలేజ్, ఇంజిన్ పనితీరును అందిస్తున్నప్పటికీ, పెరుగుతున్న ధరలు దాని వినియోగాన్ని పరిమితం చేయవచ్చు.

కొత్త ధరలు ఇలా ఉన్నాయి..!

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ తన ప్రీమియం ఇంధనాల ధరలను పెంచింది. కొత్త ధరల ప్రకారం, ఎక్స్‌పి100 (100 ఆక్టేన్) పెట్రోల్ ధర లీటరుకు రూ. 149 నుంచి రూ. 160కి పెరిగింది. ఎక్స్‌ట్రా గ్రీన్ ప్రీమియం డీజిల్ ధర లీటరుకు రూ. 91.49 నుంచి రూ. 92.99కు చేరుకుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us