అమ్మోరు సినిమాలో నేనే చేయాల్సింది.. కానీ మిస్ అయ్యా..! హీరోయిన్ కామెంట్స్
తెలుగులో దేవత సినిమాలు అనగానే ముందు గుర్తొచ్చేది అమ్మోరు సినిమానే.. కోడిరామకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో సౌందర్య, రమ్యకృష్ణ అద్భుతంగా నటించి మెప్పించారు. ఇక ఈ సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు .

సినిమా ఇండస్ట్రీలో తిరుగులేని సినిమా అంటే చెప్పే పేర్లలో అమ్మోరు సినిమా ఒకటే.. 1995 వ సంవత్సరం అప్పటికీ తెలుగునాట గ్రాఫిక్స్ గురించి పెద్దగా తెలియదు. ఆ సమయంలోనే స్టన్ అయ్యే హంగులతో అమ్మోరు చిత్రాన్ని తీసి ప్రేక్షకులు చేత జేజేలు అందుకున్నారు దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ. ఈ సినిమాకు రూ.2 కోట్లు బడ్జెట్ అయితే.. అందులో కేవలం గ్రాఫిక్స్ కోసమే అక్షరాల రూ.80 లక్షలు ఖర్చుపెట్టారట. ఆయన మేకింగ్, టేకింగ్‌కి ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ఈ సినిమాలో లీడ్ రోల్స్ చేసిన రమ్మకృష్ణ, సౌంధర్యల క్రేజ్ నెక్ట్స్ లెవల్‌కి వెళ్లింది. సినిమాకు తండోప తండాలుగా ప్రేక్షకులు తరలివెళ్లారు. మొక్కులు చెల్లించడం, అమ్మవారికి పాలాభిషేకం చేయడం వంటి సీన్స్ థియేటర్స్ వద్ద కనిపించాయి.
ఆమె హీరోయినా.. అస్సలు వద్దు..! డైరెక్టర్‌కు మొహం మీదే చెప్పిన విజయ్ సేతుపతి
ఈ సినిమా అప్పట్లో పది కోట్ల వరకు వసూలు చేసింది. ఇప్పటి లెక్కలో 100 కోట్లు కలెక్ట్ చేసినంత అని చెప్పాలి. ఇక ఈ సినిమాలో సౌందర్య నటన గురించి ప్రత్యేకంగా చెప్పాలి. ఆమె ఎంతో సహజంగా నటించారు. అమ్మోరు భక్తురాలిగా సౌందర్య అభినయానికి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. అలాగే రమ్యకృష్ణ అమ్మవారిగా జీవించేశారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నేనే చేయాల్సింది అంటున్నారు ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు అందమా భామ లయ.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా రాణించిన లయ తర్వాత సినిమాలకు గ్యాప్ ఇచ్చారు. పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయ్యారు లయ. ఆతర్వాత సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టారు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లయ మాట్లాడుతూ.. ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈ క్రమంలోనే సౌందర్య నటించిన అమ్మోరు సినిమా గురుంచి మాట్లాడుతూ.. నేను చైల్డ్ ఆర్టిస్ట్ గా చైల్డ్ లేబర్‌పై ఓ సినిమా చేశాను.. 30 మందిని సెలక్ట్ చేశారు. అందులో మెయిన్ ఎవరు చేయాలనే దానిపై టెస్ట్‌లు పెడితే.. నేను సెలక్ట్ అయ్యాను. ఆ సినిమా చూసి నన్ను అమ్మోరు సినిమాకు సెలక్ట్ చేశారు. అయితే ఆ సినిమా సమయానికి నేను 4వ తరగతి.. కానీ అమ్మోరు సినిమాకు నన్ను అనుకున్నప్పుడు నేను 7వ తరగతి దాంతో ఆ పాత్రకు నేను పెద్దదాన్ని అయ్యిపోతాను అని భావించారు. అందుకే ఆ పాత్ర సునయన చేశారు అని తెలిపారు లయ.
రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




