AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Balakrishna: నందమూరి బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఇదే.. మూవీ ఫ్లాప్‌ అయినా సాంగ్స్ సూపర్ హిట్

తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి నందమూరి బాలకృష్ణది ప్రత్యేక శైలి. మాస్ రోల్స్ లో అదరగొట్టే బాలయ్య ఏ హీరోలకు సాధ్యం కాని విధంగా పౌరాణికాలు, జానపద సినిమాల్లోనూ నటించారు. అయితే బాలయ్య ఒకే ఒక్క సినిమాలో విలన్ గా నటించారు.

Balakrishna: నందమూరి బాలకృష్ణ విలన్‌గా నటించిన ఏకైక సినిమా ఇదే.. మూవీ ఫ్లాప్‌ అయినా సాంగ్స్ సూపర్ హిట్
Balakrishna
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 9:24 PM

Share

నందమూరి నటసింహం బాలకృష్ణ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నారు. బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో డబుల్ హ్యాట్రిక్ అందుకున్న బాలయ్యకు అఖండ 2 తాండవం కాస్త బ్రేకులు వేసినా ఇప్పుడు మళ్లీ వరుసగా సినిమాలను లైన్ లో పెడుతున్నారు. ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా (ఎన్బీకే 111) చేస్తున్నారు బాలకృష్ణ. గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన వీరసింహారెడ్డి సినిమా ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడీ కాంబినేషన్ లో మరో మూవీ రానుండడడంతో అభిమానుల అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఆ మధ్యన బాలయ్య పుట్టిన రోజున విడుదలైన ఈ సినిమా టీచర్ నందమూరి అభిమానులకు పూనకాలు తెప్పించింది. దీంతో పాటు కొరటాల శివ డైరెక్షన్ లో నూ ఓ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు బాలయ్య. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ పట్టాలెక్కించారు. కాగా ఇప్పటివరకు బాలయ్య 110 సినిమాలు చేస్తే అందులో దాదాపు అన్ని హీరో పాత్రలే. అయితే ఇప్పటివరకు ఆయన కేవలం ఒకే ఒక్క సినిమాలో మాత్రమే విలన్ గా నటించారు. అది కూడా పవర్ ఫుల్ రోల్ లో. ఇంతకీ ఆ సినిమా ఏదనుకుంటున్నారా?

సమర సింహారెడ్డి లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత బాలకృష్ణ నటించిన సినిమా సుల్తాన్. శరత్ తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీలో బాలయ్య డబుల్ రోల్ లో నటించాడు. అలాగే సూపర్ స్టార్ కృష్ణ, రెబెల్ స్టార్ కృష్ణం రాజు కీలక పాత్రలు పోషించారు. రచన, రోజా, దీప్తీ భట్నాగర్ హీరోయిన్స్ గా నటించారు. 1999లో విడుదలైన ఈ సినిమా బాలయ్య అభిమానులను మెప్పించిందీ కానీ సగటు ఆడియెన్స్ ను ఆకట్టుకోలేకోయింది. ముఖ్యంగా కరడుగట్టిన ఉగ్రవాది పాత్రలో బాలయ్యను చూడలేకపోయారు ఆడియెన్స్. అయితే ఈ మూవీలో బాలయ్య గెటప్పులు అభిమానులకు తెగ నచ్చేశాయి. ఇక ఈ సినిమాలోని పాటలైతే ఆడియెన్స్ ను ఉర్రూతలూగించాయి. కోటి ఈ సినిమాకు సంగీతం అందించగా పాటలన్నీ చార్ట్ బస్టర్ గా నిలిచాయి. దురదృష్టకరమైన విషయమేమిటంటే.. ఈ సినిమా ఒరిజినల్ వెర్షన్ యూట్యూబ్ లో లేదు కానీ హిందీ వెర్షన్ మాత్రం ఉంది. అయితే ఈ సినిమాలోని కొన్ని హైలెట్ సీన్స్, పాటలు మాత్రం యూట్యూబ్ లో అందుబాటులో ఉన్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us