యూరప్‌లో ఎండల విధ్వంసం.. కరిగిపోతున్న యూకే రోడ్లు..4 రోజుల్లో 1,000 మంది మృతి
యూరప్‌ను వణికిస్తున్న 2026 వేసవి హీట్‌వేవ్ కారణంగా పలు దేశాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయి. ఫ్రాన్స్‌లో కేవలం నాలుగు రోజుల్లో వెయ్యి మరణాలు సంభవించగా, యూకేలో రోడ్లు కరిగిపోతున్నాయి. ఈ అసాధారణ వేడికి కారణం, భారతీయ పర్యాటకులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రయాణ సలహాలు ఈ కథనంలో.
యూరప్ ఖండం 2026 వేసవిలో చరిత్రలోనే అత్యంత తీవ్రమైన హీట్‌వేవ్‌ను ఎదుర్కొంటోంది. ఫ్రాన్స్, స్పెయిన్, ఇటలీ, యూకే సహా పలు దేశాలు అసాధారణ ఉష్ణోగ్రతలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయి. ముఖ్యంగా ఫ్రాన్స్‌లో పరిస్థితి ఆందోళనకరంగా మారింది. అధికారిక ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం, జూన్ 24 నుంచి కేవలం నాలుగు రోజుల్లోనే తీవ్రమైన వేడి ప్రభావంతో దాదాపు వెయ్యి అదనపు మరణాలు నమోదయ్యాయి. ఈ మరణాలలో 85 శాతం మంది 65 ఏళ్లకు పైబడినవారే కావడం గమనార్హం. ఇటలీ, స్పెయిన్, ఫ్రాన్స్‌లోని ప్రధాన నగరాల్లో అధికారులు రెడ్ అలర్ట్ ప్రకటించారు. జూన్ 29 నుంచి జులై 1 మధ్యకాలంలో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల సెల్సియస్ ను తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. అధిక వేడి కారణంగా యూకేలో రోడ్లు కరిగిపోతుండగా, ఫ్రాన్స్‌లో పాఠశాలలు మూతపడుతున్నాయి. రవాణా వ్యవస్థపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. ఎయిర్ పోర్ట్ రన్ వేలు మెత్తబడటం, రైల్వే పట్టాలు వంగిపోయే ప్రమాదం ఉండటంతో విమానాలు, రైళ్ల షెడ్యూల్స్ మారుతున్నాయి. భారతీయ పర్యాటకులు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
అంచనాలు పెంచేస్తున్న సెకండాఫ్ మూవీస్.. ఫస్టాఫ్ గాయాలను మరిపిస్తుందా..?
ఆలియా సినిమాపై ప్రభాస్ ట్వీట్.. ఆన్‌లైన్‌లో నయా డిస్కషన్
జస్ట్ 80 డేస్… క్రేజీ న్యూస్ రివీల్ చేసిన జక్కన్న
టాక్సిక్ టీజర్… మరింత బోల్డ్‌గా లేడీస్ గ్యాంగ్
నిరాశపరిచిన ఫస్టాఫ్… సెకండాఫ్ సంగతేంటి?
ఆలయంలో ఎదురుపడ్డ నాగుపాము,పిల్లి.. ఆ తర్వాత జరిగిందిదే..
గర్భవతినని బాస్‌కి మెసేజ్ చేసిన మహిళ.. 3 గంటల్లోనే ఉద్యోగం ఊస్ట్
స్కూలు అయిపోగానే తాళం వేసి వెళ్లిపోయిన టీచర్.. ఆ తర్వాత
శివాలయంలో అద్భుతం.. నూనెతో అభిషేకం చేస్తే పాలుగా మారి
75,000 ఏళ్ల నాటి రహస్య ప్రపంచం.. సైంటిస్టుల క్రేజీ ఆవిష్కరణ!
కైలాసగిరి మంచులింగం.. ఫ్రిజ్‌లో దర్శనం!
లైక్స్ కోసం ఇంతకు తెగించావా తల్లీ!

