టాక్సిక్ టీజర్… మరింత బోల్డ్‌గా లేడీస్ గ్యాంగ్
యష్ టాక్సిక్ సినిమా నుంచి విడుదలైన లేడీస్ అండ్ లేడీస్ టీజర్ భారీ అంచనాలను పెంచింది. నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియా పవర్‌ఫుల్ అవతార్లలో కనిపించి ఆడియన్స్‌ను ఆకట్టుకున్నారు. బోల్డ్ కంటెంట్, భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్న ఈ సినిమా కుటుంబ ప్రేక్షకులను దూరం చేస్తుందా అనే చర్చకూడా జరుగుతోంది.
కేజీఎఫ్ ఫ్రాంచైజీతో పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్, త్వరలో టాక్సిక్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. భిన్నమైన జానర్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమా నుంచి ఇటీవల లేడీస్ అండ్ లేడీస్ టీజర్ విడుదలైంది. ఇప్పటివరకు హీరోకి సంబంధించిన గ్లిమ్స్ మాత్రమే అందించిన యూనిట్, ఈ టీజర్‌లో సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్న నయనతార, కియారా అద్వానీ, హ్యూమా ఖురేషీ, రుక్మిణి వసంత్, తారా సుతారియాలను పవర్‌ఫుల్ అవతార్స్‌లో పరిచయం చేసింది. ఈ టీజర్‌తో సినిమాపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. హీరో పాత్రతో పాటు హీరోయిన్‌లకు కూడా సమాన ప్రాధాన్యం ఇస్తున్నట్లు టీజర్ స్పష్టం చేసింది. అయితే, టీజర్‌లో కనిపించిన బోల్డ్ కంటెంట్ సినిమాకు ప్లస్ అవుతుందా, లేదా కుటుంబ ప్రేక్షకులను దూరం చేస్తుందా అనే చర్చ కూడా మొదలైంది.
పరిహారంలోనూ పక్షపాతమేనా? రాజీవ్ రహదారి బాధితుల ఆవేదన !
ఏం..పిచ్చిపిచ్చిగా ఉందా?.. ట్రంప్ ఆంక్షలపై ఇరాన్ ఫైర్! తగ్గేదే లే
ముంచుకొస్తున్న అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాలకు వానగండం..
వందేమాతరం గీతానికి అరుదైన గౌరవం!
భారత్‌కు టైఫూన్ 'డాల్ఫిన్' దెబ్బ..మన రుతుపవనాల పై ఎఫెక్ట్!
గొర్రెల మంద వద్ద వలలో చిక్కుకున్నది చూసి.. కాపరులు పరుగో పరుగు
అందమైన అమ్మాయి డీపీ చూసి టెంప్ట్ అయ్యాడు.. రూ.20 లక్షలు గోవింద!

