AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aarthi Agarwal: హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్‌ను భ్రష్టు పట్టించింది అతనే.. అసలు విషయం చెప్పిన నిర్మాత

తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగింది ఆర్తి అగర్వాల్. కానీ ఎంత త్వరగా స్టార్ స్టేటస్ తెచ్చుకుందో అంతే త్వరగా ఫేడవుట్ అయిపోయింది. దీనికి తోడు వ్యక్తిగత సమస్యలు ఆర్తి అగర్వాల్ కెరీర్ ను మసకబార్చాయి.

Aarthi Agarwal: హీరోయిన్ ఆర్తి అగర్వాల్ కెరీర్‌ను భ్రష్టు పట్టించింది అతనే.. అసలు విషయం చెప్పిన నిర్మాత
Arthi Agarwal
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 8:31 PM

Share

విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన ‘నువ్వు నాకు నచ్చావ్’ సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది ఆర్తి అగర్వాల్. మొదటి సినిమాతోనే సూపర్ హిట్ అందుకుంది. యాక్టింగ్ పరంగా కూడా మంచి మార్కులు కొట్టేసింది. దీని తర్వాత స్టార్ హీరోలతో కలిసి సూపర్ హిట్ సినిమాల్లో నటించిందీ అందాల తార. మెగాస్టార్ చిరంజీవితో ‘ఇంద్ర’, మహేష్ బాబుతో ‘బాబీ’, బాలకృష్ణతో ‘పల్నాటి బ్రహ్మనాయుడు’, నాగార్జునతో ‘నేనున్నాను’, ప్రభాస్‌తో ‘అడవి రాముడు’, జూనియర్ ఎన్టీఆర్‌తో అల్లరి రాముడు, నరసింహుడు, తరుణ్ తో నువ్వు లేక నేను లేను, సోగ్గాడు, ఉదయ్ కిరణ్ తో నీ స్నేహం, రవితేజతో వీడు, వెంకీతో సంక్రాంతి, గోరింటాకు.. ఇలా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో కథానాయికగా చేసింది ఆర్తి. తన అందం, అభినయంతో అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఆర్తి అంతే త్వరగా ఫేడవుట్ అయిపోయింది. ఆమె చేసిన సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. దీనికి తోడు వ్యక్తిగత సమస్యలు కూడా చుట్టుముట్టాయి. దీంతో చిన్న వయసులోనే ఈ లోకం నుంచి వెళ్లిపోయిందీ అందాల తార. అయితే ఆర్తి కెరీర్ మసకబారడానికి ప్రేమ ఇతర విషయాలు కావంటున్నారు ప్రముఖ నిర్మాత చంటి అడ్డాల. ఆ మధ్యన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన ఆర్తి గురించి పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు.

‘ఎన్టీఆర్‌ హీరోగా నేను నిర్మించిన `అల్లరి రాముడు` సినిమాకి మొదట ఛార్మిని తీసుకున్నాం. కానీ ఆమె కాస్త బొద్దుగా ఉండటంతో ఎన్టీఆర్‌కి సెట్‌ కాదని, అప్పటికే ఫుల్ సక్సెస్‌లో ఉన్న ఆర్తిని ఎంపిక చేశాం. ఆ సినిమా సక్సెస్‌ కావడంతో ప్రభాస్ `అడవి రాముడు`లోకి కూడా ఆర్తీనే హీరోయిన్ గా తీసుకున్నాం. సినిమాల సంగతి పక్కన పెడితే.. ఆర్తి అగర్వాల్ మనసు బంగారం. కానీ ఆమె వందకి200 శాతం వాళ్ల పేరెంట్స్ పై డిపెండ్‌ అయ్యేది. వారు ఏం చెబితే అది చేసేది. తల్లిదండ్రులు సెట్ లో లేకపోతే ఆమె చాలా కంఫర్ట్ గా ఉండేది. మాకు నచ్చిన ఔట్ పుట్ ఇచ్చేది. పేరెంట్స్ వచ్చినప్పుడు మాత్రం షూటింగ్‌లో చాలా ఇబ్బంది పడేది. ముఖ్యంగా ఆమె తండ్రి ప్రతి దానికి అడ్డు పడేవాడు. షూటింగ్‌ కు ఎప్పుడు వెళ్లాలి? ఎప్పుడు ప్యాకప్‌ ఎప్పుడు చెప్పాలో కూడా ఆయనే నిర్ణయించేవాడు. నిజానికి ఆర్తి ఫేడౌట్‌ కావడానికి ఓ రకంగా వాళ్ల నాన్నే కారణం. ఆయన ఆర్తికి సంబంధించి ప్రతి విషయంలో ఇన్వాల్స్ కాకపోయి ఉంటే ఆమె కెరీర్ మరోలా ఉండేది. మంచి పొజిషన్‌కి వెళ్లేది’ అని చెప్పుకొచ్చారు చంటి అడ్డాల.

కాగా ఆర్తి అగర్వాల్ హీరో తరుణ్‌తో ప్రేమాయణం సాగించిందని రూమర్లు ఉన్నాయి. అయితే ఆ ప్రేమ విఫలమైనందుకే ఆమె ఆత్మహత్యకు పాల్పడిందని ప్రచారం కూడా జరిగింది. ఈ సమస్యలన్నింటినీ అధిగమించిన ఆర్తి ఉజ్వల్‌ కుమార్‌ని పెళ్లి చేసుకుంది. కానీ ఆ బంధం కూడా నిలవలేక పోయింది. రెండేళ్లకే ఆయన్నుంచి విడాకులు తీసుకుంది. ఆ తర్వాత మళ్లీ సినిమా కెరీర్‌ని మొదలు పెట్టింది. కానీ విజయాలు మాత్రం రాలేదు. ఇదే క్రమంల బరువు తగ్గించుకునే క్రమంలో వైద్యం వికటించి ఆర్తి కన్నుమూసింది. 2015 జూన్‌ 6న గుండెపోటుతో కన్నుమూసింది ఆర్తి అగర్వాల్. అప్పటికి ఆమెకు ఇంకా కేవలం 31 ఏళ్లే కావడం శోచనీయం.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us