AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..

టెక్ ప్రపంచంలో శాంసంగ్ సరికొత్త ప్రయోగానికి సిద్ధమైంది. గతంలోనే వేరబుల్స్ విభాగంలో మార్పులు తీసుకురానున్నట్లు ప్రకటించిన సంస్థ, తాజాగా AI ఫీచర్లతో కూడిన స్మార్ట్ గ్లాసెస్‌ను పరిచయం చేయడానికి అడుగులు వేస్తోంది. తాజాగా లీక్ అయిన వివరాలు ఈ గ్యాడ్జెట్ పట్ల టెక్ ప్రియుల్లో భారీ అంచనాలను పెంచేశాయి. అసలు ఈ స్మార్ట్ గ్లాసెస్ ఎలా పనిచేస్తాయి? వీటిలో ఉన్న ప్రత్యేకతలు ఏంటి?

మార్కెట్‌లో సంచలనానికి శాంసంగ్ మరోసారి రెడీ..! ఈసారి కొత్త ప్రొడక్ట్‌తో..
Samsung Galaxy Smart Glasses.jpg
Nikhil
|

Updated on: Jul 03, 2026 | 11:01 PM

Share

స్మార్ట్ ఫోన్ల తర్వాత వేరబుల్స్ విభాగంలో మరో కీలక అడుగు పడింది. గూగుల్ సదస్సులో కొన్ని మోడళ్లను ప్రదర్శించిన శాంసంగ్, ఇప్పుడు పూర్తిగా గెలాక్సీ గ్లాసెస్ రూపంలో వినియోగదారులను ఆశ్చర్యపరచనుంది. తాజాగా ఇంటర్నెట్‌లో లీక్ అయిన యాప్ స్క్రీన్‌షాట్లు ఈ కొత్త గ్యాడ్జెట్ పనితీరుపై క్లారిటీ ఇచ్చాయి. స్టైలిష్ లుక్, అత్యాధునిక ఫీచర్లతో వస్తున్న ఈ స్మార్ట్ గ్లాసెస్ గురించి తెలుసుకుందాం.

గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్

శాంసంగ్ తమ కొత్త స్మార్ట్ గ్లాసెస్‌ను సులభంగా కంట్రోల్ చేయడానికి ‘గెలాక్సీ గ్లాసెస్ మేనేజర్’ అనే ప్రత్యేక యాప్‌ను రూపొందించింది. ఈ యాప్ ద్వారా వినియోగదారులు తమ స్మార్ట్‌ఫోన్‌కు గ్లాసెస్‌ను కనెక్ట్ చేసుకోవచ్చు. గ్లాసెస్ నోస్ బ్రిడ్జ్ మీద ఉన్న ప్రొటెక్టివ్ ఫిలిమ్ తొలగించి, పవర్ స్విచ్ ఆన్ చేయాలి. అనంతరం గ్లాసెస్‌ను ఛార్జింగ్ కేస్‌లో ఉంచితే, బ్లూటూత్ ద్వారా ఫోన్‌తో కనెక్ట్ అవుతాయి. స్టైలిష్ బ్లాక్ కలర్ ఛార్జింగ్ కేస్‌తో వస్తున్న ఈ గ్లాసెస్, చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి. యాప్ ద్వారా సాఫ్ట్‌వేర్ అప్‌డేట్స్ పొందడం, ఫీచర్లను నియంత్రించడం చాలా సులభం.

అద్భుతమైన ఫీచర్లు

ఈ స్మార్ట్ గ్లాసెస్ One UI XR సాఫ్ట్‌వేర్‌పై పనిచేస్తాయని సమాచారం. వీటి ద్వారా తీసిన ఫోటోలు, వీడియోలను నేరుగా ఫోన్‌లోకి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అలాగే, గ్లాసెస్ ఎక్కడైనా పోతే వెతకడానికి ‘ఫైండ్ మై గ్లాసెస్’ అనే ఆప్షన్ కూడా ఇందులో ఉంది. జులై 22న లండన్‌లో జరగబోయే గెలాక్సీ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో శాంసంగ్ వీటిని అధికారికంగా లాంచ్ చేసే అవకాశం ఉంది. వార్బీ పార్కర్, జెంటిల్ మాన్‌స్టర్‌లతో కలిసి రూపొందించిన ఈ గ్లాసెస్, కేవలం టెక్ పరికరం మాత్రమే కాదు, ఒక ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌గా కూడా నిలుస్తాయి. AI ఫీచర్లతో రానున్న ఈ స్మార్ట్ గ్లాసెస్ మార్కెట్లో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాయో వేచి చూడాలి. ఆధునిక కాలానికి తగ్గట్టుగా రూపొందించిన ఈ పరికరం, భవిష్యత్తులో మన దైనందిన జీవితంలో ఒక భాగంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. టెక్ ప్రియులు మరియు గ్యాడ్జెట్ లవర్స్ ఈ లాంచ్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!
మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!