AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చల్లని వానలో.. వేడి వేడి అన్నంలో.. ఈ పచ్చడి కాస్తింత వేసుకుని నెయ్యితో తిన్నారంటే..!

దోసకాయ, పచ్చిమిర్చి, నువ్వులతో చేసే ఈ ఆంధ్రా స్టైల్ పచ్చడి వేడి అన్నంలో నెయ్యితో తింటే అద్భుతమైన రుచి అందిస్తుంది. సులభంగా తయారయ్యే ఈ ఆంధ్రా స్టైల్ పచ్చడి ఘాటు, పులుపు, సువాసనల కలయికతో ప్రత్యేక రుచిని అందిస్తుంది. చివరగా ఆవాలు, మినప్పప్పు, శనగపప్పుతో తాలింపు వేయడం వల్ల మరింత రుచిగా మారుతుంది. అన్నంతో పాటు ఇడ్లీ, దోసె, రాగి సంగటి, జొన్న రొట్టెలతో కూడా ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది..

Srilakshmi C
|

Updated on: Jul 03, 2026 | 8:28 PM

Share
దోసకాయ–పచ్చిమిర్చి పచ్చడి తయారీ కోసం.. దోసకాయ 1 పెద్దది, పచ్చిమిర్చి 20 నుంచి 25, నువ్వులు 3 టేబుల్ స్పూన్లు, చింతపండు చిన్న నిమ్మకాయంత, ఉప్పు 1½ టీస్పూన్లు లేదా రుచికి సరిపడా, వెల్లుల్లి రెబ్బలు 5 నుంచి 6 (ఐచ్చికం), నూనె 2 టేబుల్ స్పూన్లు తీసుకోవాలి. తాలింపు కోసం నూనె 2 టేబుల్ స్పూన్లు, ఆవాలు 1 టీస్పూన్, జీలకర్ర ½ టీస్పూన్, మినప్పప్పు 1 టీస్పూన్, శనగపప్పు 1 టీస్పూన్, ఎండు మిర్చి 2 నుంచి 3, కరివేపాకు 1 రెమ్మ, ఇంగువ చిటికెడు తీసుకోవాలి. ఇక దోసకాయ–పచ్చిమిర్చి పచ్చడి ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం..

1 / 5
ముందుగా దోసకాయను శుభ్రంగా కడిగి. తొక్క తీసి రెండు ముక్కలుగా కోసి గింజలతోపాటు చిన్న చిన్నముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి వేయించడం కోసం పాన్‌లో ఒక టేబుల్ స్పూన్ నూనె వేయాలి. పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేయాలి. మధ్య మంటపై 5 నుంచి 7 నిమిషాలు వేయించాలి. పచ్చి వాసన పోయి కొద్దిగా రంగు మారే వరకు కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నువ్వులు వేసి మరో 2 నుంచి 3 నిమిషాలు వేయించాలి. నువ్వులు చిటపటలాడుతూ మంచి వాసన వచ్చే వరకు కలపాలి. ఆ తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి.

2 / 5
ఇప్పుడు మిక్సీ జార్‌లో వేయించిన పచ్చిమిర్చి, నువ్వులు వేయాలి. చింతపండు, ఉప్పు, వెల్లుల్లి రెబ్బలు కూడా వేయాలి. ముందుగా ఒకసారి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఇప్పుడు దోసకాయ ముక్కలు జార్‌లో వేయాలి. దీన్ని 2–3 పల్సులు మాత్రమే మిక్సీలో తిప్పాలి. పచ్చడి పూర్తిగా పేస్ట్ కాకుండా కొద్దిగా గరుకుగా ఉంటేనే రుచి బాగుంటుంది.

3 / 5
తర్వాత కడాయిలో 2 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేయాలి. ఆవాలు, జీలకర్ర వేయాలి. తరువాత మినప్పప్పు, శనగపప్పు వేసి బంగారు రంగు వచ్చే వరకు వేయించాలి. ఎండు మిర్చి, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు సిద్ధం చేయాలి. గ్రైండ్ చేసిన పచ్చడిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. వేడి తాలింపును పై నుంచి పోయాలి. బాగా కలిపి 10 నిమిషాలు ఉంచాలి. అంతే ఘుమఘుమలాడే దోసకాయ-పచ్చిమిర్చి పచ్చడి రెడీ అయినట్లే. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ పచ్చడిని కలుపుకుని తింటే అద్భుతమైన రుచి వస్తుంది. దీనిని ఇడ్లీ, దోసె, రాగి సంగటి, జొన్న రొట్టెలతో కూడా బాగా సరిపోతుంది.

4 / 5
ఎక్కువ కారం కావాలంటే 25–30 పచ్చిమిర్చి వాడవచ్చు. చింతపండు ఎక్కువ వేస్తే దోసకాయ రుచి తగ్గుతుంది. నువ్వులు వేయడం వల్ల పచ్చడికి మంచి గాఢమైన రుచి, సువాసన వస్తుంది. ఫ్రిజ్‌లో ఉంచితే 2–3 రోజులు తాజాగా ఉంటుంది.

5 / 5
Follow Us
బిగ్ బాస్ 10 లాస్ట్ కంటెస్టెంట్ గా 'గుప్పెడంత మనసు' సీరియల్ నటుడు

మీకు 50 ఏళ్లు వచ్చేసరికి కనీసం కోటి రూపాయలు ఉండాలంటే ఏం చేయాలి?

బిగ్‌బాస్‌ 10లోకి యాంకర్ వర్షిణీ.. శ్రీముఖిలా సత్తా చాటుతుందా?

ఇంట్లో ఎంత నగదు ఉంచుకోవాలి? అవసరమైన దానికంటే ఎక్కువ ఉంచుకుంటే..

ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఆ ఒక్క యాక్సిడెంట్ అంతా మార్చేసింది..
ఇతను రూ.90 లక్షల జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి ఏం చేశాడో తెలుసా?

మోడలింగ్ టు బిగ్‌బాస్.. సృష్టి వ్యాకరణం గురించి ఈ విషయాలు తెలుసా?

సత్య నికేతన్‌లో కుప్పకూలిన భవనం.. ముగ్గురు మృతి, శిథిలాల కింద..

వైభవ్ సూర్యవంశీ @ 6.. చేజారిన చారిత్రత్మక రికార్డ్

మీకు PF ఖాతా ఉందా? ఈ చిన్న పని చేయకపోతే డబ్బులు ఆగిపోయే అవకాశం..!