AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్‌తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం

ఆన్‌లైన్ డేటింగ్ యాప్‌లు నేటి యువతకు సులభంగా పరిచయాలు పెంచుకోవడానికి తోడ్పడుతున్నప్పటికీ, కొన్నిసార్లు అవి తీవ్ర మానసిక క్షోభకు, క్రైమ్ సంఘటనలకు దారితీస్తున్నాయి. తాజాగా, హైదరాబాద్ నగరంలో చోటుచేసుకున్న ఒక సైబర్ క్రైమ్ ఉదంతం డిజిటల్ పరిచయాల పట్ల ఎంత అప్రమత్తంగా ఉండాలో మరోసారి గుర్తుచేస్తోంది.

డేటింగ్ యాప్‌లో పరిచయం..ఎంగేజ్మెంట్‌తో అసలు గుట్టు రట్టు! కట్‌చేస్తే పోలీసుల రంగప్రవేశం
Hyderabad Dating App Case
Ranjith Muppidi
| Edited By: |

Updated on: Aug 14, 2026 | 5:59 PM

Share

హైదరాబాద్‌లో డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన వ్యక్తితో పెళ్లి ఫిక్స్ అయిన అనంతరం చోటుచేసుకున్న పరిణామాలు తీవ్ర వివాదానికి దారితీశాయి. పెళ్లి రద్దు చేసుకున్న తర్వాత తనను సోషల్ మీడియా వేదికగా వేధిస్తూ, తప్పుడు ప్రచారం చేస్తున్నాడని ఓ మహిళ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని కూడా ఫిర్యాదులో పేర్కొంది.

పోలీసుల వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన మహిళకు డేటింగ్ యాప్ ద్వారా ఏఆర్ వంశీ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. కొంతకాలం తర్వాత ఇద్దరి మధ్య సాన్నిహిత్యం పెరగడంతో వివాహానికి అంగీకరించారు. అనంతరం ఇరు కుటుంబాల సమక్షంలో నిశ్చితార్థం కూడా జరిగినట్లు బాధితురాలు తన ఫిర్యాదులో పేర్కొంది. నిశ్చితార్థం అనంతరం వంశీ తన వద్ద నుంచి రూ.15 లక్షలు తీసుకున్నాడని మహిళ ఆరోపించింది. అంతేకాకుండా పెళ్లికి ముందుగానే కట్నం చెల్లించాలని తన కుటుంబంపై ఒత్తిడి తెచ్చాడని తెలిపింది. ఈ పరిణామాలతో విసిగిపోయిన కుటుంబ సభ్యులు చివరకు వివాహాన్ని రద్దు చేసుకోవాలని నిర్ణయించినట్లు ఫిర్యాదులో పేర్కొంది.

పెళ్లి రద్దు నిర్ణయం తీసుకున్న తర్వాత వంశీ తనను సోషల్ మీడియాలో లక్ష్యంగా చేసుకున్నాడని మహిళ ఆరోపించింది. తాను డ్రగ్స్‌కు బానిసనంటూ తప్పుడు ప్రచారం చేస్తూ తన పరువుకు భంగం కలిగించేలా పోస్టులు, ఆరోపణలు చేశాడని తెలిపింది. ఇదే సమయంలో తనపై యాసిడ్ దాడి చేస్తానని, చంపేస్తానని బెదిరింపులకు పాల్పడ్డాడని మహిళ పోలీసులకు వివరించింది.

ఇవి కూడా చదవండి

ఈ వేధింపులు, బెదిరింపుల కారణంగా తీవ్ర మానసిక ఆందోళనకు గురైనట్లు పేర్కొంది. మహిళ ఫిర్యాదు ఆధారంగా మల్కాజిగిరి సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని మల్కాజిగిరి సైబర్ క్రైమ్ ఎస్‌హెచ్‌ఓ ఎస్‌జీ శివశంకర్ తెలిపారు. సోషల్ మీడియా పోస్టులు, బెదిరింపులకు సంబంధించిన ఆధారాలను పోలీసులు పరిశీలిస్తున్నట్లు సమాచారం.

మరిన్ని తెలంగాణ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
పరిచయం నుంచి నిశ్చితార్థం వరకు.. కట్‌చేస్తే, పోలీసుల రంగప్రవేశం
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
కోసిన బంగాళదుంపలు నల్లబడుతున్నాయా? తాజాగా ఉండాలంటే ఇలా చేయండి..!
లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
లెఫ్టినెంట్ కర్నల్ వెంకట్ రెడ్డిగా వెంకీ మామ..లుక్ అద్దిరిపోయింది
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
అప్పుల బాధలో పుట్టిన అద్భుతం.. సేఫ్టీ పిన్ కథ మామూలుగా లేదుగా..
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
పాత బావిలో విషవాయువు.. నలుగురు మృతి
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
ప్రపంచంలోనే అత్యంత విషపూరిత సర్పం బాండెడ్‌ క్రేట్‌
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
బ్రహ్మంగారు చెప్పిందే జరుగుతుందా..! 2030 నాటికి బంగారం ధర..
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
హీరో, హోండా ఎందుకు విడిపోయాయి? 26 ఏళ్ల అనుబంధం వెనుక ఇంత కథ ఉందా?
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
పాక్ హెచ్చరికకు ఒమర్ స్ట్రాంగ్ కౌంటర్..!
పాక్ హెచ్చరికకు ఒమర్ స్ట్రాంగ్ కౌంటర్..!