AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: సమాధుల్లో నుంచి ప్రేతాత్మలు.. ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్

కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లనే రాబట్టింది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో తెరకెక్కిన ఈ కరక్కం సినిమాకు ఐఎమ్‌డీబీలో పదికి 8.2 రేటింగ్ రావడం విశేషం. ఇప్పుడీ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది.

OTT Movie: సమాధుల్లో నుంచి ప్రేతాత్మలు.. ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. IMDBలో 8.2 రేటింగ్
OTT Movie
Basha Shek
|

Updated on: Jul 03, 2026 | 7:49 PM

Share

ఎప్పటిలాగే ఈ శుక్రవారం (జులై 03) కూడా పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు స్ట్రీమింగ్ కు వచ్చాయి. అబ్సెషన్, మాలీవుడ్ టైమ్స్, హ్యాంగ్ మ్యాన్ వంటి సినిమాలతో పాటు సూపర్ సుబ్బు, ఇసకపట్నం, మర్మదేశం వంటి వెబ్ సిరీస్ లు కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. వీటితో పాటు ఒక మలయాళం సూపర్ హిట్ సినిమా కూడా ఇవాళే ఓటీటీలోకి వచ్చేసింది. ఇదొక హారర్ థ్రిల్లర్ సినిమా. కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదలై అక్కడి ఆడియెన్స్ ను బాగా భయపెట్టింది. అలాగే బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లను రాబట్టింది. డిఫరెంట్ కాన్సెప్ట్ తో తెరకెక్కిన ఈ సినిమాకు ఇప్పటికీ ఐఎమ్ డీబీలో 8.2 రేటింగ్ ఉండడం విశేషం. ఈ సినిమా కథ విషయానికి వస్తే..న్యూ ఇయర్ వేడకల్లో భాగంగా ఫుల్లుగా తాగిన ధనుష్, ఖాజా అనే స్నేహితులు చర్చి శ్మశానవాటికలోకి ప్రవేశిస్తారు. అక్కడ సమాధులపై ఉన్న ఐదు ఇత్తడి సిలువలను పెకిలిస్తారు. దీంతో అక్కడ నిద్రిస్తున్న ఐదు ప్రేతాత్మలు మేల్కొంటాయి. ఆ ఇద్దరు మిత్రులను వెంటాడడం ప్రారంభిస్తాయి. మరి ఆ అతీంద్రియ శక్తుల బారి నుంచి ధనుష్, ఖాజా తప్పించుకున్నారా? లేదా? అన్నదే ఈ సినిమా కథ.

ఆకట్టుకునే కథ, కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగే ఈ సినిమా పేరు ‘కరక్కం’ (Karakkam). సుభాష్ లలిత సుబ్రహ్మణ్యన్ తెరకెక్కించిన ఈ హారర్ థ్రిల్లర్ మూవీలో శ్రీనాథ్ భాసి, ఫెమినా జార్జ్ , ప్రవీణ్ టీజే, అభిరామ్ రాధాకృష్ణన్, షాన్ రోమీ, సిద్ధార్థ్ భరతన్, బిజుకుట్టన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. క్రౌన్ స్టార్స్ ఎంటర్‌టైన్‌మెంట్, బ్లాక్ టర్టిల్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై కింబర్లీ జి. ట్రినిడేడ్, అంకుష్ సింగ్ ఈ సినిమాను నిర్మించారు. ప్రస్తుతం కరక్కం సినిమా సోనీ లివ్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. మలయాళంతోపాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ వంటి 5 భాషల్లోనూ ఈ సినిమా అందుబాటులో ఉంది. వీకెండ్ లో మంచి హారర్ థ్రిల్లర్ సినిమా చూడాలనుకునేవారికి కరక్కం బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు.

ఇవి కూడా చదవండి

సోనీ లివ్ లో కరక్కం సినిమా.. తెలుగులోనూ ఉంది..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
ఇవాళే OTTలోకి వచ్చిన సూపర్ హిట్ హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది
మహాలక్ష్మి రాజయోగం ఎంట్రీ.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగంలో..
మహాలక్ష్మి రాజయోగం ఎంట్రీ.. ఈ రాశుల వారికి డబ్బు, ఉద్యోగంలో..
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..!
భారత్‌తో వన్డే సిరీస్‌కు ఇంగ్లాండ్ జట్టు ఇదే..!
తాజా రొయ్యలు గుర్తించలేకపోతున్నారా? ఈ టిప్స్ తెలిస్తే ఈజీనే
తాజా రొయ్యలు గుర్తించలేకపోతున్నారా? ఈ టిప్స్ తెలిస్తే ఈజీనే
బలపడతున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..!
బలపడతున్న అల్పపీడనం.. ఆ జిల్లాల్లో దంచికొట్టనున్న వానలు..!
మీ చేతిలో ఈ గీతలు ఉన్నాయా? చిన్న వయస్సులోనే కోటీశ్వరులయ్యే ధనయోగం
మీ చేతిలో ఈ గీతలు ఉన్నాయా? చిన్న వయస్సులోనే కోటీశ్వరులయ్యే ధనయోగం
బొమ్మలమ్మే వాళ్లే.. కానీ, ఆ డబ్బుతో వాళ్లు చేసే పనేంటో తెలుసా?
బొమ్మలమ్మే వాళ్లే.. కానీ, ఆ డబ్బుతో వాళ్లు చేసే పనేంటో తెలుసా?
రొనాల్డో వరల్డ్ కప్ కలని కాపాడిన థర్డ్ అంపైర్ టెక్నాలజీ!
రొనాల్డో వరల్డ్ కప్ కలని కాపాడిన థర్డ్ అంపైర్ టెక్నాలజీ!
హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. ప్రభుత్వం నిర్ణయం
హుస్సేన్ సాగర్ చుట్టూ సర్క్యూలర్ స్కైవాక్.. ప్రభుత్వం నిర్ణయం
మరో యూరియా స్కామ్ బట్టబయలు.. ఇదేం కక్కుర్తి సామీ!
మరో యూరియా స్కామ్ బట్టబయలు.. ఇదేం కక్కుర్తి సామీ!