భోజనం చేసిన వెంటనే నిద్రపోవడం ఆరోగ్యానికి హానికరం అంటున్నారు వైద్యులు. ఇలా చేయడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి, జీర్ణక్రియ సమస్యలు తలెత్తుతాయి. డయాబెటిస్, ఊబకాయం వంటి అనేక సమస్యలకు దారితీస్తుంది. తిన్న తర్వాత 15-20 నిమిషాలు నడవడం వల్ల చక్కెర నియంత్రణ, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.