ఇన్నాళ్లు ఏమైపోయారు మేడమ్.. కిర్రాక్ చూపులతో హీరోయిన్ అరాచకం..
Rajitha Chanti
Pic credit - Instagram
03 July 2026
రెండు తెలుగు రాష్ట్రాల్లో తన ఫోక్ సాంగ్స్, అద్భుతమైన డ్యాన్స్‌తో ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్న ఫోక్ బ్యూటీ నాగదుర్గ.
యూట్యూబ్ లో ఫోక్ సాంగ్స్ ద్వారా పాపులర్ అయిన ఈ అమ్మడు త్వరలోనే వెండితెరపై హీరోయిన్‌గా పరిచయం కాబోతున్న సంగతి తెలిసిందే.
బలగం ఫేమ్ ప్రియదర్శి హీరోగా నటిస్తున్న 'ఇడుపు కాయితం' సినిమాలో ఆమె పూర్తి స్థాయి కథానాయికగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ స్టార్ట్ అయ్యింది.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణం గురించి, గతంలో తాను వదులుకున్న స్టార్ హీరోల సినిమా అవకాశాల గురించి పంచుకున్నారు.
తాను హీరోయిన్ కాకముందే టాలీవుడ్‌లో భారీ ఆఫర్లు వచ్చాయని ఆమె వెల్లడించారు. నేచురల్ స్టార్ నాని నటించిన సూపర్ హిట్ సినిమా 'శ్యామ్ సింగరాయ్'లో
సాయి పల్లవి పాత్రకు సహచరిగా, క్లాసికల్ టచ్ ఉన్న ఒక ముఖ్యమైన పాత్ర కోసం మేకర్స్ మొదట నాగదుర్గను సంప్రదించారు. అలాగే పవన్ కళ్యాణ్, సాయి ధరమ్ తేజ్
కలిసి నటించిన బ్రో సినిమాలో, అశోకవనంలో అర్జున కళ్యాణం వంటి సినిమాలతోపాటు పలు సీరియల్స్ లో కూడా ఛాన్స్ వచ్చినా రిజెక్ట్ చేశానని అన్నారు.
అలాగే తనకు బిగ్ బాస్ షోలో ఛాన్స్ వచ్చిందని.. కొన్ని కారణాలతో ఆ అవకాశం వదులుకున్నానని అన్నారు. ప్రస్తుతం ఇడుపు కాయితం చిత్రంలో నటిస్తుంది.
మరిన్ని వెబ్ స్టోరీస్
అందం కోసం నేను ఏం తింటానంటే.. అసలు విషయం చెప్పిన నిధి అగర్వాల్..
డాక్టర్ కమ్ హీరోయిన్.. నెట్టింట గ్లామర్ ఫోజులు చూస్తే ఫ్యూజుల్ అవుట్
షాప్స్ క్లీన్ చేసిన అమ్మాయి.. ఇప్పుడు స్టార్ హీరోలకు లక్కీ హీరోయిన్