AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌

సినిమాల్లో ఆమె ఓ అగ్ర తార.. ఎంతో మంది హీరోలతో కలిసి నటించింది. తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా రాణించింది. తెలుగుతో పాటు తమిళ్, హిందీలోనూ నటించి ఆకట్టుకుంది ఆమె.. కెరీర్ పరంగా సక్సెస్ అయిన ఆమె వ్యక్తిగత జీవితంలో మాత్రం ఎన్నో ఒడిడుకులు ఎదుర్కుంది ఆమె..

రూ.10తో మొదలుపెట్టింది.. కట్ చేస్తే ఇండస్ట్రీనే ఏలింది..! పెళ్లైన నిర్మాతతో ఎఫైర్‌
Jayaprada
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2026 | 12:20 PM

Share

తెలుగు సినిమా పరిశ్రమలో కెరీర్ ప్రారంభించి తిరుగులేని హీరోయిన్స్ గా రాణించిన వారు ఎంతో మంది ఉన్నారు. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ కూడా తెలుగు చిత్రసీమలో విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంది. ఎంతో మంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి రాణించింది. అంతే కాదు ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు, ప్రొడ్యూసర్లు క్యూ కట్టేవారు. కేవలం తెలుగులోనే కాదు హిందీ, తమిళ్ లోనూ సినిమాలు చేసి రాణించింది. ఆమె సినిమాల్లోనే కాదు రాజకీయాల్లోనూ రాణించింది. ఇంతకూ ఆమె ఎవరో తెలుసా.? తెలుగుతో పాటు, బాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన నటీమణులలో జయప్రద ఒకరు. సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ తనకంటూ ప్రత్యేకత సంపాదించుకున్న ఈ నటి జీవితం వృత్తిపరంగా ఎంత విజయవంతమైందో, వ్యక్తిగతంగా అంత సవాళ్లతో నిండిపోయింది.

శ్రీదేవితోనే ప్రాబ్లమ్ .. ఆమె ఉంటే సినిమా చేయనున్న హీరోయిన్.. కానీ చివరకు

సినీ, రాజకీయ కెరీర్‌లో అగ్రస్థానానికి చేరినప్పటికీ, వ్యక్తిగత జీవితంలో మాత్రం జయప్రద కోరుకున్న ఆనందాన్ని, స్థిరత్వాన్ని పొందలేకపోయింది. జయప్రద అసలు పేరు లలితారాణి. ఆమె ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రిలో జన్మించింది. ఆమె తండ్రి కృష్ణారావు తెలుగు సినిమా ఫైనాన్షియర్‌ కాగా, తల్లి నీలవేణి గృహిణి. జయప్రద తన 13వ సంవత్సరంలోనే తొలిసారిగా నటనారంగ ప్రవేశం చేసింది. ఆ సమయంలో ఆమెకు లభించిన పారితోషికం కేవలం పది రూపాయలు మాత్రమే. ఒక తెలుగు చిత్రంతో అరంగేట్రం చేసిన జయప్రద తక్కువ కాలంలోనే బాలీవుడ్‌లో ప్రవేశించి, ఆ కాలంలో అత్యధిక పారితోషికం తీసుకున్న నటిగా గుర్తింపు పొందింది. జయప్రద తన కెరీర్‌లో అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర, రాకేష్ రోషన్, జితేంద్ర వంటి అగ్ర బాలీవుడ్ నటులతో కలిసి నటించింది. ముఖ్యంగా జితేంద్ర, జయప్రద జోడి ప్రేక్షకులకు చాలా దగ్గరై, పలు విజయవంతమైన చిత్రాలలో భాగమైంది. వరుస విజయాలతో దూసుకుపోయి, కోట్ల మంది అభిమానులను సొంతం చేసుకున్నప్పటికీ, ఆమె వ్యక్తిగత జీవితం మాత్రం వివాదాస్పదంగా మారింది.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

1986 ఫిబ్రవరిలో జయప్రద నిర్మాత శ్రీకాంత్ నహతాని వివాహం చేసుకుంది. అయితే, అప్పటికే శ్రీకాంత్ నహతాకు చంద్ర అనే మహిళతో వివాహం జరిగి, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. శ్రీకాంత్ తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వకపోవడంతో జయప్రద వివాహ బంధం గందరగోళంగా మారింది. జయప్రదను వివాహం చేసుకున్న తర్వాత, శ్రీకాంత్ మొదటి భార్యకు మూడో సంతానం కలగడంతో జయప్రద, శ్రీకాంత్‌ల మధ్య విభేదాలు తీవ్రమయ్యాయి. తన మొదటి భార్యకు విడాకులు ఇవ్వడానికి శ్రీకాంత్ నిరాకరించడంతో జయప్రద ఈ పరిస్థితిని జీర్ణించుకోలేకపోయింది. చివరికి తన వివాహ బంధాన్ని వదులుకోవాల్సి వచ్చింది. వ్యక్తిగత జీవితంలో ఎదురైన ఈ కలతలు జయప్రద కెరీర్‌పైనా తీవ్ర ప్రభావం చూపాయి. నిర్మాతలు ఆమెకు అవకాశాలు ఇవ్వకుండా పక్కన పెట్టేయడం ప్రారంభించారు. ఈ పరిణామాల కారణంగా, తన కెరీర్‌లో అత్యున్నత దశలో ఉన్నప్పటికీ, జయప్రద సినిమా పరిశ్రమను విడిచిపెట్టాల్సి వచ్చింది. సినిమాల నుంచి బయటకు వచ్చిన తర్వాత, జయప్రద రాజకీయాల్లోకి ప్రవేశించింది. రాజకీయనాయకురాలిగా సక్సెస్ అయ్యింది. ఇప్పటికే సింగిల్ గానే ఉన్నారు జయప్రద.

చైనాలో వందరోజులు ఆడిన తొలి తెలుగు సినిమా.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us