AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తండ్రితో ఎఫైర్.. కొడుకుతో పెళ్లి.. కోట్లు సంపాదించిన ఈనటి చివరకు అనాథలా

హీరోలతో పోల్చుకుంటే సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ల కెరీర్ చాలా తక్కువగా ఉంటుంది. వరుసగా రెండు, మూడు ఫ్లాప్ లు పడితే చాలు అవకాశాలు కరువైపోతాయి. ఇక హీరోయిన్లు పెళ్లి చేసుకుంటే కూడా సినిమా అవకాశాలు తగ్గుతాయన్న అభిప్రాయమూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనూ వందల కొద్దీ సినిమాలు చేసిన అందాల తారలు చాలా మందే ఉన్నారు.

తండ్రితో ఎఫైర్.. కొడుకుతో పెళ్లి.. కోట్లు సంపాదించిన ఈనటి చివరకు అనాథలా
Tollywood Actress
Rajeev Rayala
|

Updated on: Mar 28, 2026 | 11:40 AM

Share

సినిమా ఇండస్ట్రీలో ఆమె ఓ మెరుపు తీగ.. ఆమె అందానికి ఫిదా అవ్వని ప్రేక్షకులు ఉండరు. సినీ ప్రయాణం చిన్నదే కానీ ఇండస్ట్రీని ఊపేసింది. స్టార్ హీరోలు కూడా ఆమె డేట్స్ కోసం క్యూ కట్టే వారు.. తన అందంతో ప్రేక్షకులను మంత్రముగ్దులను చేసింది. సినీ లైఫ్ లో స్టార్ గా వెలిగిన ఆమె రియల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. పేదరికం నుంచి వచ్చిన ఆమె ఎన్నో కష్టాలను, అవమానాలను చూసింది. తిండి కూడా లేని స్థితి నుంచి కోట్లాది రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగింది. అంతే కాదు ఆమె ఇండస్ట్రీలో కొనసాగినంత కాలం ఎన్నో పుకార్లు, షికారు చేశాయి. ఎన్నో వివాదాలు, వదంతులు ఆమెను చుట్టుముట్టాయి. చివరకు ఆత్మహత్య చేసుకొని ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఆమె ఎవరో ఇప్పటికే మీకు అర్ధమై ఉంటుంది. ఆమె మరెవరో కాదు..

ఆ షో వల్ల నా కెరీర్ నాశనం అయ్యింది.. నా గురించి పిచ్చిపిచ్చిగా మాట్లాడుకున్నారు

సిల్క్ స్మిత,  తన బోల్డ్ నటనతో, ప్రత్యేకమైన శైలితో అనతికాలంలోనే ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. ఈ అందాల తార కేవలం వ్యాంప్ పాత్రలకే పరిమితం కాలేదు. హీరోయిన్‌గానూ అనేక చిత్రాల్లో నటించి, అప్పట్లో స్టార్ హీరోయిన్లకు సైతం గట్టి పోటీనిచ్చారు. సినిమా ఏదైనా, హీరో ఎవరైనా, సిల్క్ స్మిత ఉంటేనే ఆ చిత్రానికి ప్రత్యేక ఆదరణ లభించేది. ఆమె కోసం మాస్ ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కట్టేవారంటే ఆమెకున్న పాపులారిటీ ఎంతటిదో అర్థం చేసుకోవచ్చు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి, తిండి కూడా లేని స్థితి నుంచి కోట్లాది రూపాయలు సంపాదించే స్థాయికి ఎదిగిన ఆమె ప్రయాణం ఎందరికో ఆదర్శం. అయితే, ఈ మెరుపుల వెనుక ఒక చీకటి కోణం దాగి ఉంది. తన ప్రియుడి మోసపూరిత వలలో పడి, తన కెరీర్‌ను నాశనం చేసుకున్నారని, ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయారని ఇండస్ట్రీలో చాలా మంది చెప్తూ ఉంటారు. చివరికి ఆమె అనాథగా మరణం పొందడం, ఆమె అంత్యక్రియలు కూడా అంతే విషాదంగా జరగడం తెలుగు సినీ చరిత్రలో ఒక చేదు అధ్యాయం అనే చెప్పాలి. సిల్క్ స్మిత ఆత్మహత్యకు, ఆమె కెరీర్ పతనానికి ప్రధాన కారణం ఆమె ప్రియుడు రాధాకృష్ణ అని చాలా వార్తలు వచ్చాయి. తన సూసైడ్ నోట్‌లో కూడా ఆమె రాధాకృష్ణ పేరును ప్రస్తావించారని చెప్తూఉంటారు.

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

రాధాకృష్ణ ఒక ఆర్‌ఎంపీ డాక్టర్ అని, అతను సిల్క్ ఆర్థిక, వ్యక్తిగత వ్యవహారాలన్నింటినీ చూసుకునేవారట. సిల్క్ స్మిత రాధాకృష్ణకు దగ్గర కావడానికి ఒక బలమైన కారణం ఉందట. చెన్నైలోని టీ. నగర్ వీధుల్లో సినిమాల్లో నటించే ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకునే గ్యాంగులు ఉండేవని, వారి నుంచి రక్షణ పొందేందుకు స్మిత తన ఊరు వ్యక్తి అయిన రాధాకృష్ణను ఆశ్రయించారని చెబుతారు. ఆయనతో ఎఫైర్ కూడా పెట్టుకున్నప్పటికీ, అతను ఆమె డబ్బును మొత్తం కాజేశారని తీవ్ర ఆరోపణలున్నాయి. గతంలో నటి జయశీల ఒక ఇంటర్వ్యూలో సిల్క్ స్మితకు సంబంధించి కొన్ని సంచలనాత్మక విషయాలను వెల్లడించారు. సిల్క్ స్మిత రాధాకృష్ణ కొడుకును పెళ్లి చేసుకుని, పిల్లలను కని, తనకంటూ ఒక కుటుంబం ఉండాలని కోరుకుందని జయశీల తెలిపారు. ఈ విషయం రాధాకృష్ణకు తెలిసిన తర్వాత వారిద్దరి మధ్య తీవ్ర గొడవలు ప్రారంభమయ్యాయని, ఈ పరిణామాలే చివరికి సిల్క్ స్మిత ఆత్మహత్యకు దారితీశాయని జయశీల పేర్కొన్నారు.

ఇవి కూడా చదవండి

ఆరు నెలల్లోనే ఆ నిర్ణయం తీసుకున్నాం.. విడాకులపై ప్రియాంక చోప్రా షాకింగ్ కామెంట్స్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పాక్ దౌత్యవేత్తకు భారత్ సమన్లు.. సముద్రంలో భారత యుద్ధనౌకను..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
పీఎఫ్ శాలరీ లిమిట్ భారీగా పెంపు.. కేంద్రం బిగ్ అనౌన్స్‌మెంట్..
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
మేఘాంశ్ కొత్త సినిమా టీజర్ .. శ్రీహరి కుమారుడికి ఈసారి హిట్ ఖాయం
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
కళ్ళు మసకగా కనబడేవాళ్లు ఇది తింటే మెరుగైన దృష్టి
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
రూ.4.5లక్షలకే అద్దిరిపోయే ఇల్లు..! ఇటుకలు, రాళ్ల కన్నా ఎంతో బలంగా
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
ఫైనల్ మ్యాచ్ లో సింహం ఎంట్రీ.. ఏకంగా 3 మార్పులతో బరిలోకి..!
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మోక్షజ్ఞ ఎంట్రీ మూవీపై క్రేజీ అప్డేట్.. ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
మహిళలు ఇంట్లోనే ఉంటూ లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియాలు..
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
బామ్మగారు ఏంటండీ మీరు మరీను.. బ్యూటీ పార్లర్ బిల్లు చూసి షాక్!
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం
ఉత్తర పూజ తర్వాత గణపతి విగ్రహాన్ని ఎందుకు కదిలిస్తారు? అసలు కారణం