AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి

ప్రముఖ నటి విజయశాంతి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు సినిమా ప్రపంచంలో రాములమ్మ అంటే ఠక్కున గుర్తొచ్చే పేరు ఆమెదే. తెలుగులో ఒకప్పుడు స్టార్ హీరోలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసింది. కృష్ణ, చిరంజీవి, వెంకటేశ్, నాగార్జున వంటి అగ్ర హీరోల సరసన నటించింది. ప్రతిఘటన, ఓసేయ్ రాములమ్మ, అడవి చుక్క వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో మాస్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు

ఆ హీరోను చూస్తే ఇప్పటికీ అసహ్యం వేస్తుంది.. అతను చేసిన పనికి అంటూ సీరియస్ అయిన విజయశాంతి
Vijayashanti
Rajeev Rayala
|

Updated on: Mar 24, 2026 | 12:52 PM

Share

ప్రముఖ నటి, లేడీ సూపర్ స్టార్ విజయశాంతి ఒకప్పుడు వరుసగా సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించారు. హీరోలకు సమానంగా యాక్షన్ సీన్స్ లో నటించి మెప్పించింది. అలాగే లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించి విశేషంగా ఆకట్టుకున్నారు విజయశాంతి. అంతే కాదు హీరోలకు సరిసమానంగా అభిమానులను కూడా సొంతం చేసుకుంది. కాగా ఓ ఒక ఇంటర్వ్యూలో చేసిన సంచలన వ్యాఖ్యలు సినీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీశాయి. ఆ హీరోని చూస్తే ఇప్పటికీ నాకు అసహ్యంగానే ఉంటుంది అంటూ ఆమె చేసిన కామెంట్స్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. తన కెరీర్ ఉన్నత దశలో ఉన్నప్పుడు, కొందరు హీరోలు తన ఎదుగుదలను ఓర్వలేక తన వెనుక కుట్రలు పన్నారని, గోతులు తవ్వారని విజయశాంతి అన్నారు.

ఆ హీరోని చూస్తే అసహ్యం వేస్తుందని విజయశాంతి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే, ఆ హీరో పేరును మాత్రం ఆమె స్పష్టంగా వెల్లడించలేదు. విజయశాంతి తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక విశిష్టమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. కేవలం రెండు దశాబ్దాలు మాత్రమే కొనసాగిన హీరోయిన్లకు భిన్నంగా, ఆమె హీరోలకు ధీటుగా స్టార్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్నారు. సౌత్ ఇండియాలోనే మొట్టమొదటి లేడీ సూపర్ స్టార్‌గా, లేడీ అమితాబ్ బచ్చన్‌గా పేరు సొంతం చేసుకుంది. ఆ రోజుల్లో హీరోల కంటే ముందుగానే కోటి రూపాయల రెమ్యూనరేషన్ అందుకున్న ఏకైక ఆర్టిస్ట్‌గా ఆమె చరిత్ర సృష్టించారు. ఆమె లేడీ ఓరియంటెడ్ సినిమాలు చిరంజీవి, బాలకృష్ణ వంటి అగ్ర హీరోల సినిమాలతో సమానంగా భారీ వసూళ్లను రాబట్టేవి. డైలాగ్స్ చెప్పడంలో, డ్యాన్స్ చేయడంలో, ముఖ్యంగా సాహసోపేతమైన ఫైట్స్ చేయడంలో ఆమె హీరోలకు ఏమాత్రం తీసిపోకుండా నటించేవారు.

ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలోనే ఇలా చేసిన మొట్టమొదటి హీరోయిన్‌గా విజయశాంతి తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. ఆమె సినిమాలు పెద్ద హీరోల సినిమా వసూళ్లను దాటేస్తుండడంతో, తమ స్టార్ స్టేటస్‌ను డ్యామేజ్ చేస్తుందని భావించిన కొందరు హీరోలు ఆమె వెనుక చేరి కుట్రలు పన్నారని ఆమె అన్నారు. ఒక ఇంటర్వ్యూలో యాంకర్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆమె స్పందిస్తూ.. “ఉన్నారుగా చాలామంది ఉన్నారు కానీ నా ముందు చేయరు. వెనుక నుండి గోతులు తవ్వుతూ ఉంటారు. ఒక హీరో అలాగే చేసాడు. అతన్ని చూస్తే ఇప్పటికీ నాకు అసహ్యంగానే ఉంటుంది” అని విజయశాంతి చెప్పుకొచ్చారు ఈ కామెంట్స్ ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర