AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా

ప్రముఖ నటుడు శివాజీ రాజా.. గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. విలన్ గా, కమెడియన్ గా, అలాగే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించారు శివాజీ రాజా. ఎన్నో సినిమాల్లో విలక్షణ పాత్రలు చేసి ఆకట్టుకున్నారు శివాజీ రాజా.. ప్రస్తుతం ఆయన సహాయక పాత్రలు చేస్తూ అక్కట్టుకుంటున్నారు

మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా
Shivaji Raja
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2026 | 9:55 AM

Share

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా ఎన్నో సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించారు నటుడు శివాజీ రాజా. కేవలం సహాయక నటుడిగానే కాదు హీరోగానూ సినిమాలు చేశారు శివాజీ రాజా.. ఓ వైపు వెండి తెరపై సినిమాలతో బిజీగా ఉంటూనే అమృతం సీరియల్ తో బుల్లితెరపై కూడా నవ్వులు పూయించారు. ఇక ఇప్పుడు శివాజీ రాజా హీరో, హీరోయిన్స్ కు తండ్రిగా నటిస్తూ మెప్పిస్తున్నారు. అలాగే పలు ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు ఆయన.. గతంలో శివాజీ రాజా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఈక్రమంలోనే టాలీవుడ్ నటుడు దివంగత శ్రీహరి మరణం, దివంగత దాసరి నారాయణరావుతో తన బంధం, అలాగే మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలలో ఎదురైన అనుభవాలపై అనేక కీలక విషయాలను పంచుకున్నారు. డిస్కో శాంతి శ్రీహరి మరణానికి స్నేహితులే కారణమని చేసిన వ్యాఖ్యలపై శివాజీ రాజా స్పందించారు.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే

శ్రీహరి మరణానికి స్నేహితులు కారణమన్న డిస్కో శాంతి వ్యాఖ్యలను శివాజీ రాజా ఖండించారు. శ్రీహరి వంటి వ్యక్తికి ఒకరిద్దరు కాదు, ఎంతో మంది స్నేహితులు ఉన్నారని తెలిపారు. తామిద్దరం కెరీర్‌లో కేవలం ఐదారుసార్లు మాత్రమే కలిసి మందు తాగి ఉంటామని పేర్కొన్నారు. తాను శ్రీహరికి పాన్ పరాగ్ మానేయమని సలహా ఇచ్చినా, ఆయన స్టార్‌గా తనకున్న ఒత్తిడి, టెన్షన్ల వల్ల అలవాటు పడి ఉండవచ్చని అన్నారు శివాజీ రాజా.  వ్యసనాన్ని మానేయాలనే నిర్ణయం ఆ వ్యక్తిదే కావాలని, లేదా కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు, గురువులు చెప్పాలని ఆయన అన్నారు. తాను కూడా ధూమపానాన్ని చాలాసార్లు మానేయాలని ప్రయత్నించి చిరంజీవి గారికి మాట ఇచ్చిన తర్వాతే పూర్తిగా మానేసినట్లు వెల్లడించారు.

ఆ సినిమా వల్ల అవకాశాలు చాలా తగ్గాయి.. అలాంటి పాత్రలే చేస్తా అనుకున్నారు: సత్య కృష్ణ

అలాగే దాసరి నారాయణరావు చివరి రోజుల్లో తనతో మాట్లాడుతూ, శివాజీ లాంటి వాడిని ఇన్ని రోజులు దూరం పెట్టాను” అని బాధపడ్డారని శివాజీ రాజా వెల్లడించారు. తన షార్ట్ టెంపర్ స్వభావం, తనపై వచ్చిన కొన్ని ఫిర్యాదుల కారణంగా దాసరి తనను దూరం పెట్టారని శివాజీ రాజా అన్నారు. తాను దాసరిని గురువుగారు అని పిలుస్తుంటా, తమ బంధం తండ్రీ కొడుకుల అనుబంధంగా ఉంటుంది. దాసరి నారాయణరావు చివరి రోజుల్లో తనను అర్థం చేసుకున్నారని శివాజీ రాజా చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ క్రికెటర్ భార్య..? ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us