AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే

తెలుగు సినిమా చరిత్రలో చెరిగిపోని స్థానం సంపాదించుకున్న నటుల్లో సూపర్ స్టార్ కృష్ణ ఒకరు. తెలుగు సినిమాల్లో ఆయన ఓ శిఖరం.. ఎన్నో అద్భుతాలు సృష్టించారు. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా వచ్చి ఇండస్ట్రీని షేక్ చేశారు కృష్ణ. బుర్రిపాలే అనే గ్రామం నుంచి వచ్చిన కృష్ణ రికార్డుల రారాజుగా పేరు తెచ్చుకున్నారు.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే
Mahesh Babu, Krishna
Rajeev Rayala
|

Updated on: Mar 22, 2026 | 11:20 AM

Share

సూపర్ స్టార్ కృష్ణ గురించి తెలియని తెలుగు ప్రేక్షకులుఉండరూ.. ఆయన ఈ లోకాన్ని విడిచిపోయి ఇన్నేళ్లు అవుతున్నా ఆయన అభిమానులు కృష్ణ గారి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. కృష్ణ ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేశారు. తెలుగు సినిమాలో ఆయన ఎన్నో ప్రయోగాత్మక సినిమాలు చేసి మెప్పించారు. తాజాగా సూపర్ స్టార్ కృష్ణ ఓల్డ్ ఇంటర్వ్యూలో చేసిన కొన్ని కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ ఇంటర్వ్యూలో సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు కృష్ణ. తన తరంలోని హీరోయిన్లలో జయప్రద, జయసుధ, విజయశాంతి, రాధ, శ్రీదేవి తనకు ఇష్టమైన వారని పేర్కొన్నారు కృష్ణ.

మహేష్ బాబుతో రీమేక్ చేయాలనుకుంటే గూఢచారి 116 సినిమాను ఎంచుకుంటానని చెప్పారు అన్నారు కృష్ణ . “అల్లూరి సీతారామరాజు” సినిమా గురించి దివంగత ఎన్.టి. రామారావు గారితో జరిగిన ఒక ఆసక్తికర సంఘటనను పంచుకున్నారు. మొదట ఎన్టీఆర్ గారు ఆ సినిమాను తీయాలని అనుకున్నారని, అయితే పరుచూరి బ్రదర్స్ సలహా మేరకు కృష్ణ గారి సినిమా చూసిన తర్వాత, ఇంతకన్నా ఎవరూ ఈ సినిమాను బాగా తీయలేరు అని కౌగిలించుకుని అభినందించారని తెలిపారు.

ప్రస్తుత తరం హీరోలలో మహేష్ కాకుండా తనకు జూనియర్ ఎన్టీఆర్ నచ్చిన హీరో అని కృష్ణ అన్నారు. అలాగే సూపర్ స్టార్ ఇమేజ్, మహేష్ బాబుకి డాడీ అనే రెండింటిలో ఏది ఎక్కువ ఇష్టమని అడగ్గా, రెండూ ఇష్టమేనని సమాధానమిచ్చారు కృష్ణ. చివరిగా, తనకు అవార్డులు రాలేదన్న అసంతృప్తి ఏమైనా ఉందా.? అని అడగ్గా, డాక్టరేట్, పద్మభూషణ్, ఎన్టీఆర్ అవార్డు, ఫిల్మ్‌ఫేర్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్, నంది అవార్డు (“అల్లూరి సీతారామరాజు” చిత్రానికి), సితార అవార్డు (“అంతం కాదిది ఆరంభం” చిత్రానికి వంటి అనేక పురస్కారాలు అందుకున్నానని, అన్ని విధాలా విజయం చూశానని కృష్ణ అన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
రోహిత్ సెంచరీ సెలబ్రేషన్స్ వెనుక సీక్రెట్ ఇదే..?
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
13 ఏళ్ల తర్వాత ఓటీటీలో దుమ్మురేపుతున్న సినిమా..
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
నొప్పి, జ్వరానికి సొంతంగా మందులు వేసుకుంటున్నారా? CDSCO హెచ్చరిక
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
స్కూటీ బ్రేక్ హ్యాండిల్ వద్ద ఉండే ఆ చిన్న లివర్ దేనికో తెలుసా?
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
ఇన్‌స్టా రీల్‌తో మొదలై టెలిగ్రామ్ ట్రైనింగ్‌తో జోరుగా దందా!
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
చక్కెర తినడం పూర్తిగా ఆపేస్తే శరీరంలో ఏం జరుగుతుంది? నిపుణుల సూచన
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
విరిగిన ఎముకలకు మేలు చేసే నల్ల కారం పొడి.. ఇడ్లీ, దోసెల్లోకి కూడా
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
చరిత్ర సృష్టించిన భారత అమ్మాయిలు.. హాకీలో సౌత్ కొరియా ఖేల్ ఖతం..
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్
టెంప్టింగ్ ధరతో మార్కెట్లోకి రెనాల్ట్ ట్రైబర్
వీర భారత పైలట్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!
వీర భారత పైలట్‌ను ప్రశంసించిన ప్రధాని మోదీ!