అన్న బాడీ బాక్సాఫీస్ రా..! ఏడు వారాల్లో పది కేజీలు.. డ్రాగన్ కోసం ఎన్టీఆర్ లుక్
పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. భారీ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. భారీ బడ్జెట్ యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ చిత్రంలో కన్నడ స్టార్ హీరోయిన్ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ సినిమా కోసం ఆయన అభిమానులు వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. దేవరలాంటి హిట్ తర్వాత ఎన్టీఆర్ నటించిన వార్ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. బాలీవుడ్ దర్శకుడు తెరకెక్కించిన వార్ 2 భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్ అయ్యింది. దాంతో తారక్ ఫనన్ అంతా ఇప్పుడు ఎన్టీఆర్ నెక్స్ట్ సినిమా పై భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే తారక్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమా అనౌన్స్ చేశారు. కేజీఎఫ్, సలార్ సినిమాలతో భారీ హిట్స్ అందుకున్న ప్రశాంత్ నీల్ ఇప్పుడు తారక్ తో సినిమా చేస్తున్నారని అనౌన్స్ చేసిన దగ్గర నుంచి అభిమానులు పూనకాలతో ఊగిపోతున్నారు. ఈ సినిమా నుంచి ఏదైనా అప్డేట్ రాకపోతుందా అని వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్.
మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే
ఇదిలా ఉంటే ఇటీవల తారక్ లుక్స్ గురించి రకరకాల వార్తలు వచ్చాయి. తారక్ సన్నబడటంతో కొందరు అవాక్ అయ్యారు. అయితే ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాత్రకు తగ్గట్టు మారిపోయి తన నటనతో కట్టిపడేస్తుంటారు తారక్. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ సినిమాలో కూడా ఆయన ఓ డిఫరెంట్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. గుబురు గడ్డంతో రగ్గడ్ లుక్ లో తారక్ కనిపించనున్నారు.
ఆ సినిమా వల్ల అవకాశాలు చాలా తగ్గాయి.. అలాంటి పాత్రలే చేస్తా అనుకున్నారు: సత్య కృష్ణ
అయితే ఈ సినిమా కోసం తారక్ బాడీ బిల్డ్ చేస్తున్నారని తెలుస్తుంది. పర్ఫెక్ట్ లుక్ లో కనిపించడానికి తారక్, ఏడు వారాల్లో పది కిలోల బరువు తగ్గారట. ప్రతిరోజు గంటన్నర పాటు వ్యాయామం, లో ప్రోటీన్ డైట్‌ను ఫాలో అవుతున్నారట తారక్. కాగా డ్రాగన్ సినిమా అనౌన్స్ చేసిన సమయంలో కాస్త బొద్దుగా కనిపించిన ఎన్టీఆర్.. ఇప్పుడు సన్నగా లీన్ లుక్ లోకి మారిపోవడంతో తారక్ ఈ సినిమాలో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారా.? అంటూ అభిమానులు గుసగుసలాడుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో కన్నడ బ్యూటీ రుక్మిణి వసంత్ హీరోయిన్ గా నటిస్తుంది. ఈ మూవీ షూటింగ్ సైలెంట్ గా కంప్లీట్ చేస్తున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అయితే త్వరలోనే డ్రాగన్స్ సినిమా నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తాయని అభిమానులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.
Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ క్రికెటర్ భార్య..? ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




