బ్యాడ్ లక్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి.. దెబ్బకు దశ తిరగాల్సిందే
రీసెంట్‌గా మెగాస్టార్‌తో కలిసి ఒక భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న ఈ డైరెక్టర్.. ఇప్పుడు తన తదుపరి మిషన్ కోసం సిద్ధమవుతున్నారు. ఈసారి ఆయన చేయబోయే ప్రయోగం వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. తన ఫేవరెట్ హీరోతో కలిసి ఐదోసారి బాక్సాఫీస్‌పై దండయాత్రకు ప్లాన్ చేస్తున్నారు.

టాలీవుడ్ సక్సెస్ మిషన్ అనిల్ రావిపూడి సినిమా కోసం ప్రేక్షకులు ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. ప్రతి సంక్రాంతికి ఓ సినిమాతో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్నారు. ఇప్పటివరకు అనిల్ చేసిన సినిమాలన్నీ సూపర్ హిట్ అయ్యాయి. మీడియా రేంజ్ హీరోలతో మొదలు పెట్టి స్టార్ హీరోలతో సినిమాలు చేసి బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు అనిల్ రావిపూడి. గత సంక్రాంతికి సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న అనిల్ రావిపూడి. ఈ సంక్రాంతికి మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో మరో బ్లాక్ బస్టర్ అందుకున్నారు అనిల్. ఇక ఇప్పుడు మరోసారి వెంకటేష్ తో కలిసి సినిమా చేయనున్నారు అనిల్. ఈసారి పూర్తి స్థాయి మల్టీస్టారర్ సినిమాతో రాబోతున్నాడు అనిల్. వెంకటేష్ తో పాటు కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటించనున్నారు.
మనిషి చాలా మంచోడే కానీ అది ఒక్కటే చెడ్డ అలవాటు.. స్టార్ నటుడి గురించి శివాజీ రాజా
అనిల్ దర్శకుడిగా మారిన తర్వాత కళ్యాణ్ రామ్ తో కలిసి పటాస్ సినిమా చేసిన విషయం తెలిసిందే. తొలి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇక ఇప్పుడు మరోసారి అనిల్ కళ్యాణ్ రామ్ తో కలిసి సినిమా చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ హీరోయిన్ గా కీర్తిసురేష్ ను సంప్రదించారని తెలుస్తుంది. కీర్తిసురేష్ దాదాపు ఫిక్స్ అని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ సరసం కీర్తిసురేష్ నటించనుందని తెలుస్తుంది. అలాగే ఇప్పుడు కళ్యాణ్ రామ్ సరసన ఓ యంగ్ హీరోయిన్ ను ఫిక్స్ చేశారట అనిల్ రావిపూడి. ఈ క్రమంలోనే ఓ బ్యాడ్ లక్ బ్యూటీకి ఛాన్స్ ఇచ్చిన అనిల్ రావిపూడి.
OTT Movie: ఈ సినిమాలో సీన్స్ ఉంటాయి భయ్యా..! ట్విస్ట్‌లతో పిచ్చెక్కిపోద్ది..
ఆ హీరోయిన్ ఎవరో కాదు యంగ్ భామ కృతిశెట్టి. ఉప్పెన సినిమాతో ఎంట్రీ ఇచ్చిన కృతిశెట్టి.. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసింది. కృతిశెట్టికి హిట్స్కంటే ఫ్లాపులే ఎక్కువే ఉన్నాయి. వరుసగా సినిమాలు చేసినప్పటికీ కేవలం మూడు హిట్స్ మాత్రమే అందుకుంది. ఆ తర్వాత చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అయ్యాయి. ఇక ఇప్పుడు ఈ అమ్మడు అనిల్ సినిమాలో సెకండ్ హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ రానుంది. ఇదే నిజం అయితే కృతిశెట్టికి అనిల్ సక్సెస్ ఇవ్వడం ఖాయం అంటున్నారు ఆడియన్స్. చూడాలి మరి ఏం జరుగుతుందో..
ఏంటండీ మీరు మరీ అందంగా ఉన్నారు.. సీరియల్‌లో శారీ లుక్స్.. బయట మాత్రం బీభత్సం
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




