AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆ నటుడి పక్కన ఛాన్స్ కావాలా.. మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు

నటి మిర్చి మాధవి ఇటీవలి ఓ ఇంటర్వ్యూలో తన సినీ ప్రస్థానం, చిత్ర పరిశ్రమలోని ఒడిదుడుకులను, ముఖ్యంగా నటీమణులు ఎదుర్కొంటున్న సవాళ్లను విశ్లేషణాత్మకంగా పంచుకున్నారు. ఒంటరి మూవీలో హీరో వదిన పాత్రతో తన కెరీర్‌ను ప్రారంభించారని, ఆ తర్వాత మదర్ క్యారెక్టర్లు చేసినట్లు తెలిపారు.

ఆ నటుడి పక్కన ఛాన్స్ కావాలా.. మేము ఐదుగురం ఉన్నాం అంటూ పిచ్చి వాగుడు వాగారు
Madhavi
Rajeev Rayala
|

Updated on: Mar 23, 2026 | 11:51 AM

Share

బుల్లితెర ప్రేక్షకులకు సుపరిచితమైన నటి మిర్చి మాధవి. ఎన్నో సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు, కీలక పాత్రలు చేసి మెప్పించారు ఆమె. మొన్నటివరకూ సినిమాల్లో ఆకట్టుకున్న ఆమె ఇప్పుడు సీరియల్స్ లో నటిస్తున్నారు. కాగా మాధవి ఓ ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమలోని చీకటి కోణాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గుప్పెడంత మనసు సీరియల్‌లో దేవయానిగా, ప్రస్తుతం “ఇల్లు, ఇల్లాలు, పిల్లలు సీరియల్‌లో భాగ్యంగా నటిస్తున్న మాధవి, తన సుదీర్ఘ కెరీర్‌లో దాదాపు 300కు పైగా సినిమాలు, 20కి పైగా సీరియల్స్‌లో నటించారు. మిర్చి సినిమాతో మిర్చి మాధవిగా గుర్తింపు పొందిన ఆమె, అనేక నెగటివ్ పాత్రలతో తనదైన ముద్ర వేశారు. అయితే, ఈ ప్రయాణంలో తాను ఎదుర్కొన్న చేదు అనుభవాలను ఆమె ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. ఆఫర్ల విషయంలో వయస్సు, శరీర ఆకృతి ఆధారంగా వివక్ష చూపడంపై మాధవి ఆవేదన వ్యక్తం చేశారు.

మహేష్ కాకుండా ఇప్పటి హీరోల్లో అతనంటేనే ఇష్టం.. కృష్ణ చెప్పిన పేరు వింటే పూనకాలే

ఏజ్ ఎక్కువ అని, లావు అని కామెంట్లు చేయడం మామూలేనని, కానీ చిన్న వయస్సులో సన్నగా ఉన్నప్పుడు ఆఫర్లు ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. హీరోయిన్ తల్లి పాత్రకు హీరోయిన్‌లా సన్నగా, అందంగా ఉండాలని ఆశించడం కరెక్ట్ కాదు, నిజ జీవితంలో తల్లులు వివిధ శరీర ఆకృతులలో ఉంటారని ఆమె గుర్తుచేశారు. కాస్టింగ్ కౌచ్ విషయంలో తన స్పష్టమైన వైఖరిని మాధవి వివరించారు. ఒక క్లోజ్డ్ రూమ్‌లోకి వెళ్తున్నారంటే అది రాజీ పడటానికేనని ఆమె అభిప్రాయపడ్డారు. తనకు అలాంటి పరిస్థితులు ఎదురైనప్పటికీ, వాటిని ఎలా డీల్ చేయాలో తెలుసని పేర్కొన్నారు. కొన్నిసార్లు డామినేషన్, జోకులు, కామెంట్లు ఎదురైనా, వాటిని ఎదుర్కొనే దాన్నిబట్టి అవతలి నుంచి ప్రతిస్పందన ఉంటుందని తెలిపారు మాధవి. నేరుగా తనను అప్రోచ్ అయ్యి ఇబ్బంది పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయని, కొన్ని ప్రాజెక్టులను వదులుకున్నానని ఆమె స్పష్టం చేశారు.

ఆ సినిమా వల్ల అవకాశాలు చాలా తగ్గాయి.. అలాంటి పాత్రలే చేస్తా అనుకున్నారు: సత్య కృష్ణ

సుమారు 12 ఏళ్ల క్రితం జరిగిన ఒక సంఘటనను మాధవి వెల్లడించారు. ఒక డైరెక్టర్ ఇంటికి వచ్చి మాట్లాడతానని చెప్పి, ఆమె ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నప్పటికీ, దుస్తులు మార్చి నడవమని కోరాడట. మొదట పంజాబీ డ్రెస్సులో, తర్వాత కాటన్ చీరలో, ఆపై సింథటిక్ చీరలో రమ్మని చెప్పి, చివరికి ఆమె నడుమును చూపించమని అసభ్యకరంగా అడిగాడని తెలిపారు. వెంటనే ఆ డైరెక్టర్‌ను చెప్పుతో కొడతానని హెచ్చరించి బయటకు గెంటేశానని మాధవి ధైర్యంగా అన్నారు. అలాగే, 100% లవ్ సినిమా తర్వాత భాస్కర్ అనే వ్యక్తి ప్రకాష్ రాజ్ పక్కన భార్య పాత్ర ఆఫర్ చేశాడని, అయితే ఆ పాత్ర కావాలంటే మేము ఐదుగురం ఉంటాం, రాజీపడితే ఆ రోల్ ఇస్తాం అని అడిగాడని మాధవి తెలిపారు. తాను అలాంటి దాన్ని కాదని, అలా అయితే అప్పుడే డబ్బు సంపాదించుకునేదాన్ని అని చెప్పి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లు తెలిపారు. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ఇవి కూడా చదవండి

Allu Arjun: అల్లు అర్జున్ సినిమాలో స్టార్ క్రికెటర్ భార్య..? ఇన్నేళ్ల తర్వాత రీ ఎంట్రీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us