AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

టాలీవుడ్ మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు.. చివరి రోజుల్లో అంత బాధను అనుభవిస్తూ..

సినిమా ఇండస్ట్రీలో ఆయన ఓ లెజెండ్. విలక్షణ పాత్రలకు పెట్టింది పేరు. ఎన్నో వైవిధ్యమైన పాత్రల్లో నటించి మేపించారు రావుగోపాల్ రావు. విలనిజాన్ని సరికొత్త అర్ధం చెప్పిన నటుడు ఆయన. అయితే అంతటి మహానటుడు చనిపోయిన సమయంలో అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో కూడా రాలేదట..

టాలీవుడ్ మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో రాలేదు.. చివరి రోజుల్లో అంత బాధను అనుభవిస్తూ..
Rao Gopal Rao
Rajeev Rayala
|

Updated on: Mar 30, 2026 | 9:58 AM

Share

తెలుగు సినీ చరిత్రలో రావు గోపాల్ రావు పేరు ఒక విలక్షణమైన నటుడిగానే కాకుండా, విశిష్ట వ్యక్తిగా కూడా నిలిచిపోయింది. విలనిజంలో రావు గోపాల్ రావు గారి స్టైల్ వేరు. ఆయనకు హీరోలకు సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. గతంలో ఆయన భార్య, ప్రఖ్యాత హరికథా కళాకారిణి కమలా కుమారి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆవిడ మాట్లాడుతూ.. మా పరిచయం పీఠాపురంలో మొదలైంది. హరికథ చెప్పడానికి వెళ్లిన కమలా కుమారిని, నాటకాలకు రమ్మని రావు గోపాల్ రావు గారి శిష్యుడు ఆహ్వానించారట. అప్పటికే రావు గోపాల్ రావు గారు పురాణాలపై వ్యతిరేక భావాలు కలిగి ఉన్నారట. అయితే, కాలమాన పరిస్థితులకు అనుగుణంగా పురాణాలను చెప్పే కమలా కుమారి శైలి విని, ఆయన అభిప్రాయం పూర్తిగా మారిపోయింది. ఆమె హరికథా ప్రదర్శనలకు హాజరై, ఆధునిక సాహిత్యాన్ని గురించి వివరించి, తన హరికథలో ఆధునిక సాహిత్యాన్ని జోడించమని ప్రోత్సహించేవారట. ఈ పరిచయం స్నేహంగా మారి, రాజమండ్రిలో జరిగిన ఒక కార్యక్రమంలో మిత్రుల సూచనతో వివాహ బంధంగా మారిందట. వారి వివాహం కేవలం క్షణాల్లో, అక్కడికక్కడే జరిగిందని ఆమె వివరించారు.

శ్రీదేవితోనే ప్రాబ్లమ్ .. ఆమె ఉంటే సినిమా చేయనున్న హీరోయిన్.. కానీ చివరకు

అలాగే రావు గోపాల్ రావు గారి వ్యక్తిత్వం తన అంచనాలకు వంద రెట్లు అద్భుతంగా ఉందని కమలా కుమారి గారు గుర్తు చేసుకున్నారు. సంఘానికి సేవ చేయని జీవితం వ్యర్థం అని భావించి 11వ ఏటనే ఇల్లు వదిలి వెళ్ళిపోయారట రావు గోపాల్ రావు. నాటకాన్ని సరైన సాధనంగా భావించి, మూఢాచారాలు, అంధ విశ్వాసాలపై నాటకాలు రచించి, దర్శకత్వం వహించి, నటించారు. ఎన్నో నాటక అకాడెమీలను స్థాపించి, వెయ్యి మందికి పైగా శిష్యులను తన సొంత మనుషుల్లా చూసుకున్నారట. అంతే కాదు సినిమాల్లోకి ఆయన ఇష్టపడి రాలేదట. నటుడు ఎస్వీ రంగారావు, దర్శకుడు రావి నీడు గార్లకు సన్మానం చేయాలని కీర్తిశేషులు నాటకాన్ని ప్రదర్శించినప్పుడు, రావు గోపాల్ రావు ప్రతిభను చూసి వారు ముగ్ధులయ్యారట. భక్త పోతనలో శ్రీనాధుడు పాత్రకు ఎస్వీఆర్ చేసిన సూచనతో ఆయన సినిమా రంగ ప్రవేశం చేశారు. దర్శకత్వంపై ఆసక్తి ఉన్నా, నటనపై లేని ఆయన ఎస్వీఆర్ పై అభిమానంతో ఒప్పుకున్నారట. కాలక్రమేణా, నటుడిగా ఎవరూ అందుకోలేని స్థాయికి ఎదిగారు రావు గోపాల్ రావు.

అల్లు అర్జున్ అంత మంచి డాన్సర్ అవ్వడానికి కారణం నేనే.. హీరోయిన్ షాకింగ్ కామెంట్స్

రావు గోపాల్ రావు గారు సినిమాల్లో విలన్ గా నటించినప్పటికీ, నిజ జీవితంలో మాత్రం ఆయన ఒక హీరో. ఎవరి గురించి చెడుగా మాట్లాడటం ఆయనకు తెలియదు. ఇంటికి వచ్చిన వారికి ఎన్నడూ తిండి పెట్టకుండా పంపేవారు కాదట. వంద మందికి వంట చేసి పెట్టిన రోజులు కూడా ఉన్నాయని ఆయన భార్య వివరించారు. రావు గోపాల్ రావు గారి ఆరోగ్యం షూటింగ్‌లు, రాజకీయాల్లో నిద్రలేమి, సరిపడా ఆహారం లేకపోవడం వల్ల క్షీణించింది. మధుమేహంతో కిడ్నీలు దెబ్బతిన్నాయి. ధూమపానం కూడా అనారోగ్యాన్ని పెంచింది. 1994 ఆగస్టు 13న, 57 ఏళ్ల వయసులో ఆయన కన్నుమూశారు. చివరి రోజుల్లో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొని, తన ఆస్తులను నమ్మినవారి చేతిలో కోల్పోయారట. చికిత్సకు కూడా డబ్బులు లేని పరిస్థితిలో, దాచుకున్న కొద్ది మొత్తంతో వైద్యం చేయించుకున్నా ఫలితం లేకపోయిందట. అంతటి మహానటుడి అంత్యక్రియలకు ఒక్క స్టార్ హీరో కానీ, నిర్మాత కానీ హాజరు కాకపోవడం బాధాకరమైన విషయం. అల్లు రామలింగయ్య, పి.ఎల్. నారాయణ, రేలంగి, జై కృష్ణ వంటి కొందరు సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారట. తెలుగు సినిమా పరిశ్రమ చెన్నై నుండి హైదరాబాద్ కు తరలి వెళ్ళిపోవడం, ఆయన అంత్యక్రియలు చెన్నైలో జరగడం దీనికి ఒక కారణం అని కొందరు అభిప్రాయపడ్డారు. అయినప్పటికీ, ఒక లెజెండ్ కు దక్కాల్సిన గౌరవం ఇది కాదని ఆయన మిత్రులు నేటికీ బాధపడతారు. రావు గోపాల్ రావు గారి కుమారుడు రావు రమేష్ ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ప్రముఖ క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కొనసాగుతున్నారు.

ఇవి కూడా చదవండి

చైనాలో వందరోజులు ఆడిన తొలి తెలుగు సినిమా.. ఎవర్ గ్రీన్ క్లాసిక్ మూవీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us