Samantha: యశోదకు..నాకు చాలా దగ్గర పోలీకలున్నాయి.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

యశోద పాత్రకు.. నాకు చాలా దగ్గర పోలీకలు ఉన్నాయంటుంది సమంత. ఎన్నో కలలతో జీవితాన్ని ప్రారంభించిన ఓ అమ్మాయి.... ఎదురైన ప్రతి సవాలును ఎదుర్కొంటూ ముందుకు నడించిందని అన్నారు సామ్..

Samantha: యశోదకు..నాకు చాలా దగ్గర పోలీకలున్నాయి.. ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నా.. సామ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Samantha Yashoda
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 12:12 PM

గత కొద్దిరోజులుగా తీవ్రమైన మయోసైటిస్ సమస్యతో బాధపడుతున్నారు టాలీవుడ్ హీరోయిన్ సమంత. వరుస చిత్రాలతో బిజీగా ఉన్న సామ్ ఆకస్మాత్తుగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్నారు. దీంతో ఆమె అరుదైన చర్మ సమస్యతో బాధపడుతున్నారని.. చికిత్స కోసం అమెరికా వెళ్తున్నారంటూ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలో తాను ఇబ్బందిపడుతున్న వ్యాధి గురించి అనౌన్స్ చేసి అభిమానులకు ,షాకిచ్చింది సామ్. ప్రస్తుతం మయోసైటిస్ వ్యాధితో ఇబ్బందిపడుతూనే.. మరోవైపు యశోద చిత్ర ప్రమోషన్స్‏లో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గోన్న సామ్.. ఆసక్తికర కామెంట్స్ చేసింది.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. యశోద సినిమా స్టోరీ వినగానే షాకయ్యాను. నిజ జీవితంలో జరిగిన సంఘటనలను ఆధారంగా చేసుకుని రూపొందించిన కథ వినగానే గూస్ బంప్స్ వచ్చేశాయి. సాధారణంగా నేను స్టోరీ ఓకే చేయడానికి చాలా సమయం పడుతుంది. సులభంగా ఓకే చేయను. కానీ హరి, హరీష్ కథ చెప్పగానే ఈ సినిమా చేస్తున్నాను అని చెప్పేసాను. ఎందుకంటే ఎప్ప్పుడూ ఒకే క్యారెక్టర్ చేయడం ఇష్టం లేదు. ఈ సినిమా చూడగానే ప్రేక్షకులు కూడా షాకవుతారు అంటూ చెప్పుకొచ్చింది.

ఇవి కూడా చదవండి

అలాగే సమంతకు.. యశోదకు మధ్య ఏమైనా పోలీకలు ఉన్నాయా అని అడగ్గా.. “యశోద కూడా తనలాగే ఎన్నో పెద్ద కలలతో కెరీర్ ప్రారంభించిందని.. యశోద తన లైఫ్ లో అనేక సవాళ్లను ఎదుర్కొంది.. వాటితో పోరాడి గెలిచింది. ప్రస్తుతం నేను కూడా అదే డిఫికల్ట్ పొజిషన్‏లో ఉన్నాను. నేను కూడా పోరాడి గెలుస్తాను అని అనుకుంటున్నాను” అంటూ చెప్పుకొచ్చింది. అంతేకాకుండా తనకు తమిళంలో కాకుండా తెలుగులో డబ్బింగ్ చెప్పడం చాలా కష్టంగా అనిపించందని.. కానీ ప్రాణం పెట్టి నటించిన తర్వాత డబ్బింగ్ చెప్పాలని కూడా ఉంటుంది. నాకు డబ్బింగ్ చెప్పాలని చాలా రోజుల నుంచి ఉంది. ఇప్పుడు తెలుగులో డబ్బింగ్ చెప్పగలను అనే నమ్మకం వచ్చిందంటూ చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..