Samantha: యశోద సినిమాకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టారో తెలుసా ?.. కేవలం సమంత కారణంగానే అంత అమౌంట్ పెట్టారా ?
యశోద సినిమాను ఇనీషియల్ స్టేజ్‌లో జస్ట్ 3 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చేయాలని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనుకున్నారట. కానీ ఈ స్టోరీ సమంతకు నచ్చి..
ది ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్‌తో పాన్ ఇండియా స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు సమంత. ఆ తర్వాత వెంటనే తన భర్త నాగచైతన్యతో విడాకులు తీసుకుంటున్నట్లుగా ప్రకటించడంతో దేశవ్యా్ప్తంగా ఆమె పేరు మారుమోగింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడానికి గల కారణాలు ఏంటా అని ఇప్పటికీ తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నారు నెటిజన్స్. దీంతో ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసే ప్రతి పోస్ట్‌ను ఇంట్రెస్ట్‌తో చూస్తున్నారు. సామ్ షేర్ చేసే ప్రతి పోస్ట్ క్షణాల్లో వైరలవుతుంటాయి. ఇక కొద్ది రోజులుగా వరుస చిత్రాలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలో మయోసైటిస్ వ్యాధితో ఇబ్బందిపడుతున్నట్లు అనౌన్స్ చేసి అభిమానులకు షాకిచ్చింది. సామ్ నటించిన చిత్రాల్లో యశోద చిత్రం ఒకటి. నవంబర్ 11న ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లను వేగవంతం చేసింది చిత్రయూనిట్. అయితే ఈ సినిమా బడ్జెట్ గురించి ఇప్పుడు నెట్టింట చర్చ జరుగుతుంది.
ఇక అకార్డింగ్ టూ దట్ న్యూస్ …యశోద సినిమాను ఇనీషియల్ స్టేజ్‌లో జస్ట్ 3 కోట్ల బడ్జెట్ తో ఫినిష్ చేయాలని డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ అనుకున్నారట. కానీ ఈ స్టోరీ సమంతకు నచ్చి.. తాను చేయడానికి ఫిక్స్ అవడంతో.. సినిమాను పాన్ ఇండియా రేంజ్ కు తీసుకెళ్లాలని ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణప్రసాద్ ఫిక్స్ అయ్యారట. తనకు కూడా.. సరోసగసి స్కామ్ త్రూ అవుట్ ఇండియా సేలబుల్ పాయింట్ లాగా అనిపించడంతో.. ఈసినిమాను దాదాపు రూ. 40 కోట్లు ఖర్చుపెట్టారట. అంతేకాకుండా ఈ సినిమాను అందరికీ రీచ్ కావాలని ఉద్దేశంతో భారీ స్కేల్ రూపొందించినట్లు తెలిపారు.
ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఒక సినిమా రూ. 10 కోట్లు బ్రేక్ ఈవెన్ సాధించడమే కష్టంగా ఉంది. అలాంటిది యశోద సినిమా కోసం రూ. 40 కోట్ల బ్రేక్ ఈవెన్ సాధిస్తుందా అని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే సినిమా కలెక్షన్స్ అనేది కంటెంట్.. స్క్రీన్ ప్లే పై ఆధారపడి ఉంటాయంటున్నారు సినీ విమర్శకులు.
ఇక ఇటీవల యశోద ప్రమోషనల్లో భాగంగా ప్రత్యేక ఇంటర్వ్యూలో పాల్గోన్న సామ్.. మయోసైటిస్ వ్యాధి గురించి చెబుతు భావోద్వేగానికి గురయ్యారు. ఇప్పటికింకా నేను చావలేదని. కానీ…కొన్ని రోజులు మంచి రోజులు. మరికొన్ని రోజులు చెడ్డరోజులు. వెనక్కి తిరిగి చూసుకుంటే ఇక నేను ఇంకొక్క అడుగు కూడా ముందుకు వేయలేనేమోననిపించింది. అయినా ఒక్క సారి వెనుతిరిగి చూస్తే ఇంత దాకా వచ్చానా అనిపిస్తోంది అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.