AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Theatre/OTT Movies: అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో మస్త్‌ ఎంటర్‌టైన్‌మ్మెంట్.. ఈవారం థియేటర్లు/ ఓటీటీ రిలీజులివే

పేరుకే చిన్న సినిమాలైనా కొన్ని సినిమాలు కంటెంట్‌ విషయంలో వైవిధ్యంతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి.

Theatre/OTT Movies: అదిరిపోయే సినిమాలు, సిరీస్‌లతో మస్త్‌ ఎంటర్‌టైన్‌మ్మెంట్.. ఈవారం థియేటర్లు/ ఓటీటీ రిలీజులివే
Theatre, Ott Movies
Basha Shek
|

Updated on: Nov 08, 2022 | 10:57 AM

Share

దసరా, దీపావళి తర్వాత పెద్ద హీరోల సందడి బాగా తగ్గిపోయింది. దీనిని క్యాష్‌ చేసుకుంటూ చిన్న సినిమాలు థియేటర్లలోకి పరుగులు పెడుతున్నాయి. వారానికి కనీసం ఐదారు కొత్త సినిమాలు ప్రేక్షకులను పలకరిస్తున్నాయి. పేరుకే చిన్న సినిమాలైనా కొన్ని సినిమాలు కంటెంట్‌ విషయంలో వైవిధ్యంతో సినీ ప్రియులను ఆకట్టుకుంటున్నాయి. అలా ఈ వారం కూడా కొన్ని సినిమాలు బాక్సాఫీస్‌ వద్ద సందడి చేసేందుకు రెడీ అవుతున్నాయి. ఇక ఎప్పటిలాగే ఆకట్టుకునే కంటెంట్‌తో ఓటీటీలో సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రానున్నాయి. మరి నవంబర్‌ రెండో వారంలో విడుదల కానున్న థియేటర్‌/ఓటీటీ సినిమాలు, సిరీస్‌లపై ఓ లుక్కేద్దాం రండి.

యశోదగా సామ్‌

Yashoda

Yashoda

జాను తర్వాత సమంత నేరుగా తెలుగులో నటిస్తోన్న చిత్రం యశోద. సైన్స్‌ ఫిక్షన్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌, ఉన్ని ముకుందన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. హరి, హరీష్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్లు సినిమాపై అంచనాలను పెంచేశాయి. ఈ సినిమా కోసమే సెలైన్‌ పెట్టుకుని మరీ డబ్బింగ్‌ చెప్పింది. ఇందులో కొన్ని యాక్షన్‌ సీక్వెన్స్‌ లోనూ ఆమె నటించింది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకున్న యశోద నవంబర్‌ 11న గ్రాండ్‌గా రిలీజ్‌ కానుంది.

నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ

Nachindi Girlfriend

Nachindi Girlfriend

ఆటగదరా శివ, మిస్ మ్యాచ్ చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఉదయశంకర్‌ హీరోగా నటించిన తాజా చిత్రం నచ్చింది నచ్చింది గర్ల్‌ ఫ్రెండూ. జెన్నీఫర్ హీరోయిన్‌గా నటించింది. గురు పవన్ దర్శకత్వంలో అట్లూరి నారాయణరావు తెరకెక్కించిన ఈ సస్పెన్స్‌ థ్రిల్లర్‌ 11న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఇవి కూడా చదవండి

ఊంచాయి

అమితాబ్‌బచ్చన్‌, అనుపమ్‌ ఖేర్‌, బొమన్‌ ఇరానీ, నీనా గుప్తా వంటి బాలీవుడ్‌ హేమాహేమీలు నటించిన చిత్రం ఊంచాయి. పరిణీతి చోప్రా, సారిక కీలక పాత్రలు పోషించారు. మైనే ప్యార్‌కియా, హమ్‌ ఆప్కే హై కౌన్‌, వివాహ్‌, ప్రేమ్‌రతన్‌ దన్‌ పాయో వంటి ప్రేమకథా కుటుంబ చిత్రాలను తెరెక్కించిన సూరజ్‌ బర్జాత్య దీనికి దర్శకత్వం వహించారు. నవంబరు 11న ఈ సినిమా థియేటర్లలో అడుగుపెట్టనుంది.

వీటితో పాటు నూతన హీరో, హీరోయిన్లు శ్రీరామ్‌ నిమ్మల, రిచా జోషి జంటగా నటించిన లవ్‌ ఎంటర్‌టైనర్‌ మది కూడా 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఓటీటీలో సినిమాలు/ వెబ్‌ సిరీస్‌లివే..

అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో

  • బ్రీత్‌ : ఇన్‌ టు ది షాడోస్‌ (హిందీ సిరీస్‌2)- నవంబరు 9
  • ఇరావిన్‌ నిగళ్‌ (తమిళ్‌ సినిమా)- నవంబరు 11
  • సిక్సర్‌ (హిందీ వెబ్‌ సిరీస్‌)- నవంబరు 11

నెట్‌ఫ్లిక్స్‌

  • బిహైండ్‌ ఎవ్రీ స్టార్‌ (కొరియన్‌ సిరీస్‌)- నవంబరు 8
  • ద క్లాజ్‌ ఫ్యామిలీ 2 (డచ్‌ సిరీస్‌)- నవంబరు 8
  • ట్రివియా వర్స్‌ (హాలీవుడ్‌)- నవంబరు 8
  • ద క్రౌన్‌ (వెబ్‌ సిరీస్‌)- నవంబరు 9
  • ఫాలింగ్‌ ఫర్‌ క్రిస్మస్‌ (హాలీవుడ్‌ )- నవంబరు 10
  • లాస్ట్‌ బుల్లెట్‌ (ఫ్రెంచ్‌ మూవీ)- నవంబరు 10
  • వారియర్‌ నన్‌ (వెబ్‌సిరీస్‌)- నవంబరు 10
  • మోనికా ఓ మై డార్లింగ్‌ (హిందీ)-నవంబరు 11
  • ఏన్సెంట్‌ అపోకలిప్స్‌ (వెబ్‌సిరీస్‌)- నవంబరు 11
  • థాయ్‌ మసాజ్‌ (హిందీ)- నవంబరు 11

డిస్నీ పస్ల్‌ హాట్‌స్టార్‌

  • సేవ్‌ ఔర్‌ స్క్వాడ్‌ (ఒరిజినల్‌ సిరీస్‌)- నవంబరు 09
  • మనీ మాఫియా (హిందీ సిరీస్‌)- నవంబరు 10
Mammootty Rorschach

Mammootty Rorschach

  • రోస్‌చాక్‌ (తెలుగు)- నవంబరు 11

జీ5

  • ముఖ్‌బీర్‌ (హిందీ సిరీస్‌)- నవంబరు 11

సోనీ లివ్‌

  • తనావ్‌ (హిందీ సిరీస్‌)- నవంబరు 11

లయన్స్‌ గేట్‌ ప్లే

  • హాట్‌సీట్‌ (హాలీవుడ్‌)- నవంబరు 11

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.