Samantha : ఒకే కారులో సమంత, రాజ్.. వీడియో వైరల్.. మరోసారి వార్తల్లోకి సామ్..
కొన్ని రోజులుగా హీరోయిన్ సమంత వార్తలలో నిలుస్తున్న సంగతి తెలిసిందే. చాలా కాలం తర్వాత నిర్మాతగా రీఎంట్రీ ఇచ్చిన సామ్ సక్సెస్ అయ్యింది. దీంతో అటు నటిగా, ఇటు నిర్మాతగా కొనసాగుతుంది. అయితే ఇటీవల సామ్ ప్రేమలో ఉందని.. త్వరలోనే పెళ్లి చేసుకోబోతుందనే రూమర్స్ తెగ వినిపిస్తున్నాయి. ఇక ఇప్పుడు మరోసారి ఆమె పేరు మారుమోగుతుంది.

టాలీవుడ్ హీరోయిన్ సమంత ఇప్పుడిప్పుడే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తుంది. కొన్నాళ్లపాటు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న సామ్.. ఇప్పుడు కథానాయికగా సినిమాల్లో నటించేందుకు రెడీ అయ్యింది. అలాగే ఇటు నిర్మాతగానూ సక్సెస్ అవుతుంది. ఇప్పటికే ఆమె నిర్మించిన శుభం సినిమా సూపర్ హిట్ కాగా.. త్వరలోనే మరిన్ని ప్రాజెక్ట్స్ నిర్మించేందుకు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే.. కొన్ని రోజులుగా సమంత ప్రేమలో ఉందంటూ వార్తలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో సామ్ ప్రేమలో ఉందని.. త్వరలోనే వీరిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్లు టాక్ నడుస్తుంది. ఈ క్రమంలోనే ఆ వార్తలకు మరింత బలం చేకూరేలా వీరిద్దరు కలిసి కనిపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి.. ఒక్క యాడ్‌తో ఫేమస్ అయ్యింది.. హీరోయిన్లకు మించిన క్రేజ్.. ఈ అమ్మడు ఇప్పుడేలా ఉందో తెలుసా.. ?
తాజాగా మరోసారి వీరిద్దరు కెమెరా కంటికి చిక్కారు. ఒకే కారులో వెళ్తూ కనిపించడంతో ఫోటోగ్రాఫర్స్ వీరిని క్లిక్‌మనిపించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోస్ వైరలవుతున్నాయి. వీరిద్దరూ కలిసి ఓ రెస్టారెంట్ కు డిన్నర్ కు వెళ్లినట్లు తెలుస్తోంది. సమంత క్యాజువల్ వైట్ డ్రెస్ లో నవ్వుతూ కనిపించగా.. ఇద్దరు కలిసి ఒకే కారులో ఇళ్లకు వెళ్లడంతో మరోసారి వీరి పేర్లు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి.. Actress: అప్పుడు పద్దతిగా.. ఇప్పుడు గ్లామర్ బ్యూటీగా.. సెకండ్ ఇన్నింగ్స్‌లో అందాల రచ్చ..
రాజ్, డీకే సంయుక్తంగా తెరకెక్కించిన ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2, సిటడెల్ : హనీ బన్నీ సిరీస్ లో సమంత కీలకపాత్ర పోషించింది. ఆయా ప్రాజెక్టుల కోసం వర్క్ చేస్తున్న సమయంలోనే వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడింది. ఇక ఈమధ్య వీరిద్దరు డేటింగ్ లో ఉన్నారని.. ఈ ఏడాది చివర్లో పెళ్లి చేసుకోబోతున్నారంటూ వార్తలు వినిపిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి.. Actress : గ్లామర్ ఫోటోలతో మెంటలెక్కిస్తోన్న హీరోయిన్.. అందాలు ఫుల్లు.. ఆఫర్స్ నిల్లు..
View this post on Instagram








