Sikandar Trailer: సికందర్ ట్రైలర్ వేరేలెవలబ్బా.. సల్మాన్, రష్మిక కెమిస్ట్రీ అదుర్స్..
బాలీవుడ్ ఇండస్ట్రీలో భాయిజాన్ సల్మాన్ ఖాన్ క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. భద్రత కారణాల దృష్ట్యా కొన్నాళ్లుగా సినిమాలు తగ్గించిన సల్మాన్.. ఇప్పుడు సికందర్ సినిమాతో అడియన్స్ ముందుకు రాబోతున్నారు. ఈ ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ క్రమంలోనే సికందర్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ నటిస్తోన్న సికందర్ సినిమా గురించి ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఈద్ సందర్భంగా ఈ సినిమా అడియన్స్ ముందుకు రాబోతుంది. కోలీవుడ్ డైరెక్టర్ ఏఆర్ మురగదాస్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన్నా కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే ఇందులో కాజల్ అగర్వాల్, సత్యరాజ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ డ్రామాగా రూపొందిస్తున్న ఈసినిమాను ఈనెల 30న థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్స్, సాంగ్స్ రిలీజ్ చేసిన చిత్రయూనిట్.. ఇప్పుడు ఆదివారం సాయంత్రం ట్రైలర్ రిలీజ్ చేసి అభిమానులకు సర్ ప్రైజ్ ఇచ్చింది.
ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ అదిరిపోయింది. మరోసారి సల్మాన్ తన యాక్షన్ మోడ్‌తో అభిమానులను అలరించనున్నట్లు తెలుస్తోంది. ఎప్పటిలాగే మాస్ లుక్ లో కనిపిస్తున్నాడు సల్మాన్. అలాగే ఇందులో సల్మాన్, రష్మిక కెమిస్ట్రీ ఆకట్టుకుంటుంది. విడుదలకు ముందే సల్మాన్ తో రష్మిక జోడి గురించి ఎన్నో విమర్శలు వచ్చాయి. కానీ ట్రైలర్ చూస్తే ట్రైలర్ చూస్తే సినిమాలో రష్మికతో సల్మాన్ కెమిస్ట్రీ అభిమానులను ఆకట్టుకునేలా కనిపిస్తోంది. కాజల్ ముఖ్య పాత్రలో కనిపిస్తుండగా.. సత్యరాజ్ విలన్ గా కనిపించనున్నారు.
గతంలో ఆమిర్ ఖాన్ తో కలిసి గజిని సినిమాను రూపొందించి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టాడు మురుగదాస్. ఇప్పుడు చాలా కాలం తర్వాత సల్మాన్ ఖాన్ తో కలిసి సికందర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. సల్మాన్ ఖాన్ చిత్రం 1000 కోట్ల క్లబ్‌లో చేరుతుందని.. బ్లాక్ బస్టర్ హిట్ కావడం ఖాయమంటున్నారు ఫ్యాన్స్. ఈ మూవీ మార్చి 30న రిలీజ్ కానుంది.
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..