Mrunal Thakur: ఎన్నాళ్లకు వచ్చిందయ్యో ఛాన్స్.. ఆ స్టార్ హీరోకు జోడిగా మృణాల్.. మరోసారి సౌత్ ఇండస్ట్రీలో..
తెలుగులో ఫస్ట్ మూవీతోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. అందం, అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులను కట్టిపడేసిన ఈ ముద్దుగుమ్మ.. ఆ తర్వాత మరో రెండు చిత్రాల్లో మెరిసింది. ఆ తర్వాత అవకాశాలు రాకపోవడంతో తిరిగి బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది. ఇక ఇప్పుడు తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందని టాక్ వినిపిస్తుంది.

సీతా రామం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది హీరోయిన్ మృణాల్ ఠాకూర్. ఫస్ట్ మూవీతోనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ క్రేజ్ సొంతం చేసుకుంది. సీతామహాలక్ష్మీ పాత్రలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీలో మలయాళీ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో తెలుగులో మృణాల్ పేరు మారుమోగింది. కట్ చేస్తే టాలీవుడ్ లో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆ వెంటనే న్యాచురల్ స్టార్ నాని జోడిగా హాయ్ నాన్న సినిమాతో మరో హిట్ కొట్టింది. కానీ ఆతర్వాత విజయ్ దేవరకొండ సరసన నటించిన ఫ్యామిలీ స్టార్ మాత్రం నిరాశ పరిచింది. దీంతో తెలుగులో మృణాల్ కు అవకాశాలు తగ్గిపోయాయి.
కొన్నాళ్లుగా హిందీలో ఆఫర్స్ అందుకుంటున్న మృణాల్ .. ప్రస్తుతం డెకాయిట్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా ఈ బ్యూటీ సౌత్ ఇండస్ట్రీలో మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసినట్లు తెలుస్తోంది. కోలీవుడ్ స్టార్ హీరో శింబు సరసన మృణాల్ నటించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం శింబు చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్నాడు. అతడి చేతిలో దాదాపు 3 సినిమాలు ఉన్నాయి. STR 49 కి రాజ్ కుమార్ బాలకృష్ణన్ దర్శకత్వం వహించగా, STR 50 కి దేసింగు పెరియసామి, STR 51 కి అశ్వత్ మారిముత్తు దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో డైరెక్టర్ రాజ్ కుమార్ బాలకృష్ణన్ తెరకెక్కిస్తోన్న STR 49 చిత్రంలో శింబు సరసన మృణాల్ కనిపించనుందట. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని డాన్ పిక్చర్స్ నిర్మించనుంది. ఇందులో సంతానం, సాయి పల్లవి, సిలంబరసన్ నటించనున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చినప్పటికీ, ఇప్పుడు నటి మృణాల్ ఠాగూర్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నట్లు టాక్ నడుస్తుంది. థగ్ లైఫ్ సినిమా తర్వాత ఈ మూవీ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుందని చెబుతున్నారు. ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతుందని కూడా సమాచారం.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..
Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?
Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..