Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Savitri Grandson: మహా నటి సావిత్రి నట వారసుడిగా అడుగు పెట్టి.. తక్కువ సమయంలో కనుమరుగైన హీరో ఎవరో తెలుసా..

తెలుగు చిత్ర పరిశ్రమ లో వెండి తెర సామ్రాజ్ఞి మహానటి సావిత్రి. అలనాటి మేటి మహానటి సావిత్రి జీవితం ఒక విషాద గీతం. తన సహా నటుడైన జెమిని గణేషన్ ను సావిత్రి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. సావిత్రి జెమిని గణేషన్ దంపతులకు ఒక కూతురు, ఒక కొడుకు.. సతీష్, విజయ చాముండేశ్వరి. అయితే సావిత్రి వారసులుగా కూతురు, కొడుకు వెండి తెరపై అడుగు పెట్టలేదు.. అయితే సావిత్రి కూతురు చాముండేశ్వరి రెండో తనయుడు అభినయ్ మాత్రం వెండితెరపై అడుగు పెట్టి.. హీరోగా నటించాడని మీకు తెలుసా..

Savitri Grandson: మహా నటి సావిత్రి నట వారసుడిగా అడుగు పెట్టి.. తక్కువ సమయంలో కనుమరుగైన హీరో ఎవరో తెలుసా..
Savitri Grandson
Follow us
Surya Kala

|

Updated on: Mar 23, 2025 | 4:58 PM

సావిత్రి జెమిని గణేషన్ దంపతులకు సతీష్, విజయ చాముండేశ్వరి. సావిత్రి కుమారుడు సతీష్ కు అసలు నటన అంటే ఆసక్తి లేకపోవడంతో సిని పరిశ్రమ వైపు చూడలేదు. అయితే కుమార్తె విజయ చాముండేశ్వరి మాత్రం నటిగా బుల్లితెరపై అడుగు పెట్టింది. కానీ పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే సావిత్రి వారసుడిగా విజయ చాముండేశ్వరి రెండో కుమారుడు అభినయ్ నటుడుగా వెండి తెరపై అడుగు పెట్టాడు. సావిత్రి వారసుడిగా తన నటనతో ప్రముఖుల మన్ననలు అందుకున్నాడు. అయితే అతను మహానటి సావిత్రి మనువడు అనే సంగతి కొద్దిమందికి మాత్రమే తెలుసు.

అమ్మమ్మ కి నటవారసుడిగా దర్శక రత్న దాసరి నారాయణ రావు దర్శకత్వంలో తెరకెక్కిన యంగ్ ఇండియా సినిమాతో వెండి తెరపై అడుగు పెట్టాడు అభినయ్. అయితే వాస్తవానికి అభినయ్ టేబుల్ టెన్నిస్ లో మంచి క్రీడాకారుడు. టేబుల్ టెన్నిస్ తమిళనాడు రాష్ట్రం తరపున అనేక పోటీల్లో పాల్గొన్నాడు. బికాం పూర్తి చేసిన అభినయ్ ఎమ్మెస్ చేయడానికి యూకే కి వెళ్ళాడు. అయితే ఇక్కడే అభినయ్ ఆలోచనల్లో మార్పు వచ్చింది. తన అమ్మమ్మ సావిత్రి గొప్పదనం.. అభిమానుల గురించి తెలుసుకున్నాడు. అప్పుడే అభినయ్ మనసులో నటన గురించి ఆలోచన వచ్చింది.

అభినయ్ దృష్టి సినిమాలపై పడింది. అప్పుడు దాసరి తెరకెక్కిస్తున్న యంగ్ ఇండియా సినిమా కోసం నూతన నటీనటుల కోసం అన్వేషణ అనే ప్రకటన చూసిన అభినయ్ తండ్రి ఒక ప్రయత్నం చేయమని చెప్పారు. తన గురించి ఏమీ చెప్పకుండా యంగ్ ఇండియా సినిమాలో నటుడిగా ఎంపికయ్యాడు. నటుడిగా వెండి తెరపై అడుగు పెట్టాడు.

ఇవి కూడా చదవండి

అల్లు అర్జున్, రామ్ చరణ్, మంచు మనోజ్ లతో మంచి రిలేషన్ షిప్ ఉందని చెబుతాడు ఈ అభినయ్. అమ్మమ్మ సావిత్రి , తాతగారు జెమిని గణేషన్, పెద్దమ్మ రేఖలు కూడా మంచి నటులే కావడంతో అభినయ్ కు సహజంగానే నటన ఉంది. పలు కోలీవుడ్ లో కొన్ని సినిమాలతో పాటు.. హాలీవుడ్ లో తెరకెక్కిన భారత్ గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ బయో పిక్ లో కూడా అభినయ్ నటించాడు. తన నటనతో దేశ విదేశీ ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాడు అభినయ్.

మంచి నటుడుగా పేరు తెచ్చుకుని అమ్మమ్మ నట వారసుడిగా రాణించాలని ఎంతో ఆశతో వెండి తెరపై అడుగు పెట్టినా.. సరైన అవకాశాలు లభించలేదు. దీంతో కొంత కాలంలోనే ఫేడ్ అవుట్ అయిపోయాడు. అయితే బిగ్ బాస్ తమిళ్ సీజన్ 5 లో అభినయ్ అడుగు పెట్టి బుల్లి తెర ప్రేక్షకులను ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

అభినయ్ 2007 లో అపర్ణను వివాహం చేసుకున్నాడు.  ఈ జంటకు ఒక కుమార్తె కూడా ఉంది. పేరు స్వస్తిక అభినయ్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..