Health Benefits: ఉసిరి రసంలో మిరియాల పొడిని కలిపి తాగడం వలన ఎన్ని ప్రయోజనాలో తెలుసా.. ఎలా తాగాలంటే..
ఉసిరి , నల్ల మిరియాలు రెండూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్నాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తినేటప్పుడు ఏమి జరుగుతుంది? ముఖ్యంగా ఉసిరి రసంలో నల్ల మిరియాల పొడి కలిపి తాగడం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి... ఎవరు ఈ జ్యూస్ ని తాగవద్దో తెలుసుకుందాం..

మన భారతీయ సంప్రదాయంలో ఉసిరిని ఆరోగ్య నిధిగా భావిస్తారు. దీనిలో ఉండే విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు, అనేక పోషకాలు శరీరానికి అనేక ప్రయోజనాలను ఇస్తాయి. అదే సమయంలో నల్ల మిరియాలు దాని ఔషధ గుణాలతో ప్రసిద్ధి చెందాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకున్నప్పుడు.. వీటి ప్రభావం రెట్టింపు అవుతుంది. అనేక వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
ఉసిరి రసం, నల్ల మిరియాలు రెండూ సహజంగా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. ఎవరైనా రోగనిరోధక శక్తిని బలోపేతం చేసుకోవలనుకున్నా, జీర్ణక్రియను మెరుగుపరచాలనుకున్నా లేదా చర్మం , జుట్టును ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకున్నా ఈ మిశ్రమం మీకు దివ్యౌషధం కావచ్చు. ఈ రోజు నల్ల మిరియాల పొడిని ఉసిరి రసంతో కలిపి తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి? దానిని ఎలా తీసుకోవాలో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి
రోగనిరోధక శక్తిని బలోపేతం చేసే విటమిన్ సి కి ఉసిరి ఉత్తమ మూలకం. అదే సమయంలో నల్ల మిరియాలు యాంటీ బాక్టీరియల్, యాంటీవైరల్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి శరీరాన్ని ఇన్ఫెక్షన్ నుంచి రక్షిస్తాయి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల జలుబు, దగ్గు, ఫ్లూ వంటి సమస్యలు దూరమవుతాయి.
జీర్ణవ్యవస్థ
మీకు గ్యాస్, అజీర్ణం లేదా ఆమ్లత్వం వంటి కడుపు సమస్యలు ఉంటే ఉసిరి రసం, నల్ల మిరియాలు మిశ్రమం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉసిరి కడుపును చల్లబరుస్తుంది, నల్ల మిరియాలు కడుపులో వాయువు ఏర్పడకుండా నిరోధించి జీర్ణ ఎంజైమ్‌లను సక్రియం చేస్తాయి.
బరువు తగ్గించడంలో సహాయపడుతుంది
బరువు తగ్గాలనుకునే వారికి ఇది ఒక చక్కని పరిష్కారం. ఉసిరి రసం శరీరం నుంచి విషాన్ని తొలగిస్తుంది. జీవక్రియను వేగవంతం చేస్తుంది. అయితే నల్ల మిరియాలు శరీరంలో నిల్వ ఉన్న అదనపు కొవ్వును కాల్చడంలో సహాయపడతాయి. ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో దీన్ని తాగడం వల్ల బరువు త్వరగా తగ్గుతారు.
చర్మానికి, జుట్టుకి
ఉసిరి జ్యూస్ తాగడం వల్ల చర్మం మెరుస్తుంది. జుట్టు బలంగా ఉంటుంది. ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్లు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతాయి. జుట్టు రాలడాన్ని తగ్గిస్తాయి. నల్ల మిరియాలు చర్మం నుంచి మృతకణాలను తొలగించడంలో సహాయపడతాయి. ముఖం శుభ్రంగా , ప్రకాశవంతంగా కనిపించేలా చేస్తాయి.
కంటి చూపును మెరుగుపరుస్తుంది
కంటి చూపు బలహీనంగా ఉన్నా లేదా కళ్ళు మంటగా, పొడిగా అనిపిస్తే ఉసిరి రసం, నల్ల మిరియాల పొడి కలిపి తీసుకోండి. ఉసిరి కంటి చూపును మెరుగుపరచడంలో సహాయపడుతుంది. నల్ల మిరియాలు కంటి ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తాయి.
ఎలా తీసుకోవాలంటే
ఒక గ్లాసు తాజా ఉసిరి రసంలో అర టీస్పూన్ నల్ల మిరియాల పొడి కలపండి. ఉదయం ఖాళీ కడుపుతో తాగండి. తద్వారా శరీరం దీనిని సరిగ్గా గ్రహించగలదు. రుచి చాలా ఘాటుగా అనిపిస్తే.. అప్పుడు ఆ మిశ్రమానికి కొద్దిగా తేనె జోడించవచ్చు. దీన్ని రోజూ తాగడం వల్ల 2-3 వారాలలో ఫలితాలు కనిపించడం ప్రారంభిస్తాయి.
దీన్ని ఎవరు తాగకూడదంటే
తక్కువ రక్తపోటు సమస్య ఉంటే.. డాక్టర్ సలహా లేకుండా ఈ రసాన్ని తీసుకోకండి. దీన్ని ఎక్కువ పరిమాణంలో తీసుకోవడం వల్ల కడుపులో చికాకు కలుగుతుంది. కనుక పరిమిత పరిమాణంలో మాత్రమే తీసుకోండి. అదే విధంగా గర్భిణీ స్త్రీలు, పిల్లలు దీనిని తీసుకునే ముందు వైద్యుడిని సంప్రదించాలి.
మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..
(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)