Astro Tips: ఈ లక్షణాలు కనిపిస్తే జాతకంలో రాహు చెడు స్థానంలో ఉన్నట్లే… పరిహారాలు ఏమిటంటే..
జ్యోతిషశాస్త్రంలో నవ గ్రహాల్లో రాహువు ఒక గ్రహం. ఈ రాహువు ఒక ఛాయా గ్రహం అని చెప్పబడింది. రాహువును సమస్యాత్మక గ్రహంగా భావిస్తారు. ఎవరి జాతకంలోనైనా రాహువు స్థానం మంచిగా ఉంటే.. అతను జీవితంలో మంచి ఫలితాలను పొందుతాడు. రాహువు చెడుగా ఉంటే సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.

తొమ్మిది గ్రహాలకు సంబంధించిన వివరణ జ్యోతిషశాస్త్రంలో కనిపిస్తుంది. ప్రతి గ్రహానికి దాని సొంత నిర్వచనం ఉంటుంది. ప్రతి గ్రహం వ్యక్తి జీవితాన్ని శుభ లేదా అశుభ మార్గంలో ప్రభావితం చేస్తుంది. ఒక వ్యక్తి జాతకంలో గ్రహాల స్థానం ఆ వ్యక్తికి శుభ శుభం లేదా అశుభ ఫలితాలను ఇస్తుంది. ఈ గ్రహాలలో రాహువు కూడా ఉన్నాడు. రాహువు ఒక తమస రాక్షసుడు. దీనిని రాక్షస పాము తలగా భావిస్తారు. రాహువును నీడ గ్రహంగా భావిస్తారు. పొడగరి, నల్లని మేని ఛాయ కలవాడు. నాలుగు భుజములు గలవాడు.
రాహువుకు ఇబ్బంది కలిగించే గ్రహాలు
జ్యోతిషశాస్త్రంలో రాహువును సమస్యాత్మక గ్రహంగా పరిగణిస్తారు. ఎవరి జాతకంలోనైనా రాహువు చెడు స్థితిలో ఉంటే.. అతను సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉంటాడు. జన్మ జాతకంలో చెడు స్థానంలో ఉన్న రాహువు.. ఆ వ్యక్తిని చెడు పనులు చేసే విధంగా ప్రేరేపిస్తుంది. జాతకంలో చెడు స్థానంలో రాహువు ఉంటే.. ఆ వ్యక్తి తీవ్ర వ్యాధులతో బాధపడేలా చేస్తాడు. అప్పుల భారం పెరుగుతుంది. వ్యసనాల బారిన పడేలా చేస్తుంది. రాహువు శుభప్రద స్థానంలో ఉంటే ఆ వ్యక్తి జీవితంలో విజయం, ఉన్నత శిఖరాలను సాధిస్తాడు. అటువంటి పరిస్థితిలో జాతకంలో చెడు స్థానంలో రాహువు ఉంటే.. ఆ లక్షణాలు ఎలా ఉంటాయి.. నివారణ చర్యలను కూడా తెలుసుకుందాం..
జాతకంలో చెడు రాహువు సంకేతాలు
జాతకంలో రాహువు చెడు స్థితిలో ఉంటే.. ఆ వ్యక్తి కడుపు సంబంధిత సమస్యలను ఎదుర్కొంటాడు. తల నొప్పితో ఇబ్బంది పడతాడు. సంబంధాలు చెడిపోతాయి. ఎక్కువగా అపార్థాలలో జీవిస్తాడు. ఆర్థిక నష్టం ఏర్పడుతుంది. పరస్పర సమన్వయం లోపిస్తుంది.. జాతకంలో రాహువు చెడు స్థితిలో ఉంటే.. ఆ వ్యక్తి చిన్న విషయాలకే కోపాన్ని వ్యక్తం చేస్తాడు. మాటలు కఠినంగా ఉంటాయి. వాహన ప్రమాదానికి గురయ్యే అవకాశం ఉంది.
ఆ వ్యక్తి అవమానానికి గురవుతాడు. మంచి స్నేహితులు ఉండరు. ఆ వ్యక్తి తన కెరీర్ గురించి గందరగోళంగా ఉంటాడు. ఇంట్లో ఎర్ర చీమలు చాలా ఉంటాయి. రాహువు జాతకంలో చెడు స్థితిలో ఉన్నప్పుడు.. ఆ వ్యక్తిలో భయం, అభద్రతా భావన, సోమరితనం, బలహీనత ఉంటాయి. వ్యక్తి చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు కలుగుతూ ఉంటాయి. వివాహం జాప్యం అవుతుంది. మానసిక ఒత్తిడి ఉంటుంది. వ్యాపారంలో నష్టం కలుగుతుంది.
రాహువుకు చేయాల్సిన పరిహారాలు
- జాతకంలో రాహువు చెడు స్థానంలో ఉన్న వ్యక్తులు తమ ఇంట్లో పనికిరాని, పాడైన ఎలక్ట్రానిక్ వస్తువులను ఉంచవద్దు.
- శివుడిని పూజించాలి. శివ మంత్రాలను జపించాలి. ఎందుకంటే రాహువును శివ భక్తుడిగా భావిస్తారు.
- భైరవనాథుని ఆలయంలో ఆవనూనెతో దీపం వెలిగించాలి.
- శనివారం రోజున నల్ల నువ్వులు, ఆవ నూనె, నీలిరంగు వస్త్రాలను దానం చేయాలి.
- హనుమాన్ చాలీసాను ప్రతిరోజూ పఠించాలి.
- మత్తు కలిగించే పదార్థాలను సేవించకూడదు.
- ప్రతి రోజూ ధ్యానం, యోగా చేయాలి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు