Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Weekly Horoscope: ఆర్థిక వ్యవహారాల్లోవారు ఎవరినీ నమ్మకండి.. 12 రాశుల వారికి వారఫలాలు

వార ఫలాలు (మార్చి 23-29, 2025): మేష రాశి వారికి ఈ వారం ఆదాయం బాగానే పెరుగుతుంది. రావలసిన డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. వృషభ రాశి వారికి బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. మిథున రాశి వారికి ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. మేష రాశి మొదలు మీన రాశి వరకు 12 రాశుల వారికి వారఫలాలు ఎలా ఉన్నాయంటే..

TV9 Telugu Digital Desk

| Edited By: Janardhan Veluru

Updated on: Mar 23, 2025 | 5:01 AM

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1): ఈ వారమంతా చాలావరకు అనుకూలంగా గడిచిపోతుంది. సాధారణంగా ఏ ప్రయత్నం తలపెట్టినా సఫలం అవుతుంది. ఆదాయం బాగానే పెరుగుతుంది. రావలసిన డబ్బు కూడా కొద్ది ప్రయత్నంతో చేతికి అందుతుంది. ఎవరితోనూ ఆర్థిక లావాదేవీలు పెట్టుకోకపోవడం మంచిది. వృత్తి, వ్యాపారాల్లో బాగా పురోగతి సాధిస్తారు. ఉద్యోగంలో మీ పనితీరు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి. ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపడుతుంది. ఆర్థిక సమస్యల పరిష్కారం మీద దృష్టి పెడతారు. ఆరోగ్యం విషయంలో శ్రద్ధ వహించాల్సి ఉంటుంది. నిరుద్యోగుల ప్రయత్నాలకు విదేశాల నుంచి కూడా ఆశించిన సమాచారం అందుతుంది. విద్యార్థులకు సమయం అనుకూలంగా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి. పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

1 / 12
వృషభం (కృత్తిక 2,3,4, రోహిణి, మృగశిర 1,2): ఉద్యోగంలో అధికారులు కాస్తంత ఎక్కువగా మీ సేవలను ఉపయోగించుకుంటారు. బరువు బాధ్యతలు బాగా పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాల్లో తీరిక ఉండని పరిస్థితి ఏర్పడుతుంది. ఇంటా బయటా కూడా ఒత్తిడి ఉంటుంది. ఆదాయానికి లోటుండదు కానీ, కుటుంబ ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక వ్యవహారాల్లో సొంత నిర్ణయాలు మంచిది. కొందరు బంధుమిత్రుల వల్ల ఆర్థికంగా ఇబ్బందుల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యమైన వ్యవహారాలను సకాలం పూర్తి చేస్తారు. ప్రతి పనిలోనూ శ్రమ, తిప్పట, వ్యయ ప్రయాసలు తప్పకపోవచ్చు. వ్యక్తిగత సమస్యలు బాగా తగ్గుముఖం పడతాయి. మంచి పరిచయాలు కలుగుతాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. విద్యార్థులు కొద్దిగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. ఉద్యోగ, పెళ్లి ప్రయత్నాల్లో ఒకటి రెండు శుభవార్తలు వింటారు.

2 / 12
మిథునం (మృగశిర 3,4, ఆర్ద్ర, పునర్వసు 1,2,3): ఉద్యోగంలో బరువు బాధ్యతలు పెరిగినప్పటికీ, ఆశించిన ప్రతిఫలం ఉంటుంది. వృత్తి, వ్యాపారాల్లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆర్థిక వ్యవహారాలు సానుకూలంగా సాగిపోతాయి. ఆర్థిక పరిస్థితికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. కొన్ని అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. వస్త్రాభరణాల మీద ఎక్కువగా ఖర్చు చేస్తారు. ఇష్టమైన బంధుమిత్రులతో సర దాగా గడుపుతారు. నిరుద్యోగులకు ఆశించిన స్పందన లభిస్తుంది. ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఉత్తమ ఫలితాలు పొందుతారు. ఆహార, విహారాల్లో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆస్తి వివాదానికి సంబంధించి ఆశించిన సమాచారం అందుతుంది.

3 / 12
కర్కాటకం (పునర్వసు 4, పుష్యమి, ఆశ్లేష): వారమంతా బాగా అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి ఒకటి రెండు శుభవార్తలు వింటారు. వృత్తి, వ్యాపారాలు బాగా బిజీగా సాగిపోతాయి. నిరుద్యోగులకు దూర ప్రాంత సంస్థల నుంచి ఆఫర్ అందే అవకాశం ఉంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. ముఖ్యమైన పనులు, వ్యవహారాలు కొద్ది ప్రయత్నంతో పూర్తవుతాయి. ఆదాయం బాగా వృద్ధి చెందుతుంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ప్రముఖులతో సన్నిహిత సంబంధాలు ఏర్పడతాయి. కొన్ని అనవసర పరిచయాలకు కూడా అవకాశం ఉంది. కుటుంబ పెద్దల జోక్యంతో ఆస్తి వివాదం పరిష్కారమవుతుంది. విద్యార్థులు సునాయాసంగా పురోగతి సాధిస్తారు. కుటుంబసమేతంగా ఇష్టమైన పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు.

4 / 12
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1): ఆదాయ ప్రయత్నాలు సత్ఫలితాలనిస్తాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉన్నప్పటికీ, ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండడం, ధనపరంగా ఎవరికీ వాగ్దానాలు చేయకపోవడం మంచిది. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమ పెరిగినా మంచి ఫలితాలుంటాయి. కుటుంబ సభ్యుల మీద ఖర్చులు బాగా పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యానికి ఢోకా ఉండదు. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి కూడా కొద్దిగా ఉపశమనం లభిస్తుంది. వ్యాపారాల్లో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో మిత్రులను సైతం నమ్మకపోవడం మంచిది. పరిచయస్థుల్లో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. బంధువుల ఆరోగ్యానికి సంబంధించి ఆందోళనకర వార్త వినడం జరుగుతుంది. విద్యార్థులు సునాయాసంగా విజయాలు సాధిస్తారు. ఉన్నత స్థాయి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి.

5 / 12
కన్య (ఉత్తర 2,3,4, హస్త, చిత్త 1,2): ఉద్యోగంలో ప్రత్యేక బాధ్యతలను నిర్వర్తించాల్సి వస్తుంది. ఉద్యోగపరంగా ప్రాధాన్యం పెరుగుతుంది. వృత్తి జీవితం సానుకూలంగా సాగిపోతుంది. వ్యాపారాల్లో లాభాలు పెరిగే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో వారమంతా సానుకూలంగా సాగిపోతుంది. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. ఆకస్మిక ధన లాభానికి కూడా అవకాశముంది. కొందరు మిత్రుల సహాయంతో కొన్ని ముఖ్యమైన పనులు, వ్యవహారాలు పూర్తవుతాయి. ఒకరిద్దరు బంధుమిత్రులకు ఆర్థికంగా సహాయపడతారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. దూరపు బంధువుల నుంచి పెళ్లి ప్రయత్నాల విషయంలో శుభవార్తలు అందుతాయి. విద్యార్థులు ఆశించిన ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక విషయాల్లో ఎవరినీ గుడ్డిగా నమ్మవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగం లభించే అవకాశం ఉంది.

6 / 12
తుల (చిత్త 3,4, స్వాతి, విశాఖ 1,2,3): వారమంతా ఉత్సాహంగా, ఉల్లాసంగా సాగిపోతుంది. ఆదాయ వృద్ధికి సమయం బాగా అనుకూలంగా ఉంది. సద్వినియోగం చేసుకోవడం మంచిది. ఇప్పుడు తీసుకునే నిర్ణయాలు, చేపట్టే ప్రయత్నాలు తప్పకుండా ఆశించిన ఫలితాలనిస్తాయి. ఆరోగ్యం బాగానే ఉంటుంది. దీర్ఘకాలిక అనారోగ్యాల నుంచి సైతం ఉపశమనం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సకాలంలో లక్ష్యాలను పూర్తి చేసి అధికారుల అభిమానాన్ని చూరగొంటారు. వ్యాపారాల్లో లాభాలు ఆశాజనకంగా ఉంటాయి. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి ఆశించిన శుభవార్త అందుతుంది. విద్యార్థులు కొద్ది ప్రయత్నంతో ఘన విజయాలు సాధిస్తారు. ఆర్థిక లావాదేవీలు పెట్టుకోవద్దు. నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పడు తుంది. ప్రేమ వ్యవహారాలు పెళ్లికి దారితీస్తాయి. విదేశీయానానికి మార్గం సుగమం అవుతుంది.

7 / 12
వృశ్చికం (విశాఖ 4, అనూరాధ, జ్యేష్ట): వృత్తి, వ్యాపారాలు సంతృప్తికరంగా సాగిపోతాయి. ఉద్యోగంలో అదనపు బాధ్యతలు తప్పకపో వచ్చు. ఆదాయానికి లోటుండదు. అదనపు ఆదాయ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థిక పరిస్థితి ఇదివరకటి కంటే మెరుగ్గా ఉంటుంది. ఒకరిద్దరు బంధు మిత్రులకు ఆర్థికంగా సహాయం కూడా చేస్తారు. వృథా ఖర్చులు ఇబ్బంది పెడతాయి. గృహ, వాహన ప్రయత్నాలు ఒక కొలిక్కి వస్తాయి. చాలా కాలంగా పెండింగులో ఉన్న కొన్ని ముఖ్యమైన పనుల్ని కొద్ది వ్యయ ప్రయాసలతో పూర్తి చేస్తారు. ఆర్థిక విషయాల్లో కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహాయ సహకారాలు లభిస్తాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. రావలసిన సొమ్మును, మొండి బాకీలను ఎట్టకేలకు వసూలు చేసుకుంటారు.  విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధిస్తారు.

8 / 12
ధనుస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1): ఉద్యోగంలో మీ పనితీరుతో అధికారులను ఆకట్టుకుంటారు. వృత్తి, వ్యాపారాలు లాభసాటిగా సాగిపోతాయి. ఆర్థిక విషయాల్లో ఆచితూచి వ్యవహరించడం మంచిది. డబ్బు ఇవ్వడం, తీసుకోవడం వంటివి పెట్టుకోవద్దు. అనేక మార్గాల్లో ఆదాయం వృద్ధి చెందుతుంది. షేర్లు, స్పెక్యులేషన్లు కూడా బాగా లాభిస్తాయి. ఇంటా బయటా బాధ్యతల ఒత్తిడి ఉంటుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఇతరుల బాధ్యతలను నెత్తిన వేసుకుని ఇబ్బంది పడతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల సహాయంతో ముఖ్యమైన పనులు, వ్యవహారాల్ని పూర్తి చేస్తారు. ఒక శుభ కార్యానికి ప్లాన్ చేస్తారు. విహార యాత్రకు వెళ్లే అవకాశం ఉంది. ఇష్టమైన బంధుమిత్రుల్ని కలుసుకుంటారు. చిన్ననాటి మిత్రులతో ఎంజాయ్ చేస్తారు. విద్యార్థులు కొద్ది శ్రమతో విజయాలు సాధిస్తారు.

9 / 12
మకరం (ఉత్తరాషాఢ 2,3,4, శ్రవణం, ధనిష్ట 1,2): ఆదాయపరంగా సమయం చాలావరకు అనుకూలంగా ఉంది. ఆదాయ మార్గాలు విస్తరిస్తాయి. ఆదనపు ఆదాయానికి బాగా అవకాశముంది. ముఖ్యమైన ప్రయత్నాలు సఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారాల్లో కొత్త ఆలోచనలను, కొద్దిపాటి మార్పులను చేపట్టి ఆర్థిక లాభాలు పొందుతారు. ఉద్యోగంలో మీ సలహాలు, సూచనలు, ఆలోచనలు, వ్యూహాలకు ప్రాధాన్యం ఏర్పడుతుంది. అధికారుల నుంచి ఆశించిన ప్రోత్సాహకాలు లభిస్తాయి. ప్రముఖులతో కలిసి సామాజిక సేవా కార్య క్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి పెరుగుతుంది. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో కూడా విజయాలు సాధిస్తారు. ఉన్నత స్థాయి కుటుంబంతో పెళ్లి సంబంధం కుదురుతుంది. ఆస్తి వివాదం పరిష్కార దిశగా సాగుతుంది.

10 / 12
కుంభం (ధనిష్ట 3,4, శతభిషం, పూర్వాభాద్ర 1,2,3): ఆదాయానికి ఏమాత్రం లోటుండదు. కొద్దిపాటి జాగ్రత్తలతో ఆర్థిక సమస్యలను చాలావరకు పరిష్కరించుకుంటారు. ఒకటి రెండు వ్యక్తిగత సమస్యల నుంచి కూడా బయటపడతారు. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం బాగా ఎక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారాలు లాభాలపరంగా పురోగతి చెందుతాయి. అదనపు ఆదాయ ప్రయత్నాల వల్ల బాగా లాభం కలుగుతుంది. ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టే సూచనలున్నాయి. కుటుంబ జీవితం ఉత్సాహంగా సాగిపోతుంది. సొంత పనుల మీద శ్రద్ధ పెట్టడం అవసరం. ఎంత జాగ్రత్తగా ఉన్నా అదనపు ఖర్చులు, అనుకోని ఖర్చులు తప్పకపోవచ్చు. తల్లితండ్రుల ద్వారా ఆర్థికంగా లబ్ధి పొందే అవకాశం ఉంది. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. నిరుద్యోగులకు దూర ప్రాంతంలో ఉద్యోగం లభిస్తుంది.

11 / 12
మీనం (పూర్వాభాద్ర 4, ఉత్తరాభాద్ర, రేవతి): ఏ ప్రయత్నం తలపెట్టినా విజయవంతం అవుతుంది. అనుకున్న పనులన్నీ అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆర్థిక లావాదేవీలు, ఉచిత సహాయాలకు దూరంగా ఉండడం మంచిది. ఆదాయ వృద్ధి ప్రయత్నాలు పూర్తి స్థాయిలో సత్ఫలితాలనిస్తాయి. ఇంటా బయటా కాస్తంత ఒత్తిడి ఉండ వచ్చు. కుటుంబ వ్యవహారాలపైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. స్వల్ప అనారోగ్య సూచనలున్నాయి. ఉద్యోగం మారడానికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఆశించిన శుభవార్త అందుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది. అయితే, ఆశించిన ప్రతిఫలం లభిస్తుంది. వ్యాపారాల్లో రాబడికి ఇబ్బంది ఉండదు. ఆర్థిక వ్యవహారాల్లో కొందరు మిత్రుల వల్ల నష్టపోయే సూచనలు న్నాయి. విద్యార్థులు బాగా శ్రమపడాల్సి ఉంటుంది. పెళ్లి ప్రయత్నాలు తప్పకుండా ఫలిస్తాయి.

12 / 12
Follow us
మీర్‌పేట హత్య కేసులో కీలక మలుపు.. గురుమూర్తి పాపం పండినట్లే!

60 ఏళ్ల వయసులో టాలీవుడ్ నటుడి రెండో పెళ్లి..

సోమేశ్‌ ఆత్మహత్యలో వెలుగులోకి షాకింగ్‌ విషయాలు..

మోహన్ లాల్ ఎంపురాన్ మూవీలో మరో స్టార్ హీరో..ఎవరో గుర్తు పట్టారా?

ఒక్క వికెట్‌ తీయకుండానే పంజాబ్‌ను గెలిపించాడు!

ఈమె మహేష్ బాబు హీరోయినా..!!.. గుర్తుపట్టలేనంతగా మారిపోయిందిగా..

గరుడపురాణం ప్రకారం ఇలాంటి వ్యక్తి జీవితంలో కష్టాలు ఎప్పటికీ అంతకా

పునరుత్పాదక ఇంధన రంగంలో భారీగా నియామకాలు.. వీరికి ఫుల్ డిమాండ్!

ఈ బుజ్జితల్లి ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో భార్య..గుర్తు పట్టారా?

IPLలో ఆ రూల్‌ అవసరం లేదు.. ధోని షాకింగ్‌ కామెంట్స్‌!