శుక్ర బుధ సంయోగం.. ఈ 6 రాశుల వారు డబ్బు విషయంలో జాగ్రత్తగా ఉండాలి..
మీనరాశిలో శుక్రుడు, బుధుడు సంచరించడం వల్ల మేషం, సింహం, కన్య, తుల, ధనుస్సు , మీన రాశులపై ప్రభావం చూపుతుంది. సింహరాశి వారు ఊహించని లాభాలను పొందుతారు. కన్యరాశి వారు ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలని, తులారాశి వారు ఆర్థిక సమస్యలను పరిష్కరించుకోవాలని, ధనుస్సు రాశి వారు సరళమైన జీవితాన్ని ఇష్టపడాలని, మీన రాశి వారు తమ జీవనశైలిని మార్చుకోవాలని జ్యోతిష్యులు సూచించారు. అయితే కొన్ని రాశుల వారు ఆర్థిక విషయాల్లో జాగ్రత్త చాలా అవసరం.

ఉచ్ఛ స్థితిలో ఉన్న శుక్రుడు, బలహీన స్థితిలో ఉన్న బుధుడు ఒకేసారి మీన రాశిలో సంచరిస్తున్నారు. ఉచ్ఛస్థితిలో ఉన్న గ్రహం.. బలహీనమైన గ్రహం ఒకే రాశిలో సంచరించడం చాలా అరుదు. ఈ పరిస్థితి ఏప్రిల్ 7 వరకు కొనసాగుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహాల కలయిక కొన్ని రాశులకు ముఖ్యంగా మేషం, సింహ, కన్య, తుల, ధనుస్సు, మీన రాశుల వారిని ఎలా ప్రభావితం చేస్తుందో ఈ రోజు తెలుసుకుందాం..
సింహ రాశి: ఈ రాశి వారికి శుక్రుడు, బుధుడు సంచారము వలన ఆకస్మిక ధనము కలిగే అవకాశం ఉంది. స్టాక్స్, పెట్టుబడులు ఊహించని ఆర్థిక లాభాలను తెస్తాయి. వచ్చే డబ్బులను పెట్టుబడి రూపంలో దాచుకునే అవకాశం ఉంది. అప్పులు తీరుస్తారు. బకాయిలను వసూలు చేసుకుంటారు. అయితే ఖర్చుల విషయాలలో పొదుపు పాటించండి. ఖర్చులను తగ్గించడంపై దృష్టి పెట్టాలి. ఖచ్చితంగా అవసరమైతే తప్ప డబ్బు తీసుకోకూడదు. ఖర్చు చేయడం గురించి వీరు ఆలోచించే విధానంలో పూర్తి మార్పు చేసుకోవాలి.
కన్య రాశి: ఈ రాశికి అధిపతి బుధుడు ఏడవ ఇంట్లో ఉన్నాడు. శుక్రుడితో కలిసి ఉన్నాడు. వీరు ఆర్థిక విషయాలలో దూరదృష్టిని పెంచుకోవాలి. కనుక ఈ రాశికి చెందిన వ్యక్తులు వృత్తి, వ్యాపారాలలో జాగ్రత్తగా ఉండాలి. డబ్బు పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త అవసరం. అనవసరంగా ఖర్చు చేయకండి. ప్రతిదీ ప్రణాళికాబద్ధంగా నిర్వహించాలి. ఇతరులపై ఖర్చు చేయడం, ఇతరులకు సహాయం చేయడం అనేది మీ దగ్గర ఉన్న డబ్బులను ఖర్చుల ఆధారంగా నిర్ణయించుకోవాలి.
తుల రాశి: ఆరవ ఇంట్లో తులారాశి వారు బుధునితో కలిసి శుక్రుని కోణంలో ఉన్నారు. ఇది ఆర్థిక, వ్యక్తిగత సమస్యలను పరిష్కరించడంలో పూర్తి శ్రద్ధ చూపుతుంది. ఆదాయం పెరిగేకొద్దీ ఖర్చులు తగ్గుతాయి. ఉచితంగా ఇవ్వడం, వృధా ఖర్చులు, విలాస వస్తువులు, ప్రయాణాలు తగ్గుతాయి. ఎవరికీ ఆర్థిక సాయం చేస్తానని వాగ్దానాలు చేయవద్దు. ఆదాయాన్ని రెట్టింపు చేసుకోవడంపై వీరు ఎక్కువ దృష్టి పెట్టాలి.
ధనుస్సు రాశి: ఈ రాశి నాల్గవ ఇంట్లో శుక్రుడు, బుధుడు సంచారం కారణంగా అనవసరమైన ఖర్చులు, విలాసాలు, వ్యసనాలను పూర్తిగా వదిలివేసి, సాధారణ జీవితానికి అలవాటు పడే అవకాశం ఉంది. వీరు రాజీ ద్వారా ఆస్తి సంబంధిత వివాదాలను పరిష్కరించడానికి ప్రయత్నిస్తారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండటానికి ప్రయత్నించండి. స్టాక్స్, పెట్టుబడులపై ఎక్కువ డబ్బు ఖర్చు చేసే అవకాశం ఉంది.
మీన రాశి: ఈ రాశిలో బుధుడు, శుక్రుడు ప్రతికూల కోణాల్లో ఉన్నందున.. వీరి జీవనశైలి పూర్తిగా మారే అవకాశం ఉంది. ఆదాయం అనేక విధాలుగా అంచనాలకు మించి పెరిగే అవకాశం ఉన్నప్పటికీ, ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఖర్చులు పెట్టే సమయంలో ఒకటికి రెండుసార్లు ఆలోచించండి. ప్రతి పనిని ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేయాలి. ముఖ్యంగా కుటుంబలో చేసే ఖర్చులు, వినోద ఖర్చులను గణనీయంగా తగ్గించి పెట్టుబడులు పెట్టె విషయంలో దృష్టిని పెంచండి.
మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు