ఇది గుండెకు సూపర్ ఫుడ్.. కానీ, అతిగా తిన్నారో అంతే డేంజర్..! ఈ సైడ్ ఎఫెక్ట్స్‌తో జాగ్రత్త..
వాల్‌నట్స్ మన ఆరోగ్యానికి మంచివే అయినా వీటిని ఎక్కువగా తింటే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వాల్‌నట్స్‌లో ఫైబర్, విటమిన్ ఇ, ఫోలేట్, మెగ్నీషియం, భాస్వరం వంటి ముఖ్యమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. వాల్‌నట్స్ తినడం గుండె ఆరోగ్యానికి ఔషధం లాంటిది. వాల్‌నట్స్ మన ఆరోగ్యానికి మంచివే అయినా వీటిని ఎక్కువగా తింటే మాత్రం కొన్ని అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
Updated on: Mar 23, 2025 | 3:47 PM

ఎక్కువ సంఖ్యలో వాల్‌నట్స్ తినడం ద్వారా జీర్ణ సమస్యలు ఉత్పన్నమవుతాయి. ఇవి తొందరగా జీర్ణం కావు. దీంతో కడుపు ఉబ్బరం, గ్యాస్, అతిసారం వంటి సమస్యలు ఏర్పడతాయి. వాల్‌నట్స్ కొందరికి పడవు. వీటిని తినడం వల్ల వాపు, మంట, దురద వంటి ఎలర్జీ రియాక్షన్స్ వస్తాయి. ఇలాంటి వారు వాల్‌నట్స్‌కు దూరంగా ఉండటం మేలు అంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వాల్‌నట్స్‌లో విటమిన్ కె అధికంగా ఉంటుంది. అందుకే రక్తం పల్చగా మారేందుకు మెడిసిన్ ఉపయోగించేవారు ఈ వాల్‌నట్స్ తినడం మంచిది కాదు. వాల్‌నట్స్‌లో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యకరమైనవే. కానీ అతిగా తినడం వల్ల కొలెస్ట్రాల్ పెరిగిపోయే ప్రమాదం ఉంది.

బరువు తగ్గాలనుకునే వారు వాల్‌నట్స్ తినకపోవడమే మేలు. వీటిలో కేలరీలు అధికంగా ఉంటాయి. ఇవి అతిగా తింటే బరువు పెరుగుతారు. అధికంగా వాల్‌నట్స్ తినడం వల్ల ఆక్సలేట్ లెవెల్స్ పెరుగుతాయి. దీంతో కిడ్నీలో రాళ్ల సమస్య ఉత్పన్నమవుతుంది. అందుకే వీటిని అతిగా తినకూడదు.

వాల్ నట్స్ ను ఎక్కువగా తింటే కొంతమందికి కాళ్ల వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వంటి సమస్యలు వస్తాయి. వాల్‌నట్స్‌లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. కానీ అతిగా తినడం వల్ల మలబద్ధకం పెరిగే అవకాశం కూడా ఉంది.

వాల్‌నట్స్ అతిగా తినడం వల్ల ఛాతిలో మంట, యాసిడ్ రిఫ్లెక్స్ వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి. తొందరగా జీర్ణం కాకపోవడం వల్ల ఇలా జరుగుతుంది. పోషకాల కోసం వాల్‌నట్స్ మీద అతిగా ఆధారపడటం మంచిది కాదు. దీనివల్ల మిగతా పోషకాల లోపం ఏర్పడుతుంది. వీటిని మితంగా తీసుకుంటూ మిగతా పోషకాహారం తీసుకోవాలి.





























