Salaar Movie: ప్రభాస్ ఫ్యాన్స్‏కు మరో షాక్.. ఆ సినిమా కూడా వాయిదా ?..

మరోసారి డార్లింగ్ అభిమానులకు షాక్ తగిలేలా ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్‏ను మరో వార్త కలవరపెడుతుంది. ఆదిపురుష్ బాటలోనే

Salaar Movie: ప్రభాస్ ఫ్యాన్స్‏కు మరో షాక్.. ఆ సినిమా కూడా వాయిదా ?..
Prabhas
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 08, 2022 | 1:26 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తిచేసుకుని విడుదలకు సిద్ధంగా ఉన్న ఆదిపురుష్ వాయిదా పడిన సంగతి తెలిసిందే. వీఎఫ్ఎక్స్ వర్క్ కారణంగా ఈ చిత్రాన్ని జూన్ 16న విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. దీంతో డార్లింగ్ సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చారు. ఇక ఇప్పుడు మరోసారి డార్లింగ్ అభిమానులకు షాక్ తగిలేలా ఉంది. ఇప్పుడు ఫ్యాన్స్‏ను మరో వార్త కలవరపెడుతుంది. ఆదిపురుష్ బాటలోనే సలార్ కూడా వాయిదా పడనున్నట్లు ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ దాదాపు వాయిదా పడినట్లే అనే వార్తలు వినిపిస్తున్నాయి.

కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్ చిత్రాన్ని వచ్చే ఏడాది సెప్టెంబర్‏లో విడుదల చేస్తామని చిత్రయూనిట్ గతంలో ప్రకటించింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన వర్కింగ్ స్టిల్స్ మూవీపై మరింత అంచనాలను పెంచేసాయి. కేజీఎఫ్ వంటి సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్.. ప్రభాస్ కాంబోలో రాబోతున్న ప్రాజెక్ట్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

ఇవి కూడా చదవండి

అయితే ఆదిపురుష్ సినిమా రిలీజ్ డేట్ మారడంతో ఆ సినిమా ప్రభావం సలార్ పై పడనుందని.. అందుకే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశాలు ఉన్నాయని టాక్. ఇక ప్రస్తుతం ప్రభాస్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
ప్రియుడే కావాలన్న భార్య.. వారించినా వినకపోవడంతో భర్త ఏం చేశాడంటే
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
పుష్ప పాటకు అజిత్ డ్యాన్స్‌.. కానీ ఇక్కడే అసలు ట్విస్ట్
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
కాలు విరిగి మంచాన పడ్డా.. క్రియేటివీ తగ్గలే
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గోవా నుంచి వచ్చిన రైల్లో పోలీసుల తనిఖీలు.. ఓ భోగీలో
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!