Vijay Deverakonda: బ్రహ్మాస్త్ర 2లో ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

అంతే కాదు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలకు బాయ్ కాట్ సెగ కూడా తగిలింది. దాంతో  అక్కడ సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. అయితే ఆ టైంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

Vijay Deverakonda: బ్రహ్మాస్త్ర 2లో ఆ పాత్ర కోసం విజయ్ దేవరకొండ.. క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
Vijay Devarakonda
Follow us

|

Updated on: Nov 08, 2022 | 3:23 PM

ఈ మధ్య బాలీవుడ్ లో సినిమాలు వరుసగా ఫ్లాపుల బాట పట్టిన సమయంలో ఆదుకున్న ఒకేఒక్క సినిమా బ్రహ్మాస్త్ర. ఇటీవల కాలంలో బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. అంతే కాదు చిన్న పెద్ద అని తేడా లేకుండా అన్ని సినిమాలకు బాయ్ కాట్ సెగ కూడా తగిలింది. దాంతో  అక్కడ సినిమాలన్నీ ఫ్లాప్ గా నిలిచాయి. అయితే ఆ టైంలో వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆయన ముఖర్జీ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ హీరో హీరోయిన్లు గా నటించారు. ఫిక్షనల్ స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అక్కినేని నాగార్జున, కింగ్ ఖాన్ షారుక్ ఖాన్,  అమితాబ్ బచ్చన్ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఈ సినిమాను మూడు భాగాలుగా తెరకెక్కిస్తామని ముందుగానే దర్శక నిర్మాతలు తెలిపారు.

మొదటి పార్ట్ మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు సెకండ్ పార్ట్ పై ఆసక్తి పెరిగింది. అయితే ఈ సినిమాలో ఇంకొంతమంది స్టార్ కూడా నటిస్తున్నారని వార్తలు వినిపిస్తున్నాయి.ఇప్పటికే పార్ట్ 2లో స్టార్ హీరోయిన్ దీపికా పడుకొనే ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అలాగే టాలీవుడ్ క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కూడా బ్రహ్మాస్త్ర 2లో నటిస్తున్నారని అంటున్నారు. తాజాగా ఈ వార్తల పై దర్శకుడు అయాన్ ముఖర్జీ స్పందించారు.

బ్రహ్మాస్త్ర సినిమాలో దేవ్ అనే పాత్ర ఉంటుందని తెలిపారు. అయితే కరణ్ జోహార్.. దేవ్ పాత్రను విజయ్ దేవరకొండకు ఆఫర్ చేసినట్లు అక్కడ టాక్ వినిపించింది. అయితే ఈ విషయం పై అయాన్ స్పందిస్తూ..దేవ్ పాత్రకి వస్తోన్న బజ్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందని అన్నారు. జనాలు ఈ పాత్రను బాగా ఓన్ చేసుకున్నారని అన్నారు. మొన్నటివరకు హృతిక్, రణవీర్, యష్ అని మీడియాలో వార్తలొచ్చాయని.. తర్వాత ప్రభాస్ పేరు వినిపించినా ఆశ్చర్యపోనక్కర్లేదని నవ్వుతూ అన్నారు. అయితే.. త్వరలోనే యాక్టర్ ని ఫైనల్ చేస్తామని, ఇప్పటివరకు అయితే ఎవరినీ సంప్రదించలేదని అన్నారు. దాంతో బ్రహ్మాస్త్ర సినిమాలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడన్న వార్తల్లో నిజం లేదు అని తేలిపోయింది.

ఇవి కూడా చదవండి