Rashmika Mandanna: రష్మిక కొత్త సినిమా.. డిఫరెంట్ పాత్రలో నేషనల్ క్రష్.. టీజర్ అదిరిపోయింది..
ప్రస్తుతం పాన్ ఇండియా మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ రష్మిక మందన్నా. హిందీ, తెలుగు భాషలలో వరుసగా హిట్స్ అందుకుంటూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఛావా, యానిమల్ సినిమాలతో హిందీలో సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరో సినిమాతో నార్త్ ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమయ్యింది.

రష్మిక మందన్నా.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో ఈ ముద్దుగుమ్మకు ఉన్న క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. ఛావా, యానిమల్ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో సత్తా చాటిన ఈ అమ్మడు.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు రెడీ అయ్యింది. ప్రస్తుతం వరుస హిట్లతో సత్తా చాటుతున్న రష్మిక.. థామా అనే సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీలో అలరించనుంది. స్త్రీ యూనివర్స్ లో భాగంగా వస్తున్న నాలుగో మూవీ ఇది. ఇంతకు ముందు వచ్చిన భేడియా, స్త్రీ, ముంజ్య చిత్రాలు ఆకట్టుకున్నాయి. ఇప్పుడు థామా పేరుతో మరో సినిమాను తీసుకురాబోతున్నారు. ఇందులో రష్మిక మందన్నా, ఆయుష్మాన్ ఖురానా జంటగా నటించగా.. మడాక్ ఫిలింస్ నిర్మిస్తుంది. హారర్ డ్రామాగా వస్తున్న ఈసినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకున్నాయి.
ఇవి కూడా చదవండి: Dulquer Salman: ఆ హీరోయిన్ అంటే పిచ్చి ఇష్టం.. ఎప్పటికైనా ఆమెతో నటించాలనే కోరిక.. దుల్కర్ సల్మాన్..
తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్. అందులో రష్మిక ఇదివరకు ఎన్నడు చూడని పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. బోల్డ్ గా కనిపిస్తూనే భయపెట్టింది. ఇందులో రష్మిక దెయ్యంగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. హారర్ స్టోరీతోపాటు మనసులను గెలుచుకునే ప్రేమకథ సైతం ఉండనున్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది దీపావళికి ఈసినిమాను రిలీజ్ చేయనున్నారు.
ఇవి కూడా చదవండి: Actor: అన్నపూర్ణ స్టూడియో 50 ఏళ్ళు.. శంకుస్థాపన చేస్తోన్న చిన్నోడు ఎవరో తెలుసా..?
ఈ సినిమాలో టాలెంటెడ్ యాక్టర్ నవాజుద్దీన్ సిద్దిఖీ కీలకపాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో అతడు విలన్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ప్రస్తుతం విడుదలైన టీజర్ ఆకట్టుకుంటుంది.
ఇవి కూడా చదవండి: Actress : ఈ క్రేజ్ ఏంట్రా బాబూ.. 40 ఏళ్లు దాటిన తగ్గని జోరు.. 50 సెకండ్స్ కోసం 5 కోట్లు రెమ్యునరేషన్..
ఇవి కూడా చదవండి: అరాచకం భయ్యా.. వయ్యారాలతో గత్తరలేపుతున్న సీరియల్ బ్యూటీ..








