AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coolie OTT : థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి..! కూలీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పటినుంచేనా.? హిందీ వర్షన్ మాత్రం లేట్

అనుకున్నట్లే రజనీ సినిమా రికార్డులు బద్దలు కొడుతోంది. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా గురువారం (ఆగస్టు 14) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా అప్పుడే రికార్డుల వేట షురూ చేసింది. రిలీజైన రోజు ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కలెక్షన్స్‌ రాబట్టిన తమిళ్‌ సినిమాగా నిలిచింది. తొలి రోజే ఈ సినిమా రూ. 151కోట్లు రాబట్టింది.

Coolie OTT : థియేటర్స్‌లో ఉండగానే ఓటీటీలోకి..! కూలీ స్ట్రీమింగ్ అయ్యేది అప్పటినుంచేనా.? హిందీ వర్షన్ మాత్రం లేట్
Coolie
Rajeev Rayala
|

Updated on: Aug 18, 2025 | 4:06 PM

Share

సూపర్ స్టార్ రజినీకాంత్ నటించిన లేటెస్ట్ మూవీ కూలీ. ఈ సినిమాకు లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. కూలీ సినిమాలో సూపర్ స్టార్ తో పాటు అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, సత్య రాజ్, అమీర్ ఖాన్, సౌబిన్ ఇలా చాలా మంది నటించారు. ఆగస్టు 14న కూలీ సినిమా విడుదలైంది. విడుదలకు ముందు ఈ సినిమా భారీ అంచనాలను క్రియేట్ చేసింది. ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్స్ దగ్గర నుంచి టీజర్, ట్రైలర్ సినిమా పై అంచనాలు భారీగా  పెంచేసింది. కానీ సినిమా విడుదలైన తర్వాత మాత్రం కూలీ సినిమాకు మిక్స్డ్ టాక్ వచ్చింది. సినిమాలో సూపర్ స్టార్ అదరగొట్టినా కూడా కూలీ సినిమా ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది.

Bigg Boss 9: అబ్బో.. పెద్ద ప్లానే..! బిగ్ బాస్ హౌస్‌లోకి ట్రెండింగ్ జంట.. ఇక రచ్చ రచ్చే

ఇక కూలీ సినిమా ఇప్పటికే భారీగా వసూళ్లు రాబట్టింది. ఇప్పటికే ఈ సినిమా రూ. 200కోట్లవరకు వసూళ్లు రాబట్టింది. ఇక కూలీ సినిమా రిలీజ్ రోజే ఎన్టీఆర్, హృతిక్ రోషన్ నటించిన వార్ 2 సినిమా విడుదలైంది. దాంతో రెండు సినిమాల మధ్య క్లాష్ వచ్చింది కానీ ఆ సినిమా కూడా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఇదిలా ఉంటే కూలీ సినిమా ఓటీటీ డీల్ ఫిక్స్ అయ్యిందని తెలుస్తుంది. త్వరలోనే కూలీ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయనున్నారని తెలుస్తుంది.

ఇవి కూడా చదవండి

అప్పుడు నెలకు రూ.500.. ఇప్పుడు రూ. 83కోట్లకు మహారాణి.. 44 ఏళ్ల వయసులోనూ అదే హాట్‌నెస్

ఇక కూలీ సినిమా ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుందని తెలుస్తుంది. అలాగే కూలీ సినిమాను సెప్టెంబర్ 27న నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేయనున్నారని అంటున్నారు. అయితే హిందీ వర్షన్ మాత్రం రిలీజ్ కు లేట్ అవుతుందని తెలుస్తుంది.సినిమా ఓటీటీలో విడుదలైన వారం రోజుల తర్వాత కూలీ హిందీ వర్షన్ ను విడుదల చేయనున్నారట. త్వరలోనే దీని పై క్లారిటీ రానుందని తెలుస్తుంది. ఓటీటీ రిలీజ్ కోసం చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఇక కూలీ సినిమా కలెక్షన్స్ పరంగా కుమ్మేస్తుంది. తొలి రోజే దాదాపు రూ. 151 కోట్ల గ్రాస్ రాబట్టి కోలీవుడ్ ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది.

చేసిన ఒకేఒక్క సినిమా రిలీజ్ కూడా కాలేదు.. కానీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా క్రేజీ బ్యూటీ

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.