Pushpa 2: ఇది పుష్పగాడి క్రేజ్ అంటే.. 12 వేల స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప 2. పాన్ ఇండియా లెవల్లో భారీ స్థాయిలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై ఇప్పటికే ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. డైరెక్టర్ సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో రూపొందిస్తున్న ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. మరికొన్ని రోజుల్లో విడుదల కానుంది.

Pushpa 2: ఇది పుష్పగాడి క్రేజ్ అంటే.. 12 వేల స్క్రీన్లలో పుష్ప 2 రిలీజ్.. ఇక థియేటర్లు దద్దరిల్లాల్సిందే..
పుష్ప ది రూల్‌ గురించి ప్రొడ్యూసర్‌ చెప్పిన మాటలు ఇవి.. మరి సెన్సార్‌ కోసం స్క్రీన్‌ మీద చూసిన వారు కూడా ఇలాగే ఫీలయ్యారా.?
Follow us
Rajitha Chanti

|

Updated on: Nov 29, 2024 | 7:13 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ వచ్చే వారం విడుదల కానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ప్రస్తుతం ఇండియాలో భారీ అంచనాలున్న సినిమా ఇదే. కానీ ఇప్పటికే విడుదలకు ముందే ఎన్నో రికార్డులను బద్దలు కొట్టింది. రిలీజ్ తర్వాత బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. గతంలో ఏ భారీ బడ్జెట్ సినిమా చేయని విధంగా ‘పుష్ప 2’ని గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు చిత్ర బృందం సన్నాహాలు చేస్తోంది. ఈరోజు ముంబైలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చిత్రయూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా చిత్ర నిర్మాత మాట్లాడుతూ.. “పుష్ప 2 చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా 12 వేల స్క్రీన్లలో ఏకకాలంలో విడుదల చేయబోతున్నారు. ఇంత భారీ స్క్రీన్లలో విడుదలైన భారతీయ సినిమా మరొకటి లేదు. ఇప్పటివరకు ఏ సినిమాకు కూడా ఇంత పెద్ద స్క్రీన్స్ రాలేదు. ఈ సినిమా డిసెంబర్ 05న భారతదేశంలోనే దాదాపు 8000 స్క్రీన్లలో విడుదల కానుంది. విదేశాల్లో నాలుగు వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయనున్నాము. ఐమ్యాక్స్‌లో ఏ సినిమాకు లేనన్ని స్క్రీన్‌లు ‘పుష్ప 2’ చిత్రానికి వచ్చాయి” అని అన్నారు.

అలాగే ఈ సినిమా నార్త్ లో భారీ స్క్రీన్లలో విడుదల కానుంది. అనిల్ తండానీ నార్త్ ఇండియాలో పుష్ప 2ని పంపిణీ చేస్తున్నారు. ఇదివరకు పుష్ప ది రైజ్ సినిమాను సైతం అతడే రిలీజ్ చేశాడు. సౌత్ ఇండియన్ సినిమాలకు ఉత్తరాది మార్కెట్ పరిచయం చేసిన డిస్ట్రిబ్యూటర్. ఈ చిత్రంలో అల్లు అర్జున్, రష్మిక, డాలీ ధనంజయ్, తారక్ పొన్నప్ప, ఫహద్ ఫాజిల్ కీలకపాత్రలు పోషించారు. అలాగే ఇందులో శ్రీలీల స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇది చదవండి : Tollywood: ఒక్క సినిమాకు రూ.40 కోట్లు రెమ్యునరేషన్.. ప్రైవేట్ జెట్, ఇండియా, అమెరికాలో కోట్ల ఆస్తులు ఉన్న ఏకైక హీరోయిన్..

Vijay Sethupathi: విజయ్ సేతుపతి ఇన్ స్టాలో ఫాలో అవుతున్న ఏకైక హీరోయిన్.. ఎవరో తెలుసా..?

Tollywood : గ్యాంగ్‌స్టర్‌తో ప్రేమలో పడి కెరీర్ నాశనం చేసుకున్న హీరోయిన్.. ఇండస్ట్రీకి దూరం..

Actress Gajala: వాసి వాడి తస్సాదియ్యా.. అందాలతో హార్ట్ ఎటాక్ తెప్పిస్తోన్న ఎన్టీఆర్ హీరోయిన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వామ్మో.. రూ.కోట్లు సంపాదించి పెడుతున్న రావిచెట్టు.!వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
వింత ఆచారం.. ఇంటింటా సేకరించిన అన్నాన్ని రాశిగా పోసి.. వీడియో.
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
ఆసుపత్రిలో మనోజ్! మంచు కుటుంబంలో తుఫాన్.మోహన్‌బాబు తనను కొట్టారని
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
కాంగ్రెస్ ఏడాది పాలనపై కిషన్ రెడ్డి ఏమన్నారంటే..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
హీరోయిన్ తో టాలీవుడ్ డైరెక్టర్ పెళ్లి.! తిరుమల సన్నిదిలో వివాహం..
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
భారతీయ సినిమా చరిత్రలో పుష్ప 2 ఓ విస్పోటనం.! రుహానీశర్మ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
నన్ను అర్థం చేసుకోవడం కష్టం.. వారికైతే మరీ కష్టం! ధనుష్ కామెంట్స్
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
కలుస్తూ.. విడిపోతూ.. సీరియల్‌లా సాగుతోంది వీరి జీవితం.! వీడియో..
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
అల్లు అర్జున్ పై ఆర్జీవీ ట్వీట్.. కాంట్రవర్సీ లేకపోతే ఆర్జీవీ ఎలా
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..
బన్నీ పై ప్రకాశ్ రాజ్‌ ట్వీట్.. గంగోత్రి నుండి చూస్తున్నా అంటూ..