Priyanka Chopra: ఒబామాతో విందు టు పద్మశ్రీ.. వైరల్ ట్రెండ్‌తో పాత జ్ఞాపకాలను షేర్ చేసిన ప్రియాంక చోప్రా!
ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక కొత్త ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది. ఫిల్టర్లు, పర్‌ఫెక్ట్ ఫీడ్లు లేని పదేళ్ల క్రితం నాటి పాత జ్ఞాపకాలను నెమరువేసుకోవాలని నెటిజన్లు ఉత్సాహం చూపిస్తున్నారు. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు అందరూ తమ పాత ఫోటోలను షేర్ చేస్తున్నారు.

ఈ ట్రెండ్‌లో తనే విన్నర్ అనిపించుకుంటోంది ఒక గ్లోబల్ ఐకాన్. బాలీవుడ్ నుండి హాలీవుడ్ వరకు తన జెండా పాతిన ఆ ‘దేశీ గర్ల్’, తన జీవితాన్నే మార్చేసిన 2016 నాటి అరుదైన ఫోటోలను బయటపెట్టింది. అప్పటి వరకు ఇండియన్ స్టార్‌గా ఉన్న ఆమె, ప్రపంచ స్థాయి సెలబ్రిటీగా ఎలా ఎదిగిందో ఆ ఫోటోలు చూస్తే అర్థమవుతుంది. అమెరికా అధ్యక్షుడితో విందు మొదలుకొని ఆస్కార్ రెడ్ కార్పెట్ వరకు.. ఆమె ప్రయాణంలోని ఆ అద్భుత క్షణాలు ఏంటో తెలుసుకుందాం.
మలుపు తిప్పిన ఏడాది 2016..
ప్రియాంక చోప్రా తన అధికారిక ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో “ప్రతిదీ ఒక్కసారిగా జరిగిపోయిన ఏడాది.. 2016” అంటూ కొన్ని అరుదైన ఫోటోలను పంచుకుంది. ఒక నటిగా ఆమె అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందడానికి ఆ సంవత్సరమే పునాది వేసింది. ప్రియాంక మొదటిసారి ఆస్కార్ వేదికపై మెరిసింది ఆ ఏడాదే. ప్రపంచ సినిమా వేదికపై ఒక భారతీయురాలి గళం బలంగా వినిపించిన క్షణం అది. అప్పటి అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా, మిచెల్ ఒబామా ఏర్పాటు చేసిన విందులో ప్రియాంక పాల్గొనడం అప్పట్లో ఒక సెన్సేషన్. భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు అందుకోవడం ఆమె కెరీర్‌లో మరొక మైలురాయి.

Obama N Padmasri
వ్యక్తిగత జ్ఞాపకాలు..
ప్రియాంక తన ఫోటోల ద్వారా అటు హాలీవుడ్ ప్రాజెక్టులైన ‘క్వాంటికో’, ‘బేవాచ్’ జ్ఞాపకాలతో పాటు, బాలీవుడ్ హిట్లు ‘దిల్ ధడక్నే దో’, ‘బాజీరావ్ మస్తానీ’ ఫోటోలను కూడా పంచుకుంది. కేవలం విజయాలే కాదు, ఎమోషనల్ క్షణాలను కూడా అభిమానులతో పంచుకుంది. 2016లోనే ఆమె తన ప్రియమైన అమ్మమ్మను కోల్పోయింది. ఆ బాధాకరమైన క్షణాలతో పాటు, తన పెంపుడు కుక్కను దత్తత తీసుకున్న ఫోటోలను కూడా షేర్ చేసింది. జిమ్మీ ఫాలన్ షోలో పాల్గొన్న అరుదైన స్టిల్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
రాజమౌళి సినిమాతో రీ-ఎంట్రీ..
ప్రస్తుతం ప్రియాంక హాలీవుడ్‌లో ‘ది బ్లఫ్’ అనే పైరేట్ అడ్వెంచర్ సినిమాలో నటిస్తోంది. ఇది ఫిబ్రవరి 25న ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది. అయితే ఇండియన్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న వార్త ఏమిటంటే.. ఆమె మళ్లీ భారతీయ సినిమాల్లోకి రాబోతోంది. దర్శక ధీరుడు ఎస్‌ఎస్ రాజమౌళి ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ‘వారణాసి’ లో ప్రియాంక నటించనుంది. మహేష్ బాబు హీరోగా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో తెరకెక్కనున్న ఈ సినిమాతో ఆమె మళ్లీ తన సొంత గడ్డపై మెరవబోతోంది. ఒక సాధారణ నటి నుండి గ్లోబల్ ఐకాన్‌గా ప్రియాంక ఎదిగిన తీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. 2016 నాటి తన జ్ఞాపకాల ద్వారా ఆమె తన కష్టాన్ని, సక్సెస్‌ను మరోసారి ప్రపంచానికి చూపించింది.
