AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ.. జెన్ జెడ్ తప్పకుండా చూడాల్సిన మూవీ

ఇందులో హీరో, హీరోయిన్లు అనుకోని పరిస్థితుల్లో కలుసుకుంటారు. సరదాగా మొదలైన వీరి పరిచయం కాస్తా ప్రేమగా మారుతుంది. అయితే వీరి లవ్ స్టోరీలో ఊహించని మలుపులు చోటు చేసుకుంటాయి. మరి చివరకు ఈ ప్రేమకథ సుఖాంతమైందా? లేదా? అన్నది తెలుసుకోవాలంటే ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ చూడాల్సిందే.

OTT Movie: ఇవాళే ఓటీటీలోకి వచ్చిన యూత్ ఫుల్ లవ్ స్టోరీ.. జెన్ జెడ్ తప్పకుండా చూడాల్సిన మూవీ
Sandhya Nama Upasate Movie
Basha Shek
|

Updated on: Jan 22, 2026 | 8:38 PM

Share

సాధారణంగా థియేటర్లలో రిలీజైన సినిమాలు నెల రోజుల గ్యాప్ లో ఓటీటీలోకి వచ్చేస్తుంటాయి. నెల రోజులు కాకపోయినా 45 రోజులు, రెండు నెలలు.. ఇలా సినిమా నిర్మాతలు, ఓటీటీ సంస్థల మధ్య కుదుర్చుకున్న ముందస్తు అగ్రిమెంట్ ప్రకారం సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్ కు వస్తుంటాయి. అయితే వివిధ కారణాల వల్ల కొన్ని సినిమాలు థియేటర్లలో రిలీజవ్వవు. షూటింగ్ లు ఆలస్యమవ్వడం, బడ్జెట్ లేకపోవడం, బయ్యర్లు ఇంట్రెస్ట్ చూపించకపోవడం.. ఇలా చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కాకుండానే ఆగిపోతున్నాయి. ఇలాంటి సినిమాలకు ఓటీటీ బెస్ట్ ఆప్షన్స్ గా కనిపిస్తున్నాయి. అలా గురువారం (జనవరి 22) ఒక యూత్ ఫుల్ లవ్ స్టోరీ నేరుగా ఓటీటీలోకి వచ్చేసింది. సుమారు ఆరేళ్ల క్రితం కరోనా ఎలాంటి విపత్తను సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ వైరస్ ఏదో ఒక రకంగా అందరి జీవితాలను ప్రభావితం చేసింది. కరోనా వస్తే చనిపోతామేమోననే ఆందోళనతో దాదాపు అందరూ భయపడ్డవారే. అలాంటి కరోనా వైరస్, క్వారంటైన్, లాక్ డౌన్ పరిస్థితులు నేపథ్యంలోనే ఈ మూవీ తెరకెక్కింది.

ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఉదయ్, సంధ్య ఒక క్వారంటైన్ రూమ్ లో కలుసుకుంటారు. సరదాగా మొదలైన వీళ్ల పరిచయం కాస్త ప్రేమగా మారుతుంది. కానీ లాక్ డౌన్ లో వీరి ప్రేమ అనూహ్య మలుపులు తిరుగుతుంది. మరి మరి వీళ్ల ప్రేమకు ఎలాంటి ముగింపు లభించింది? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే.

ఇవి కూడా చదవండి

ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్..

కరోనా నాటి పరిస్థితులను ప్రతిబింబిస్తూ తెరకెక్కిన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ పేరు సంధ్యానామ ఉపాసతే. వంశీ, క్రిస్టెన్ రవళి అనే కొత్త నటీనటులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషించారు. దీప్తి వర్మ, పోసాని, జబర్దస్త్ అప్పారావు తదితరులు ప్రధాన పాత్రల్లో కనిపించారు. దీనికి స్టోరీ, స్క్రీన్ ప్లే, ఎడిటింగ్, డైరెక్షన్ ఇలా అన్నీ బాధ్యతలను ప్రొమో భాస్కర్ చూసుకున్నారు. సుబ్రహ్మణ్యం రాజు, చంద్రశేఖర్ ప్రసాద్, వీర వెంకట సత్య నారాయణ నిర్మించిన ఈ సినిమా గురువారం (జనవరి 22) నుంచి ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.