AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Cinema : ఓటీటీలో వెబ్ సిరీస్ సంచలనం.. కట్ చేస్తే.. దేశంలోనే ట్రెండింగ్ నంబర్ వన్.

ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న ఓ వెబ్ సిరీస్ గురించి మీకు తెలుసా.. ? ఏడు ఎపిసోడ్స్ ఉన్న ఈ సిరీస్ ఆద్యంతం ప్రేక్షకులను ఆకట్టుకుంది. క్షణక్షణం ఉత్కంఠ కలిగించే ఈ సిరీస్ రికార్డులు బద్దలు కొట్టింది. ఇప్పుడు నెంబర్ వన్ ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.

Cinema : ఓటీటీలో వెబ్ సిరీస్ సంచలనం.. కట్ చేస్తే.. దేశంలోనే ట్రెండింగ్ నంబర్ వన్.
Cinema (2)
Rajitha Chanti
|

Updated on: Jan 23, 2026 | 10:15 AM

Share

ప్రస్తుతం ఓటీటీలలో సరికొత్త కంటెంట్ చిత్రాలు దూసుకుపోతున్నాయి. థియేటర్లలో విడుదలైన సినిమాలతోపాటు మరికొన్ని ఒరిజినల్ వెబ్ సిరీస్ లు ట్రెండింగ్ అవుతున్నాయి. ఇప్పుడు మేము మాట్లాడుతున్న ఓ సిరీస్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఏడు ఎపిసోడ్‌ల ఈ సిరీస్ విడుదలైన వెంటనే దేశవ్యాప్తంగా నంబర్ వన్ స్థానంలో నిలిచింది.ఈ సిరీస్ IMDb రేటింగ్‌లు ఆకాశాన్ని చేరుతున్నాయి. ఉత్కంఠ, థ్రిల్‌తో నిండిన ఈ షో అందరిని ఆకట్టుకుంటుంది. ఈ సిరీస్ పేరు “తస్కారి: ది స్మగ్లర్స్ వెబ్.”

ఇందులో ఇమ్రాన్ హాష్మీ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సిరీస్ ద్వారా మరోసారి తన అద్భుతమైన నటనతో మరోసారి ప్రశంసలు అందుకుంటారు. అతని తాజా చిత్రం “తస్కరీ: ది స్మగ్లర్స్ వెబ్” దూసుకుపోతుంది. ఈ సిరీస్‌లో శరద్ కేల్కర్, నందీష్ సింగ్ సంధు, అమృత ఖాన్విల్కర్ కూడా కీలక పాత్రల్లో నటించారు. ఇమ్రాన్ హష్మీ ఈ స్మగ్లింగ్ సిరీస్‌లో గంభీరమైన, సంయమనం గల అధికారి అర్జున్ మీనా పాత్రకు ప్రాణం పోశారు. ఈ సిరీస్ ముంబై విమానాశ్రయం కారిడార్ల లోపల జరుగుతుంది. అక్కడ ప్రతి సంవత్సరం కోట్ల విలువైన బంగారం, విలువైన వస్తువులు దేశంలోకి అక్రమంగా రవాణా చేయబడతాయి.

ఈ సిరీస్ సూపరింటెండెంట్ అర్జున్ మీనా (ఎమ్రాన్ హష్మి) చుట్టూ తిరుగుతుంది, అతను ప్రశాంతమైన, చురుకైన మనస్తత్వం కలిగిన, నిజాయితీగల కస్టమ్స్ అధికారి. దేశంలో అక్రమ రవాణా అకస్మాత్తుగా పెరిగినప్పుడు, అంతర్జాతీయ స్మగ్లింగ్ సిండికేట్లను నిర్మూలించే లక్ష్యంతో ప్రభుత్వం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ సిండికేట్ కు ప్రధాన సూత్రధారి బడా చౌదరి (శరద్ కేల్కర్), అతను విదేశాల నుండి భారతదేశంలో అక్రమ వ్యాపారాన్ని నిర్వహిస్తాడు. ఈ సిరీస్ మొత్తం పిల్లి-ఎలుక ఆటగా, తెలివితేటలు, వ్యూహాల యుద్ధంగా సాగుతుంది.

ఈ స్మగ్లింగ్ సిరీస్ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన తర్వాత సంచలనం సృష్టించింది. ఇది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నంబర్ 1 ట్రెండింగ్‌లో దూసుకుపోతుంది. ఇమ్రాన్ హష్మీ సిరీస్ IMDbలో 7.3 అద్భుతమైన రేటింగ్‌ను పొందింది.

ఎక్కువ మంది చదివినవి : Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
ఓటీటీలో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్.. దేశవ్యాప్తంగా ట్రెండింగ్.
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
తాబేలు ఉంగరం మీ అదృష్టాన్ని మార్చేస్తుంది.. కానీ ఈ రాశులకు కాదు
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
'ధురంధర్ 2'లో మరో స్టార్ హీరో.. ఆదిత్య ధర్ ప్లాన్ మామూలుగా లేదుగా
సముద్రపు లోతుల్లోకి "ISRO' ప్రయాణం
సముద్రపు లోతుల్లోకి
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
అసలు మీరు ఐఏఎస్ కు ఎలా సెలక్టయ్యారు ?? విద్యార్థి ప్రశ్న
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
పురుషుని కడుపులో గర్భాశయం.. రిపోర్టు చూసి అవాక్కైన వ్యక్తి
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
ఇంటి నుంచే డ్రైవింగ్ లైసెన్స్‌లో అడ్రెస్ ఎలా మార్చుకోవాలో తెలుసా?
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
పండ్లు Vs జ్యూస్.. ఆరోగ్యానికి ఏది మంచిది..? మీరు ఊహించినది..
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
ఏపీ మీదుగా మరో అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. రూట్ వివరాలు ఇవిగో
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌
'డిజిటల్ లంచం'.. ఇప్పుడు షాకింగ్ ట్రెండ్‌