AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..

డైరెక్టర్ కృష్ణవంశీ సినిమాలకు ప్రత్యేక ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఇప్పిటవరకు ఎన్నో హిట్ చిత్రాలను రూపొందించారు. ఆయన తన కెరీర్ లో తెరకెక్కించిన చిత్రాల్లో ఖడ్గం ఒకటి. ఈ చిత్రంలో సినిమా పరిశ్రమ చీకటి కోణాన్ని ధైర్యంగా ఆవిష్కరించారు. దీనిపై పరిశ్రమ నుండి వ్యతిరేకత ఎదురైనా ఆయన పట్టించుకోలేదు. శ్రీకాంత్, సోనాలి బెంద్రేల నడుమ "నువ్వే నువ్వే" పాట చిత్రీకరణ అనుభవాలను కూడా పంచుకున్నారు.

Director Krishnavamsi : ఖడ్గం సినిమాలో ఆమె పాత్ర నిజమే.. ఆ సీన్ ఎందుకు చేశామంటే.. డైరెక్టర్ కృష్ణవంశీ..
Director Krishnavamsi
Rajitha Chanti
|

Updated on: Jan 21, 2026 | 12:37 PM

Share

డైరెక్టర్ కృష్ణవంశీ తన “ఖడ్గం” చిత్రానికి ఇప్పటికీ సెపరేట్ ఫ్యా్న్ బేస్ ఉంటుంది. ఈ మూవీ విడుదలై 22 సంవత్సరాలు దాటినప్పటికీ ఇంకా ఎంతోమంది ప్రశంసలు అందుకుంటుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో డైరెక్టర్ కృష్ణవంశీ తెలిపారు. హైదరాబాద్‌ను ఒక ముఖ్యమైన క్యారెక్టర్‌గా తీసుకున్నప్పుడు, సినిమా పరిశ్రమలోని ఒక ఎక్స్‌ప్లోయిటేషన్ యాంగిల్ తన దృష్టికి వచ్చిందని ఆయన వివరించారు. ఒక సంవత్సరం క్రితం తెలంగాణ గ్రామ ప్రాంతాల నుంచి ఇంట్లోంచి నగలు పట్టుకుని పారిపోయి వచ్చి, హీరోయిన్ అవుదామని వచ్చిన అమ్మాయి మోసపోయి, ఆత్మహత్య చేసుకున్న ఒక అమ్మాయి ఘటన తనకు చాలా బాధ కలిగించిందని, ఆ సంఘటన ప్రేరణతోనే సంగీత పాత్రను సృష్టించానని కృష్ణవంశీ వెల్లడించారు. ఈ చిత్రంలోని వివాదాస్పద సన్నివేశాల కారణంగా చాలా మంది విమర్శించినా, ద్వేషించినా తాను వాటిని పట్టించుకోలేదని, కేవలం నవ్వేసి ఊరుకున్నానని కృష్ణవంశీ పేర్కొన్నారు.

ఎక్కువమంది చదివినవి : Anantha Sriram: యూత్‏కు పిచ్చేక్కించేసిన పాట.. ఆ సాంగ్‏తో నా జీవితమే మారిపోయింది.. రచయిత అనంత్ శ్రీరామ్..

ఆ నిజ జీవిత ఘటన నుండే ఖడ్గం సినిమాలో సంగీత పాత్రను సృష్టించానని, సినిమా అవకాశాలు సులభంగా రావని, అనేక త్యాగాలు, సమస్యలు, టార్చర్‌లు ఉంటాయని ఆ పాత్ర ద్వారా చూపించానని కృష్ణవంశీ వెల్లడించారు. దీన్ని హైలైట్ చేయడం తన ఉద్దేశ్యం కాదని, రోజువారీ జీవితంలోని ఒక భాగాన్ని మాత్రమే చూపించానని ఆయన పేర్కొన్నారు. ఖడ్గం చిత్రంలోని ఈ సన్నివేశాల కారణంగా చాలా మంది తనను విమర్శించినా, ద్వేషించినా తాను వాటిని పట్టించుకోలేదని, కేవలం నవ్వేసి ఊరుకున్నానని కృష్ణవంశీచెప్పారు. ఈ సన్నివేశాల వల్ల తనకు ఏమైనా శత్రుత్వం పెరిగిందా అనేది తెలియదని, వాటిని తాను పట్టించుకోలేదని తెలిపారు.

ఎక్కువమంది చదివినవి : Serial Actress : ఒడియమ్మ బంటీ.. త్రోబ్యాక్ ఫోటోస్ షేర్ చేసిన సీరియల్ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా.. ?

“చందమామ” వంటి చాలా సినిమాలలో విలన్‌లు ఉండరని, తన సినిమాల్లో ఒక నెగటివ్ క్యారెక్టర్ ఉంటుందే తప్ప, ఆ నెగటివిటీని ప్రమోట్ చేయడానికి లేదా గ్లోరిఫై చేయడానికి తాను ఇష్టపడనని ఆయన వివరించారు. తన సినిమా చూసిన తర్వాత ఎవరికీ తప్పుడు ఆలోచనలు రాకూడదని, పాజిటివ్ ఫీలింగ్ రావాలని ఆయన ఆశిస్తానని అన్నారు. సినిమా సమాజంపై గొప్ప ప్రభావాన్ని చూపుతుందని కృష్ణవంశీ బలంగా నమ్ముతారు. హీరో అభిమానులు వారిని ఎందుకు అనుకరిస్తారో ఉదాహరణగా చూపిస్తూ, సినిమా అనేది కేవలం కనపడేది కాదని, రెండున్నర గంటల చీకటి ఆడిటోరియంలో ప్రేక్షకుల మనస్సు ఎలా ప్రభావితమవుతుందో ముఖ్యమని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Actor : అమ్మోరు సినిమా వల్లే నా కెరీర్‏ని నాశనం.. సగం షూట్ అయ్యాక.. నటుడు సంచలన కామెంట్స్..

చివరగా, ఖడ్గం చిత్రంలోని “నువ్వే నువ్వే” పాట గురించి ప్రస్తావిస్తూ, సోనాలి బెంద్రేతో ఆ పాట చిత్రీకరణ సమయంలో శ్రీకాంత్ చాలా సిగ్గుపడ్డాడని కృష్ణవంశీ గుర్తుచేసుకున్నారు. అమ్మాయిని పట్టుకోవడం, కౌగిలించుకోవడం, ముద్దుపెట్టుకోవడం వంటి సన్నివేశాలు చేసేటప్పుడు “వద్దు వంశీ” అని శ్రీకాంత్ పదేపదే అన్నారని, అతని ఆ సిగ్గే తెరపై ఆ ఇన్నోసెన్స్‌ను అద్భుతంగా పలికించిందని ఆయన అన్నారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
చనిపోయిన తర్వాత మీతో వచ్చేవి ఇవే.. నీడలా వెంటాడే ఆ మూడు రహస్యాలు
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఏకంగా 37 సిక్స్‌లు.. మనిషివా, సిక్సర్ మెషినివా భయ్యా..!
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఒక్క తెల్ల వెంట్రుక పీకితే జుట్టంతా తెల్లగా అవుతుందా.. అపోహలు..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఇన్‌స్టంట్ లోన్ యాప్స్‌లో డబ్బులు తీసుకునేవారికి అలర్ట్..
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
షూట్‌లో అలా గాజులు పగలుగొట్టాలి.. బాలకృష్ణ వచ్చి ఏం అన్నారంటే.!
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
ఆత్మలు, దెయ్యాలు నిజంగా ఉన్నాయా..
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
గంభీర్, అగార్కర్‌ల పెద్ద స్కెచ్! ఇకపై రో-కో 'బీ గ్రేడ్' ప్లేయర్సా
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
ఒక్క ఫోన్‌తో ఇంటివద్దకే పోలీసులు.. క్షణాల్లో చర్యలు.. ఏఏ కేసుల్లో
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
ఎయిడ్స్‌ సోకిన తల్లికి తోడుగా ఆసుపత్రికి 8 ఏళ్ల బాలుడు..చివరికి
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
గ్రీన్‌ల్యాండ్‌ ఎఫెక్ట్‌.. తులం బంగారం లక్షన్నర
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
వందే భారత్‌ టికెట్ క్యాన్సిల్ చేస్తే రిఫండ్ వస్తుందా ??
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
చంటి పిల్లాడిని ఎత్తుకుని.. కదిలే రైలు ఎక్కిన మహిళ.. కట్ చేస్తే..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
పెళ్లికాని ప్రసాదుల వెరైటీ ప్లాన్.. వధువు కావాలంటూ..
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
రూ.7 చోరీ కేసుపై.. 50 ఏళ్లకు తీర్పు.. అద్భుతం.. మహా అద్భుతం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అధికారుల నిర్లక్ష్యం.. చిన్నారికి తృటిలో తప్పిన ప్రాణాపాయం
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
అప్పుడు కాళ్ళ బేరానికి వచ్చి.. ఇప్పుడు యుద్ధాలకు నాయకుడయ్యాడు
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
వేలాదిమంది భక్తులతో కిటకిటలాడుతున్న మేడారం
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి
ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువయ్యాయి.. నేను చెప్పినట్టు చేయండి