AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..

ప్రస్తుతం ఓ హీరోయిన్ త్రోబ్యాక్ ఫోటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. కానీ నిజ జీవితంలో మాత్రం ఎన్నో సమస్యలు ఎదుర్కొంది. రెండు పెళ్లిళ్లు కలిసిరాలేదు. చివరకు 39 ఏళ్ల వయసులో తనతోటి కలిసి నటించిన నటుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా.. ?

Tollywood : ఒకప్పుడు తోపు హీరోయిన్.. చిరంజీవితో ఎక్కువ సినిమాలు.. 3 పెళ్లిళ్లు.. ఇప్పుడు రాజకీయాల్లో బిజీ..
Radhika
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2026 | 8:40 AM

Share

పైన కనిపిస్తున్న నటి ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు తెలుగులో అత్యధిక చిత్రాల్లో నటించి మెప్పించింది. చిన్న వయసులోనే నటిగా తెరంగేట్రం చేసిన ఆమె.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రాధిక శరత్ కుమార్. వెండితరెపై ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది. తెలుగులో ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవితో కలిసి అనేక హిట్స్ చేసింది. కానీ ఆమె రియల్ లైఫ్ మాత్రం ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండుసార్లు ఆమెకు పెళ్లి కలిసిరాలేదు. కానీ 39 ఏళ్ల వయసులో ఆమెకు నిజమైన ప్రేమ దొరికింది. రాధిక శరత్ కుమార్.. 1963 ఆగస్ట్ 21న జన్మించింది. ఆమె తండ్రి ఫేమస్ నటుడు ఎం.ఆర్ . రాధా. ఆమె చిన్నతనం అంత సాఫీగా సాగలేదు. 14 ఏళ్ల వయసులోనే లండన్ లో విధ్యాబ్యాసం పూర్తి చేసింది. 1977లో క్రిస్మస్ హాలీడేస్ కోసం చెన్నై వచ్చిన ఆమె ఫోటోను చూసి డైరెక్టర్ భారతీరాజా చూసీ ఇంప్రెస్ అయ్యాడు. వెంటనే ఆమెకు సినిమా ఆఫర్ ఇచ్చారు. 1978లో కిజక్కే పోగుమ్ రైల్ అనే సినిమాతో నటిగా తెరంగేట్రం చేసింది. దీనిని తెలుగులో తూర్పు వెళ్లే రైలు పేరుతో విడుదల అయ్యింది. ఆ తర్వాత ఆమె వెనుదిరిగి చూడలేదు. తెలుగుతోపాటు, సౌత్ ఇండస్ట్రీలోని అన్ని భాషలలో ఆమె బిజీ నటిగా మారిపోయింది.

సినీ కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే డైరెక్టర్ ప్రతాప్ పోతన్ ను ప్రేమించి 1985లో పెళ్లి చేసుకుంది. కానీ రెండేళ్లకే ఇద్దరు విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత 1990లో రిచర్డ్ హార్డీ అనే బ్రిటిష్ వ్యక్తిని పెళ్లి చేసుకుంది. వీరికి కూతురు రాయనే జన్మించింది. ఆ తర్వాత మళ్లీ ఇద్దరు విడిపోయారు. ఆ తర్వాత ఒంటరిగా గడిపిన రాధిక..తన స్నేహితుడు నటుడు శరత్ కుమార్ ను 2001లో పెళ్లి చేసుకుంది. వీరికి రాహుల్ అనే కొడుకు ఉన్నారు. ప్రస్తుతం రాధిక అటు సినిమాలతోపాటు ఇటు రాజకీయాల్లోనూ బిజీగా ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..