Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jani Master: జానీ మాస్టర్‌ కోసం పోలీసుల తీవ్ర గాలింపు .. అక్కడే తలదాచుకున్నాడా?

ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖి, భరోసా బృందాలు తగిన వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 18) బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు.

Jani Master: జానీ మాస్టర్‌ కోసం పోలీసుల తీవ్ర గాలింపు .. అక్కడే తలదాచుకున్నాడా?
Jani Master
Basha Shek
|

Updated on: Sep 18, 2024 | 5:08 PM

Share

లేడీ కొరియోగ్రాఫర్ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటోన్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. జానీ మాస్టర్ ప్రస్తుతం తన స్వస్థలం నెల్లూరులోనే ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. లైంగిక ఆరోపణలకు సంబంధించి డ్యాన్స్ మాస్టర్ కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. అలాగే ఆమె నుంచి ఇప్పటికే సఖి, భరోసా బృందాలు తగిన వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం (సెప్టెంబర్ 18) బాధితురాలి ఇంటికి వెళ్లనున్నారు. మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే బాధితురాలిపై జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు మతం మార్చుకుని , పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

మరోవైపు జానీ మాస్టర్‌పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. ఇందులో భాగంగానే బాధితురాలికి ఓ స్టార్ హీరో అండగా నిలబడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు ఆమెకు మద్దతు పలుకుతూ సినిమా అవకాశాలు కల్పిస్తానని భరోసా కూడా ఇచ్చాడని సమాచారం. అలాగే ఇతర నిర్మాతలు కూడా బాధితురాలికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కాగా ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును టాలీవుడ్‌ విచారణ ప్యానెల్‌ రికార్డు చేసింది. జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్యానెల్ అంటోంది. ‌

మరోవైపు జానీ మాస్టర్ కేసుకు సంబంధించి ఆందోళనలకు సిద్ధమవుతోంది బీజేపీ మహిళా మోర్చా. జానీని అరెస్ట్‌చేసి.. బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్దఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించింది. ఇది లవ్‌ జిహాదే అంటోంది బీజేపీ మహిళా మోర్చా. హిందూ అమ్మాయిని ట్రాప్‌చేసి.. మతం మారాలంటూ బెదిరించిన జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.