Pawan Kalyan: ఇదెక్కడి పిచ్చి తల్లి..! పవన్ కళ్యాణ్ తాగిన వాటర్ బాటిల్ దాచుకున్న లేడీ ఫ్యాన్..
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులతో పాటు, దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎంతగానో ఎదురుచూసిన ‘హరి హర వీరమల్లు’ చిత్రం భారీ అంచనాల నడుమ థియేటర్లలో అడుగుపెట్టింది. జూలై 23 రాత్రి నుంచే ప్రీమియర్ షోలు మొదలయ్యాయి. ధర్మం కోసం పోరాడిన వీరమల్లు పాత్రలో పవన్ కళ్యాణ్ ఒదిగిపోయిన తీరుకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఓ వైపు డిప్యూటీ సీఎంగా పదవీబాధ్యతలు నిర్వర్తిస్తూనే .. మరో వైపు హీరోగా సినిమాలు చేస్తూ అభిమానులను మెప్పిస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమాకు క్రిష్, జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఈ గురువారం (25న ) పేక్షకుల ముందుకు వచ్చింది. హిస్టారికల్ కథతో తెరకెక్కిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ బందిపోటుగా కనిపించారు. తొలి షో నుంచే హరిహరవీరమల్లు సినిమా మంచి టాక్ ను సొంతం చేసుకుంది. తొలి రోజు రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ కూడా సొంతం చేసుకుంది హరిహరవీరమల్లు.
ఇది కూడా చదవండి : ఇదెక్కడి మేకోవర్ రా మావ..! గుర్తుపట్టలేనంతగా మారిపోయిన ఉదయ్ కిరణ్ హీరోయిన్
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ బాధ్యతను స్వయంగా పవన్ కళ్యాణ్ బుజాలమీదకు ఎత్తుకున్నారు. రిలీజ్ కు మరికొన్ని రోజులు ఉందనగా ప్రమోషన్స్ కు హరాజయ్యారు పవన్. వరుసగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లోనూ పాల్గొన్నారు పవన్. ఇదిలా ఉంటే హరిహరవీరమల్లు మూవీ సక్సెస్ అవ్వడంతో తాజాగా చిత్రయూనిట్ సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు. ఈ సక్సెస్ మీట్ లో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది. సినిమాలో నటించిన ఓ నటి పవన్ కళ్యాణ్ తో ఫోటో దిగడానికి వచ్చింది. స్టేజ్ పైనే పవన్ తో ఫోటో దిగడంతో పాటు ఆయనను హగ్ చేసుకుంది.
ఇది కూడా చదవండి :నాన్న ప్రతిరూపం మా తారకరాముడు..! అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్న వీడియో
అమ్మాయితో ఫోటో అనేసరికి పవన్ కళ్యాణ్ పాపం సిగ్గు పడ్డారు. ఆమె మాత్రం ఉత్సహంతో గంతులేసింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. పవన్ అభిమానులు ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు. కాగా ఈ సక్సెస్ ఈవెంట్ లో ఆమె ఓ యూట్యూబ్ ఛానల్ తో మాట్లాడుతూ.. తాను పవన్ కళ్యాణ్ కు వీరాభిమానిని అని తెలిపింది. అంతే కాదు పవన్ కళ్యాణ్ తగిన వాటర్ బాటిల్ ను కూడా బద్రంగా దాచున్నాను అని చెప్తూ.. హ్యాండ్ బ్యాగ్ లో నుంచి పవన్ తాగిన వాటర్ బాటిల్ ను చూపించింది. ఈ వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి :ఈ అమ్మాయి కళ్ళతోనే కట్టిపడేసింది.. రాజమౌళికి బాగా నచ్చిన హీరోయిన్ ఈ అమ్మడేనట
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








