నాన్న ప్రతిరూపం మా తారకరాముడు..! అభిమానుల కళ్లు చెమ్మగిల్లేలా చేస్తున్న వీడియో
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎన్టీఆర్ కు ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఎన్టీఆర్ సినిమా వస్తుందంటే చాలు ఫ్యాన్స్ కు పండగే.. థియేటర్స్ దద్దరిల్లాల్సిందే.. ఫ్యాన్స్ పూనకాలతో ఉగిపోతుంటారు. ఇక ఎన్టీఆర్ డాన్స్ కు , నటనకు ఫిదా కానీ ప్రేక్షకులు ఉండరు.

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ త్వరలోనే వార్2 సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి వార్ 2 సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాతో పాటు ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. అలాగే దేవర 2లోనూ నటిస్తున్నారు ఎన్టీఆర్. కాగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఓ వీడియోను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు. ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణకు సంబంధించిన ఓ పాత వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో హరికృష్ణను చూసిన నందమూరి ఫ్యాన్స్ అచ్చం ఎన్టీఆర్ లానే ఉన్నారు అంటూ తెగ మురిసిపోతున్నారు. అలాగే కొంతమంది ఎమోషనల్ కామెంట్స్ చేస్తున్నారు.
ఇది కూడా చదవండి : బెడిసికొట్టిన సర్జరీ.. గుర్తుపట్టలేనంతగా మారిన నటి.. తిట్టిపోస్తున్న నెటిజన్స్
సోషల్ మీడియాలో హరికృష్ణకు సంబంధించిన ఓ పాత వీడియో చక్కర్లు కొడుతుంది. ఈ వీడియోలో హరికృష్ణ నవ్వుతూ మీడియాతో మాట్లాడుతూ కనిపించారు. ఈ వీడియాలో హరికృష్ణ.. అచ్చం జూనియర్ ఎన్టీఆర్ లానే ఉన్నారు. దాంతో నందమూరి అభిమానులు ఈ వీడియాను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు. హరన్నను చూస్తుంటే తారక్ అన్నాను చూసినట్టే ఉంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు అభిమానులు. హరికృష్ణ హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి మెప్పించారు. హరికృష్ణ ఓ రోడ్డు ప్రమాదంలో కన్ను మూసిన విషయం తెలిసిందే..
ఇది కూడా చదవండి : ఎలాంటి అమ్మాయి ఎలా మార్చేశారా..! నటనతో పిచ్చెక్కించిన ఈ భామ ఎవరో తెలుసా..?
2018, ఆగస్టు 29 న జరిగిన రోడ్డు ప్రమాదంలో హరికృష్ణ కన్నుమూశారు. ఉదయం 4:30గంటలకు హైదరాబాదు నుండి మరో ఇద్దరు వ్యక్తులతో కలసి స్వయంగా కారు నడుపుతూ కావలిలో జరగబోయే ఒక పెళ్ళికి వెళ్తున్న సమయంలో కారు అదుపుతప్పి బోల్తాపడింది. ప్రమాదం జరిగినపుడు కారు పలుసార్లు పల్టి కొట్టడం వలన తీవ్రగాయాలలైన హరికృష్ణను నార్కట్‌పల్లి లోని కామినేని హాస్పిటల్ కు తరలించి చికిత్స అందించారు, అయినా ఫలితం లేకపోయింది.
ఇది కూడా చదవండి :18ఏళ్లకే పెళ్లైంది.. 20 ఏళ్లకే తల్లైంది.. రెండు సార్లు విడాకులు.. చివరకు ఇప్పుడు ఇలా
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








