దర్శకత్వం వైపు అడుగులు వేస్తోన్న హీరోయిన్..!

విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించ‌కుంది న‌టి నిత్యామీనన్. ఆమె ఓ సినిమాలో పాత్ర ఒప్పుకుందంటే..త‌ప్ప‌కుండా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల న‌మ్మ‌కం. అయితే తాజాగా ఆమె అడుగులు ద‌ర్శ‌క‌త్వంవైపు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అది కూడా సొంతగా రాసిన క‌థ‌తోనే ఆమె ద‌ర్శ‌కురాలిగా మార‌నున్నార‌ట‌. తాజాగా లాక్‌డౌన్‌ కారణంగా మూవీ షూటింగులు నిలిచిపోవడంతో ఈ విరామంలో నిత్యామీనన్‌ రచయిత్రిగా మారిన‌ట్లు సమాచారం. ప‌లు స్క్రిప్ట్స్ ఆమె సిద్దం చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి అవి ఎప్పుడు ప‌ట్టాలెక్కుతాయో చూడాలి. […]

  • Ram Naramaneni
  • Publish Date - 3:51 pm, Fri, 19 June 20
దర్శకత్వం వైపు అడుగులు వేస్తోన్న హీరోయిన్..!

విల‌క్ష‌ణ పాత్ర‌ల్లో న‌టిస్తూ..త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక‌త‌ను సంపాదించ‌కుంది న‌టి నిత్యామీనన్. ఆమె ఓ సినిమాలో పాత్ర ఒప్పుకుందంటే..త‌ప్ప‌కుండా ప్రాధాన్య‌త ఉంటుంద‌ని ప్రేక్ష‌కుల న‌మ్మ‌కం. అయితే తాజాగా ఆమె అడుగులు ద‌ర్శ‌క‌త్వంవైపు ప‌డుతున్న‌ట్లు తెలుస్తోంది. అది కూడా సొంతగా రాసిన క‌థ‌తోనే ఆమె ద‌ర్శ‌కురాలిగా మార‌నున్నార‌ట‌. తాజాగా లాక్‌డౌన్‌ కారణంగా మూవీ షూటింగులు నిలిచిపోవడంతో ఈ విరామంలో నిత్యామీనన్‌ రచయిత్రిగా మారిన‌ట్లు సమాచారం. ప‌లు స్క్రిప్ట్స్ ఆమె సిద్దం చేసిన‌ట్టు తెలుస్తోంది. మ‌రి అవి ఎప్పుడు ప‌ట్టాలెక్కుతాయో చూడాలి.

ఇటీవ‌ల నిత్యామీనన్ డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌లో అడుగుపెట్టింది. ‘బ్రీత్‌ ఇన్‌ టూ దీ షాడోస్‌’ వెబ్‌సిరీస్‌లో యాక్ట్ చేసింది. ఈ సిరీస్‌లో నిత్యామీనన్‌తో పాటు అభిషేక్‌బచ్చన్‌, సయామీఖేర్ లీడ్ రోల్స్ లో నటించారు. జూలై 10న ఈ వెబ్‌సిరీస్ రిలీజ్ కానుంది.