చనిపోయే మూడు రోజుల ముందే స్టాఫ్‌కు జీతాలు..!
బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు అన్వేశిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సుశాంత్ కుటుంబసభ్యులు, స్టాఫ్, స్నేహితులను విచారించిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వెనుక ఉన్న కారణాలు అన్వేశిస్తున్నారు పోలీసులు. ఇప్పటికే సుశాంత్ కుటుంబసభ్యులు, స్టాఫ్, స్నేహితులను విచారించిన పోలీసులు కీలక సమాచారం సేకరించారు. అయితే సూసైడ్ చేసుకోవడానికి మూడు రోజుల ముందు సుశాంత్ తన వద్ద పనిచేస్తోన్న సిబ్బందికి జీతాలు చెల్లించాడని సమాచారం. కొద్దిరోజుల తర్వాత జీతాలు ఇవ్వడం తనకు కుదరదని ఆయన చెప్పినట్లు పోలీసులకు స్టాఫ్ తెలిపారట. మరోవైపు ఓ వెబ్‌సిరీస్‌లో యాక్ట్ చెయ్యమని కోరుతూ ఇటీవల సుశాంత్ తన మాజీ మేనేజర్ దిశాని అడిగారని హీరో ప్రస్తుత మేనేజర్ పోలీసులకు వివరించారు. దీంతో పోలీసులు సుశాంత్ ఫోన్ డేటా పరిశీలించగా.. ఆయన మార్చి నెలలో లాస్ట్ టైమ్ దిశాతో వాట్సాప్ చాట్ చేసినట్లు తెలిసింది.
కాగా సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ అస్థికలను ఆయన ఫ్యామిలీ మెంబర్స్ గంగానదిలో కలిపారు. సుశాంత్ తండ్రి, సోదరితో పాటు, పలువురు బంధువులు మాత్రమే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.




