సుశాంత్ మరణంతో కలత చెందిన ఓ యువతి ఆత్మహత్య

బాలీవుడ్‌ యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం.. ఓ యువతిని ఆత్మహత్యకు ఉసిగొల్పేలా చేసింది. విశాఖపట్నం శ్రీహరిపురంకు చెందిన ఓ కుటుంబం బీహార్‌ నుంచి వలస వచ్చింది. వారి కుమార్తె అయిన 21 ఏళ్ల సుమన్‌ కుమారి ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేదు. టిక్‌ టాక్ వ్యసనంకు తోడు సుశాంత్‌ సింగ్‌ అంటే ఆమెకు ప్రాణం. అతని మరణానికి సంబంధించిన విజువల్స్‌ టిక్‌టాక్‌లో వైరల్ కావడంతో […]

సుశాంత్ మరణంతో కలత చెందిన ఓ యువతి ఆత్మహత్య
Sanjay Kasula

|

Jun 19, 2020 | 11:58 AM

బాలీవుడ్‌ యువహీరో సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మరణం.. ఓ యువతిని ఆత్మహత్యకు ఉసిగొల్పేలా చేసింది. విశాఖపట్నం శ్రీహరిపురంకు చెందిన ఓ కుటుంబం బీహార్‌ నుంచి వలస వచ్చింది. వారి కుమార్తె అయిన 21 ఏళ్ల సుమన్‌ కుమారి ఓ ప్రైవేట్‌ స్కూల్లో టీచర్‌గా పనిచేస్తోంది. లాక్ డౌన్ కారణంగా ఇంటి నుంచి బయటకు రాలేదు.

టిక్‌ టాక్ వ్యసనంకు తోడు సుశాంత్‌ సింగ్‌ అంటే ఆమెకు ప్రాణం. అతని మరణానికి సంబంధించిన విజువల్స్‌ టిక్‌టాక్‌లో వైరల్ కావడంతో ఆ యువతి డిప్రెషన్‌లోకి వెళ్లిపోయింది. సుశాంత్‌ చనిపోయినప్పటి నుంచి ఇంట్లో కూడా ఎవరితోనూ మాట్లాడడం లేదని కుటుంబ సభ్యులు వెల్లడించారు. వైద్యులకు చూపిద్దామని అనుకునేంతలో ప్రాణాలను తీసుకుందని తెలిపారు. ఈ క్రమంలో తన బెడ్‌రూంలోకి వెళ్లి ఉరివేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu