ప్రారంభమైన రాజ్యసభ ఎన్నికల పోలింగ్
ఏపీలో రాజ్యసభ్య ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డితో పాటు పార్టీ ఎమ్మెల్యేలంతా ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది...
ఏపీలో రాజ్యసభ్య ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. నాలుగు స్థానాలకు వెలగపూడిలోని అసెంబ్లీ హాలులో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. పోలింగ్ ముగిసిన రెండు గంటల్లో ఫలితాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.బాలకృష్ణమాచార్యులు వెల్లడించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే నాలుగు సీట్లకు గాను ఐదుగురు పోటీలో ఉన్నారు. అధికార వైసీపీ నుంచి ఎమ్మెల్సీలు మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్, మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సోదరుడు అయోధ్య రామిరెడ్డి, మరో వ్యాపారవేత్త పరిమళ్ నత్వానీ వైసీపీ నుంచి బరిలో ఉన్నారు.
ఇక టీడీపీ నుంచి వర్ల రామయ్య పోటీ చేస్తున్నారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలకు టీడీపీ విప్ జారీ చేసింది. పార్టీకి దూరంగా ఉంటున్న ముగ్గురు ఎమ్మెల్యేలకు కూడా విప్ జారీ చేసింది. అభ్యర్థి వర్ల రామయ్యకు ఏజెంట్‌గా ఎమ్మెల్సీ అశోక్‍బాబు.. పార్టీ తరపున ఏజెంట్‍గా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్రప్రసాద్ ఉండనున్నారు. సభ్యులంతా ఓటింగ్‍లో పాల్గొనాలని చంద్రబాబు సూచించారు. ప్రతి ఒక్కరూ ఏజెంట్‍కు చూపించి ఓటు వేయాలని నిబంధన పెట్టారు.